విమల: కూర్పుల మధ్య తేడాలు

Story of the film is given.
Songs are added to the article.
పంక్తి 3:
విమల ఒక సాయంత్రం తోటలో ఉన్నప్పుడు ఉగ్రసింహుడు వచ్చి తన ప్రేమను వ్యక్త పరిచి, తనను వివాహం చేసుకోవాలని తన మనసులోని మాట బయటపెడ్తాడు. విమల ఈ విషయాన్ని తన తండ్రితో చెపుతుంది. ఉగ్రసింహుదు చాల కౄరుడని, అతని నుంచి తమకు హాని కలుగుతుందని, విమల, రాజేశ్వరప్రసాద్ ఒక పడవలో పరిపొయే ప్రయత్నంలో, ప్రమాదవశాత్తూ విడిపోతారు. సముద్రపు ఒడ్డున స్పృహలేని స్థితిలో ఉన్న విమలను, అనంతగిరి సంస్థానపు రాణి రాజ్యలక్ష్మి (సంధ్య) గమనించి, ఆమెను రక్షించి, తన ఆస్థానానికి తీసుకెళ్తుంది. స్పృహ వచ్చాక రాజ్యలక్ష్మే తన తల్లి అని లలితకుమారి (విమల అసలు పేరు) గుర్తిస్తుంది కాని, ఆ విషయాన్ని గోప్యంగా వుంచుతుంది. రాజేశ్వరప్రసాద్, వారి అన్నగారు అనంతగిరి సంస్థానపు రాజులు. పెద్దరాజావారు అవిటివాడు కావటంతో చిన్నరాజావారే సంస్థానం మంచి చెడులు, పాలన నిర్వహించేవారు. ఒకరోజు పెద్దరాజావారు, చిన్నరాజావారు ఎదో విషయంలో విభేదిస్తారు. మరుసటిరోజే పెదరాజావారి హత్య జరుగుతుంది. రాజేశ్వరప్రసాద్ పై హత్యానేరం ఆపాదింపబడి, లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయమూర్తి రాజేశ్వరప్రసాద్ కు ఉరిశిక్ష వేస్తాడు. జైలు నుంచి తప్పించుకుని రాజేశ్వరప్రసాద్ , లలితకుమారిని తనతో తీసుకుని లంకకు పారిపోతాడు. తనపై హత్యానేరం ఉంది కనుక రాజేశ్వరప్రసాద్ తమ విషయాలను ఎవరికీ చెప్పవద్దని విమలతో చెప్తాడు. విమలను ప్రేమించిన యువరాజు విజయ్, రాజ్యలక్ష్మి తమ్ముడే. ఈ నేపధ్యంలో విమల, యువరాజు తో తాను వివాహం చేసుకోలేదని  రాజ్యలక్ష్మితో చెప్తుంది.
 
విమల మనోవేదన అర్థం చేసుకున్న విజయ్ పెదరాజావారిని ఎవరు హత్యచేసారన్న విషయం పై, విమల సాగిస్తున్న గూఢచారి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తూ, చివరకు అసలు హంతకులను పట్టుకుంటారు. ఎలాగైనా రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలన్న దుష్ట కోరికతో ఉన్న, ఇంటిదొంగలైన, హంతకుడు రాజా అప్పలరాయుడు బహద్దూర్ ను, అతనికి సహకారం అందించిన వెంకటప్పయ్య (రమణారెడ్డి), బట్లర్ (రేలంగి) లను పట్టుకోవడముతో, రాజేశ్వరప్రసాద్ అజ్ఞాతం ముగుస్తుంది. లలితకుమారి, యువరాజు విజయ్ కుమార్ ల వివాహం తో కథ సుఖాంతం.{{సినిమా|
 
పాటలు
 
ఈ చిత్రం లో మొత్తం 7 పాటలును ముద్దుకృష్ణ వ్రాసారు. నేపధ్య గాయకులు: ఘంటసాల, మాధవపెద్ది సత్యం, పి.నాగేశ్వరరావు, జమునారాణి, జయలక్ష్మి మరియు కోమల.
 
01. కనుల బెలుకె,
 
02. కన్నులొని బొమ్మ,
 
03. చిన్ని లతవొలె,
 
04. ఎర్ర ఎర్రాని దాన,
 
05. కావవె అమ్మ దేవి
 
06. నీలి వెన్నెల,
 
07. టక్కరి దాన
 
"నా కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు" పాట మధురంగా ఉంటుంది. ఘంటసాల, జయలక్ష్మి ఈ పాట పాడారు.
 
బట్లర్ (రేలంగి) మరియు చెలికత్తె (చంద్రిక) ల మధ్య యుగళ గీతం "టక్కరి దానా, చుక్కలకన్నా చక్కని దానా, చిక్కాను నీకేలే,
 
ఒంటరి రాజా, తింటావు కాజా"  ప్రజాదరణ పొందింది.   
 
{{సినిమా|
name = విమల |
image = Vimala film.jpg |
"https://te.wikipedia.org/wiki/విమల" నుండి వెలికితీశారు