యార్లగడ్డ లక్ష్మీప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కూడ → కూడా , విశిష్ఠ → విశిష్ట, → (2), , → , using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
నవంబర్ 24, 1953లో [[కృష్ణా జిల్లా]] [[గుడివాడ]] దగ్గర [[వానపాముల]]లో జన్మించిన '''యార్లగడ్డ లక్ష్మీప్రసాద్''' ఆంధ్ర విశ్వకళా పరిషత్, [[హిందీ]] విభాగములో ఆచార్యుడు. హిందీలో యం.ఎ. పట్టా పొంది, [[తెలుగు]], [[హిందీ]] భాషలలో పి.హెచ్.డి. పట్టాలు సాధించాడు. [[నందిగామ]] కె.వి.ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా, [[ఆంధ్ర లయోలా కళాశాలలోలయోలాకళాశాల]]లో హిందీ విభాగపు అధ్యక్షునిగా పనిచేసిన పిదప [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]], హిందీ విభాగములో ఆచార్య పదవి పొందినాడు. ఆచార్యునిగా 29 మంది విద్యార్థులకు పి.హెచ్.డి. మార్గదర్శకము చేశాడు. హిందీ భాష, సాహిత్యములలో విశేష కృషి చేస్తున్నాడు. పలు తెలుగు గ్రంథాలు హిందీలోకి అనువాదము చేశాడు. తెలుగులో[[తెలుగు]]లో 32 పుస్తకాలు రచించాడు. [[రాజ్యసభ]] సభ్యునిగా (1996-2002) కూడా సేవలందించాడు.
 
లక్ష్మీ ప్రసాద్ సాంస్కృతిక సాహితి రాయబారిగా [[యు.ఎస్.ఎ]]., [[మలేషియా]], [[కెనడా]], [[ధాయ్ లాండ్]], [[సింగపూరు]], [[ఇంగ్లాండ్]], [[ప్రాన్స్]], [[మారిషన్]], [[రష్యా]] వంటి అనేక దేశాలు పర్యటించాడు. ప్రొపెసర్ ముదిగొండ శివప్రసాద్ రచించిన '''పట్టాభి ''' అనే ప్రముఖ చారిత్రిక నవలను ఈయనకు అంకితమిచ్చాడు.
 
లక్ష్మీప్రసాద్‌ ప్రతిష్ఠాత్మక '''సాహిత్యఅకాడమీ అవార్డు-2009'''కి ఎంపికయ్యాడు. ఆయన వ్రాసిన 'ద్రౌపది' తెలుగునవలకుగాను ఈ పురస్కారం వరించింది. లక్ష్మీప్రసాద్‌కు సాహిత్యఅకాడమీ అవార్డురావడం ఇది రెండోసారి. బిషన్‌ సహానీ వ్రాసిన 'తామస్‌' అనే హిందీపుస్తకాన్ని తెలుగులోకి అనువదించినందుకు 1992లో ఆయన సాహిత్యఅకాడమీ అనువాద అవార్డును పొందాడు. కాగా, ఈ సారి ద్రౌపది పాత్రలో స్త్రీ ఔన్నత్యాన్ని విలక్షణంగా ఆవిష్కరించినందుకు సాహిత్య అకాడమీ సృజనాత్మక అవార్డుకు ఆయన ఎంపికయ్యాడు. ఒకే రచయిత రెండుసార్లు ఈ గౌరవాన్ని అందుకోవడం ఇదే తొలిసారి.
 
సాహిత్యరంగానికి విశిష్టసేవలు అందించినందుకు ప్రతి సంవత్సరం ఇచ్చే, '''గురజాడ విశిష్ట పురస్కారం''' 2015 వ సంవత్సరానికి వీరికి బహుకరించనున్నారు. 2015,నవంబరు-30వ తేదీ సాయంత్రం 6 గంటలకు, విజయనగరంలోని[[విజయనగరం]]లోని ఆనంద గజపతి అడిటోరియంలో నిర్వహించే గురజాడ శతవర్ధంతి సందర్భంగా వీరికి ఈ పురస్కారం అందించెదరు. [1]
 
==పురస్కారాలు, పదవులు==