ఆమిర్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

+బాంబే స్కాటిష్ పాఠశాల లింకు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆమిర్ ఖాన్ '''(జననం 14 మార్చి 1965) ప్రముఖ [[బాలీవుడ్]] నటుడు, [[దర్శకుడు]], నిర్మాత. భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటునిగా కూడా ఆయన ప్రసిద్ధుడు.<ref><cite class="citation web">[http://specials.rediff.com/movies/2006/aug/17sd11.htm "Readers' Picks: Top Bollywood Actors"]. </cite></ref><ref><cite class="citation web">[http://specials.rediff.com/movies/2006/aug/08sld11.htm "Powerlist: Top Bollywood Actors"]. </cite></ref> ఆమిర్ అసలు పేరు '''మహమద్ ఆమిర్ హుస్సేన్ ఖాన్'''. ఆయన నాలుగు జాతీయ పురస్కారలతో పాటు ఏడు [[ఫిల్మ్‌ఫేర్|ఫిలింఫేర్]] పురస్కారాలు కూడా అందుకున్నారు. భారత ప్రభుత్వం 2003లో పద్మశ్రీ, 2010లో పద్మ భూషన్ పురస్కారాలతో ఆయనను గౌరవించింది.<ref name="Padma Awards"><cite class="citation web">[http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf "Padma Awards"] (PDF). </cite></ref>
 
పెద్దనాన్న నాసిర్ హుస్సేన్ తీసిన యాదోంకీ బారాత్(1973) చిత్రంలో చిన్నపాత్రలో మొదటిసారి నటించారు ఆమిర్. ఆ తరువాత హోలీ సినిమాలో నటించిన ఆయన హీరోగా ఖయామత్ సే ఖయామత తక్(1988) సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలోనూ, ఆ తరువాత చేసిన రాఖ్(1989) సినిమాలోనూ ఆయన నటనకు జాతీయ పురస్కారాల ఫంక్షన్ లో ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. 1990వ దశకంలో ఆయన నటించిన దిల్(1990), రాజా హిందుస్థానీ(1996), సర్ఫరోష్(1994) వంటి సినిమాలతో బాలీవుడ్ సినీరంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సర్ఫరోష్ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు ఆమిర్. కెనెడా-భారత్ కు చెందిన చిత్రం ఎర్త్(1998) సినిమాలో ఆమిర్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.
"https://te.wikipedia.org/wiki/ఆమిర్_ఖాన్" నుండి వెలికితీశారు