స్వలింగ సంపర్కం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
== శాస్త్రవేత్తల అభిప్రాయం ==
యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో అధ్యాపకుడిగా పనిచేసిన బ్రూస్ బాగ్‌మిల్ బయోలాజికల్ ఎగ్జూబరెన్స్: యానిమల్ హోమోసెక్సువాలిటీ అండ్ నేచురల్ డైవర్సిటీ అనే పుస్తకంలో 450 రకాల పాలిచ్చే జీవులపైన, పక్షులపైన, కీటకాలపైన, జంతువులపైన శాస్త్రీయంగా పరిశోధనచేసి వాటిలోని స్వలింగ సంపర్క ధోరణులను, పుంసక మార్పిడి ధోరణులను (ట్రాన్స్‌జెండర్ బిహేవియర్) సవివరంగా చర్చించారు. పురుష స్వలింగ సంపర్కులందర్నీ కలిపి గతంలో 'గేస్' (Gays) అనే పదం వాడేవారు కాని ఇప్పుడు మాత్రం వారిని ఎం.ఎస్.ఎం.లు అంటున్నారు. ఎంఎస్ఎం అంటే మాన్ టు మాన్ సెక్స్ అని.
 
==సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం==
బలాత్కారములేని స్వచ్ఛంద స్వలింగసంపర్కం కూడా సహజీవనం లాగానే నేరము కాదు, పాపము కాదు . 377 వ నిబంధనకు సవరణ కోర్టులు తేల్చాల్సిన అంశం కాదు. ఇది కీలకమైన సామాజికాంశం. దీనిపై పార్లమెంట్‌ చర్చించి, నిర్ణయంతీసుకోవాలి. నిబంధనను మార్చే అధికారం పార్లమెంట్‌కే ఉంది. కాబట్టి కేంద్రం ఇప్పటికైనా ఒక నిర్ణయానికి రావాలి. పార్లమెంట్‌లో చర్చించాలి. మనుషులు జంతువులకు భిన్నంగా ఇలా వుండాలి అనే కట్టుబాటు ఉంది.స్వలింగ సంపర్కాన్నే నేరంగా భావించాలా?లేక స్వలింగ వివాహాన్ని కూడానా? బహుభార్యత్వం, సహజీవనం, వ్యభిచారం, ఐచ్చిక శృంగారం పేరేదైతేనేం జరిగేది సంభోగమే. అయితే ఆ సంభోగమైనా సహజీవనమైనా పరపీడనలేని పద్ధతిలో మాత్రమే జరగాలి.నవీన కాలపు వైద్యులు వ్యభిచారం, అత్యాచారాలకు పాల్పడేదానికంటే కంటే హస్తప్రయోగమే మంచిదని సలహాలిస్తున్నారు.అత్యాచారాను ఆపటం కోసం హస్తప్రయోగాలను ప్రోత్సహిస్తున్నారు. అలాగే సమాజంలో చోటుచేసుకున్న వికృత పోకడలలో బహుభార్యత్వం, వ్యభిచారం, అత్యాచారం లాంటి కుళ్ళు కన్నా స్వలింగ సంపర్కం, సహజీవనం లాంటి పుచ్చు మెరుగు అనిపిస్తోంది. వాత్సాయన కాలం నుండి నేటి వరకు ఏ సమాజము కాని చట్టాలు కాని శృంగారం దంపతుల మధ్యనే వుండాలని పరిమితులు విధించలేదు.పరపరాగ సంపర్కాన్ని అరికట్టనూ లేదు.అది అరికట్టలేనిది.అయితే స్వేచ్ఛా సంభోగాలను అరికట్టాలనే ఉద్దేశంతో లౌకిక నాగరిక సమాజం నైతికత ముసుగును కప్పుకుంది అంతే. శృంగారం ఇరువురు వ్యక్తుల మధ్య అభీష్టానుసారం జరిగితే అభ్యంతరకరం కానవసరం లేదు. సామాజిక కట్టుబాట్లు ఎన్నో పెట్టినా వ్యభిచారం ఆగలేదు.వ్యభిచారం వేరు, అత్యాచారం వేరు .ఐచ్చిక శృంగారం వేరు . పురాణ ఇతిహాస కాలం నుండి నేటి చట్టాల వరకు వాటిలో ఐచ్ఛిక శృంగారానికి అభ్యంతరాలు లేవు. నాగరిక సమాజంలో నాటి జంతుసామ్య వ్యవస్థలో జీవించినట్లుగానే జీవిస్తామంటే కుదరదు.బయట పడాలి.చెప్పేదొకటి చేసేదోకటి ఉండకూడదు.సామాజిక జీవన వ్యవస్థలో మార్పులకు అనుగుణంగానే చట్టాలలో కూడా నైతికతను పటిష్ఠపరుచుకోవాలి. లైంగిక సంపర్కం కోసం పశువులా బలత్కరించడాన్ని నేరంగా పరిగణించాలి. లైంగిక సంపర్కం కోసం బలత్కరించడమంటే వ్యక్తి స్వేఛ్చకు భంగం కలిగించడమే. లైంగిక సంపర్కం కోసం బలత్కరించేవారిని శిక్షించాలి. అదే సందర్భంలో పరస్పర ఇష్టపూర్వకంగా జరిగే లైంగిక సంపర్కాలను నేరంగా, తప్పుగా పరిగణించకూడదు.స్వలింగ సంపర్కం రోగమైతే వైద్యము చేసి నయం చేయాలి. నేరమైతే కోర్టుద్వారా శిక్షించాలి.రోగికైనా, ఖైదీకైనా ప్రాథమిక హక్కుల్నిమాత్రం ప్రసాదించాలి.వాటిని కాలరాయకూడదు.<ref>http://uttaralu1.blogspot.in/2013/12/blog-post_718.html</ref>
"https://te.wikipedia.org/wiki/స్వలింగ_సంపర్కం" నుండి వెలికితీశారు