స్వలింగ సంపర్కం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 68:
4. 1950 నుండి ఐపీసీకి 30 సవరణలు జరిగాయి. 2013లో జరిగిన ఒక సవరణ ప్రత్యేకించి లైంగిక నేరాలకు సంబంధించినదే. ఈ సెక్షన్‌ను రద్దు చేయాలని 172వ లా కమిషన్‌ నివేదిక ప్రత్యేకంగా సిఫార్సు చేసింది. ఈ అంశం పలుమార్లు చర్చకు వచ్చింది. అయినా ఈ చట్టాన్ని సవరించాలని శాసనవ్యవస్థ అనుకోలేదు. స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలా వద్దా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పార్లమెంటుదే. ఐపీసీ సెక్షన్ 377ను తొలగించే అధికారం పార్లమెంటుదేనని, అప్పటివరకు దానికి చట్టబద్ధత ఉంటుంది.
==శిక్ష ఏమిటి?==
53 కామన్‌వెల్త్ దేశాలలో [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్]], నేపాల్‌వంటి[[నేపాల్‌]]వంటి 41 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరంగానే పరిగణిస్తున్నాయి. [[ఇరాక్]], [[నైజీరియా]], మాస్కో, కామెరూన్, [[యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్]] వంటి అనేక దేశాలలో స్వలింగ సంపర్కలు జైళ్ళకు నెట్టబడుతున్నారు. కొన్ని సందర్భాలలో శిరచ్ఛేదనకు కూడా గురవుతున్నారు. మనదేశంలో ఐపిసిలోని 377 సెక్షన్ ప్రకారం గరిష్ఠంగా యావజ్జీవ శిక్ష పడే అవకాశముంది. సెక్షన్ 377ను సవాల్ చేస్తూ నాజ్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు 2009 జూలై 2న పరస్పర సమ్మతితో యుక్తవయస్కులు స్వలింగ సంపర్కానికి పాల్పడితే నేరం కాదని పేర్కొంది. లార్డ్ మెకాలే 1860లో రూపొందించిన భారతీయ శిక్షా స్మృతిలోని 377 సెక్షన్‌లో స్వలింగ సంపర్కాన్ని మళ్ళీ ఇప్పుడు చట్టవిరుద్ధంగా ప్రకటించారు. 1861 నుంచి ఇది అమలులోకి వచ్చింది. భారత శిక్షాస్మృతి సెక్షన్ 377 (అసహజ నేరాలు) ప్రకారం ప్రకృతి విరుద్ధమైన శృంగార కార్యకలాపానికి పాల్పడినవారికి పదేళ్ళ దాకా శిక్ష విధించేందుకు అవకాశముందని [[సుప్రీంకోర్టు]] తెలిపింది దీని ప్రకారం స్వలింగ సంపర్కులకు గరిష్ఠంగా జీవిత ఖైదు విధించవచ్చు. బ్రిటన్‌లో ఈ చట్టానికి 1967లో సవరణ చేశారు. 21 ఏళ్లు దాటిన వారు పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కానికి పాల్పడితే చట్టవిరుద్ధం కాదని మార్పు చేశారు.
 
==స్వలింగ వివాహాలు==
స్వలింగ సంపర్కుల మధ్య పెళ్ళిళ్లను చట్టబద్ధం చేసిన తొలి దేశం డెన్మార్క్. 2001లో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఉరుగ్వే, న్యూజీలాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, కెనడా, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియం, ఐస్‌ల్యాండ్, అర్జెంటీనా వంటి దేశాలు స్వలింగ సంపర్కుల మధ్య పెళ్ళిళ్లను చట్టబద్ధం చేశాయి. ఈ ఏడాదే బ్రిటన్ ఆమోదం తెలిపింది. అయితే చర్చి అధికారులను మాత్రం చట్టం నుంచి మినహాయించారు. న్యూజీలాండ్‌లో విదేశీయులు కూడా పెళ్ళి చేసుకునే వెసులుబాటు ఉంది. ఉరుగ్వేలో మామూలు పెళ్ళికి, స్వలింగ సంపర్కుల పెళ్ళికి ఒకే విధమైన నిబంధనలను రూపొందించారు.అయితే 12.12.2013 న ఆస్ట్రేలియాలో గే వివాహం చట్టం రద్దు చేస్తూ ఆస్టేలియా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఫ్రాన్స్‌లో స్వలింగ సంపర్క దంపతులు పిల్లలను దత్తత తీసుకోడానికి అనుమతిస్తూ చట్టం ఉంది. 377 నిబంధన కేవలం స్వలింగ సంపర్కులకే కాదు దీని ప్రకారం గుద సంభోగం, అంగచూషణం, జంతువులతో సంభోగం.. అన్నీ నిషిద్ధాలే. పునరుత్పత్తికి దోహదం చెయ్యని ఏ రకమైన లైంగిక క్రియ అయినా ఈ నిబంధన ప్రకారం శిక్షార్హమే. ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని సెక్స్‌ వర్కర్లనూ, స్వలింగ సంపర్కులనూ వేధించే పనీ దేశంలో నిరాఘాటంగా సాగిపోతోందని, కాబట్టి ఈ నిబంధనను తొలగించటం చాలా అవసరమని 'హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌' వంటి సంస్థలు ఉద్యమాలు ఆరంభించాయి. ముఖ్యంగా దేశంలో హిజ్రాలపై వేధింపులు ఎక్కువయ్యాయనీ, వారికి కనీస మానవ హక్కులు కూడా దక్కటం లేదని, హక్కుల సంస్థలు వాదించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ నిబంధనపై చర్చ వూపందుకుంది. దీన్ని తొలగించటం అవసరమని, అప్పుడే తమకు సామాజిక గుర్తింపు, సమర్థన లభిస్తుందని, తమపై వేధింపులు తగ్గుతాయని స్వలింగ, ద్విలింగ సంపర్కులూ, హిజ్రాలూ (లెస్బియన్‌, గే, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌-ఎల్‌జీబీటీ) బహిరంగంగా డిమాండు చేయటం ఆరంభించారు.
"https://te.wikipedia.org/wiki/స్వలింగ_సంపర్కం" నుండి వెలికితీశారు