పెడన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
ఇక్కడ [[దసరా]] నవ రాత్రులలో వివిధ వంశాలకు చెందిన దంపతులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, వైశాఖపౌర్ణమికి, అమ్మవారి శాంతికళ్యాణాన్ని వైభవంగా నిర్వహించెదరు.
===శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం===
స్థానిక బ్రహ్మపురంలోని ఈ ఆలయంలోని స్వామివారి వార్షిక ఉత్సవాలు, 2017,మార్చ్-26వతేదీ ఆదివారం వేకువఝామునుండియే, అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి '''కర్ణోద్భవ ''' వంశీకులు నిర్వహించుచున్న ఈ ఉత్సవాలు ఐదు సంవత్సరాల అనంతరం పెడన గ్రామములో జరుగుచున్నవి. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాతోపాటు, ఉభయ గోదావరి జిల్లాలలో నివసించుచున్న ఆ వంశీకులు, పెక్కుసంఖ్యలో ఈ ఆలయానికి తరలివచ్చినారు. ఉదయం 11-25 కి ఆలయంలో అలుగు సంబరం మొదలైనది. దీనిలో భాగంగా భక్తులు విచిత్ర వేషధారణలతో గ్రామోత్సవం నిర్వహించినారు. అనంతరం వీరభద్రపురం నుండి ప్రభను ఊరేగింపుగా ఉత్సవ ప్రాంగణానికి తీసుకొనివచ్చినారు. రాత్రి 9 గంటలకు నిప్పులగుండం అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించినారు. ఉత్సవాలలో గరగ నృత్యాలు, అఘోరాల వేషధారణలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి. ఉత్సవ క్రతువులో ముగింపులో భాగంగా, 28వతేదీ సోమవారం ఉదయం 8-52 కి స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. అనంతరం భారీ అన్నసమారాధనకు కర్ణోద్భవ సంఘం ఏర్పాట్లుచేసినది. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని, పెడనలోని చేనేత, కలంకారీ పరిశ్రమలు మూడు రోజులు సెలవులు ప్రకటించినవి. [6]
 
===శ్రీ భద్రావతీ సమేత భావనాఋషిస్వామివారి ఆలయం===
"https://te.wikipedia.org/wiki/పెడన" నుండి వెలికితీశారు