నాగకేసరి నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
===నూనెను తీయుట===
సాధారణంగా పండి నేల రాలిన పళ్ళను సేకరించడం జరుగుతుంది. సేకరించిన పళ్లను దుడ్డుకర్రవంటిదుడ్డు కర్రవంటి వాటితో బాది/నలగకొట్టి పళ్ళనుండి నూనె గింజలను వేరుచేయుదురు. సేకరించిన నూనె గింజలు పచ్చిగా వుండి తేమ శాతం అధికంగా వుండును. నూనెగింజలను కళ్లంలో ఆరబెట్టిన 50% వరకు బరువు తగ్గును. నిల్వ వుంచునప్పుడు చీడపీడలు ఆశించకుండుటకై 0.1% అల్‍డ్రెక్సు(Aldrex)ను నేలమీద చల్లెదరు. ఆతరువాత0.1%(నిల్వ వుంచిన గింజల పరిమాణంలో)హెక్షడొల్(hexadol)ను గుంజలపై తరచుగా పిచికారి చేయుచుందురు. గింజలపైనున్న పెంకు(shell)ను పొట్టుతొలగించు యంత్రాల (Decorticators)ద్వారా తొలగించి, విత్తా లను నూనెతీయు యంత్రాలలో(expellers)ఆడించి నూనెను తీయుదురు. నూనె బాగా దిగుబి రావటానికి విత్తనాలకు చిట్టూ(హల్లరు తవుడు)ను కలిపి యంత్రాలలో ఆడించెదరు.కేకులో మిగిలివున్న నూనెను సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ప్లాంట్ ద్వారా తీయుదురు.
 
===నూనె లక్షణాలు===
నూనె గింజలో (seed) నూనెశాతం 40-45% వరకుండును. పైపెంకును తొలగించిన తరువాత విత్తనం (kernel) లో60-77% వరకుండును.నూనె చిక్కగా వుండును. స్నిగ్ధత అధికం.నూనె ఎరుపుగా లేదా ముదురు బ్రౌన్ రంగులో వుండును. చేదురుచి కలిగి, వికారంపుట్టించే వాసనతో వుండును. ఈ నూనె ఆహరయోగ్యంకాదు.పారిశ్రామిక రంగంలో ఇతర ప్రయోజనాలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/నాగకేసరి_నూనె" నుండి వెలికితీశారు