పెడన

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, పెడన మండలం లోని పట్టణం

పెడన, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన పట్టణం. పిన్ కోడ్: 521 366. ఎస్.టి.డి.కోడ్ = 08672.

గ్రామ భౌగోళికంసవరించు

[1]సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలుసవరించు

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె, బంటుమిల్లి, గుడ్లవల్లేరు, వడ్లమన్నడు, నడుపూరు,కౌతవరం

సమీప మండలాలుసవరించు

మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు, బంటుమిల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

పెడన గ్రామానికి 8 km దగ్గరలో కల పట్టణం మచిలీపట్నం (బందరు). ఇక్కడి నుండి పెడనకు విస్త్రుతమైన రవాణా సౌకర్యములు ఉన్నాయి.

రైలు వసతిసవరించు

పెడన, మచిలీపట్నం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 68 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల,తోటమూలసవరించు

2016-17లో, ఈ పాఠశాల హోదా పెంచి ఉన్నత పాఠశాలగా మార్చినారు. ఉన్నత పాఠశాల నిర్మాణం కొరకు స్థలం సమస్య ఎదురుకాగా, పెడనకు చెందిన కలంకారీ వ్యాపారి శ్రీ మోహనరావు, ఈ పాఠశాలకు సరిహద్దున ఉన్న తమ 28 సెంట్ల భూమినీ ఉన్నత పాఠశాలకు వితరణగా అందించినారు. ఈ విధంగా ఇక్కడ ఉన్నత పాఠశాల ఏర్పాటుకు మార్గం సుగమం అయినది. [7]

అభిరామీ ఉన్నత పాఠశాల.

శ్రీ శాయిబాబా హైస్కూల్.

విశ్వభారతి ప్రాథమికోన్నత పాఠశాల.

నిద పబ్లిక్ స్కూల్

గ్రామంలోని మౌలిక సౌకర్యాలుసవరించు

ప్రభుత్వ కార్యాలయాలుసవరించు

మండల రెవెన్యూ కార్యాలయము, మున్సిపాల్ కార్యాలయము, తంతితపాల కార్యాలయము, ప్రభుత్వ ఆసుపత్రి, దూరవాణీ (టెలిఫోన్) కార్యాలయము, సబ్ రిజిస్త్రార్ కార్యాలయము ఇక్కడ ఉన్నాయి.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు/మాస్జిద్ లుసవరించు

శ్రీ పైడమ్మతల్లి ఆలయంసవరించు

ఇక్కడ ప్రతి సంవత్సరం పైడమ్మ సంబరాలు మార్గశిర పౌర్ణమి నాటి నుంచి పదకొండు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి.

2017,ఆగష్టు-18వతేదీ శుక్రవారంనాడు, ఈ ఆలయంలోని అమ్మవారికి, భక్తుల విరాళాలతో ఏర్పాటుచేసిన 25 లక్షల రూపాయల విలువైన స్వర్ణ కిరీటాన్ని సమర్పించినారు. [8]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఇది పురాతన ఆలయం.

శ్రీ శ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఇక్కడ దసరా నవ రాత్రులలో వివిధ వంశాలకు చెందిన దంపతులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, వైశాఖపౌర్ణమికి, అమ్మవారి శాంతికళ్యాణాన్ని వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయంసవరించు

స్థానిక బ్రహ్మపురంలోని ఈ ఆలయంలోని స్వామివారి వార్షిక ఉత్సవాలు, 2017,మార్చి-26వతేదీ ఆదివారం వేకువఝామునుండియే, అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి కర్ణోద్భవ వంశీకులు నిర్వహించుచున్న ఈ ఉత్సవాలు ఐదు సంవత్సరాల అనంతరం పెడన గ్రామములో జరుగుచున్నవి. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాతోపాటు, ఉభయ గోదావరి జిల్లాలలో నివసించుచున్న ఆ వంశీకులు, పెక్కుసంఖ్యలో ఈ ఆలయానికి తరలివచ్చారు. ఉదయం 11-25 కి ఆలయంలో అలుగు సంబరం మొదలైనది. దీనిలో భాగంగా భక్తులు విచిత్ర వేషధారణలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం వీరభద్రపురం నుండి ప్రభను ఊరేగింపుగా ఉత్సవ ప్రాంగణానికి తీసుకొనివచ్చారు. రాత్రి 9 గంటలకు నిప్పులగుండం అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాలలో గరగ నృత్యాలు, అఘోరాల వేషధారణలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి. ఉత్సవ క్రతువులో ముగింపులో భాగంగా, 28వతేదీ సోమవారం ఉదయం 8-52 కి స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. అనంతరం భారీ అన్నసమారాధనకు కర్ణోద్భవ సంఘం ఏర్పాట్లుచేసింది. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని, పెడనలోని చేనేత, కలంకారీ పరిశ్రమలు మూడు రోజులు సెలవులు ప్రకటించినవి. [6]

శ్రీ భద్రావతీ సమేత భావనాఋషిస్వామివారి ఆలయంసవరించు

పెడన పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. 2014,జూన్-4న జరిగే ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2014,జూన్-2, సోమవారం నాడు, ఆలయప్రాంగణంలో, ఉదయం 8 గంటలనుండి, హోమక్రతువులను నిర్వహించారు. మంగళవారంగూడా ఈ క్రతువు నిర్వహించెదరు. మంగళవారం నాడు శాంతి కుంభస్థాపన, ధాన్యాధివాసం తదితర కార్యక్రమాలు నిర్వహించెదరు. బుధవారం విగ్రహ ప్రతిష్ఠతో పాటు శాంతి కళ్యాణం, మహా కుంభాభిషేకం, మహా గణపతి, ద్వారపాలకుల ప్రతిష్ఠ, అనంతరం సమారాధన నిర్వహించెదరు. [3]

ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2015,మే-25వ తేదీ సోమవారంనాడు, ఆలయ ప్రాంగణంలో శాంతికళ్యాణం నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో మండపారాధన, స్వామివారి ఆవిర్భావం, స్వామివారికి అభ్భిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసారు. [4]


మస్జీద్ అహేలే హాదీశ్ 5 వ వార్డ్ లో ముంషి అబ్దుల్ రహీం వీధిలో కలదు, పేష్ ఇమామ్ మహమ్మద్ ఉబెదుల్లాహ్ గారు[5]


జామియా మస్జీద్(బడి మస్జీద్) గుడివాడ రోడ్డు లో షాది ఖాన ఎదురుగా కలదు, దీని లో శ్మశానం కూడా కలదు [6]


బస్టాండ మస్జీద్ పెడన బస్టాండ్లలో మున్సిపాలిటీ పక్కనే ఒక మస్జీద్ కలదు[7]

దరూల్ బీర్ మస్జీద్ పెడన లోని జగపతి సినిమహల్ ప్రక్కనున్న మార్కజ్ దరూల్ బీర్ (ఆల్ బీర్ స్కూల్) ప్రక్కనే కలదు[8]

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

వరి,మినుములు ,అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

ఈ గ్రామం ముఖ్యముగా చేనేత పనితో ప్రసిద్ధినొందినది. పెడన గ్రామం మధ్యస్థ పట్టణముగా ఉంటుంది. ఇక్కడ అధికులు చేయు వృత్తి చేనేత. ఇక్కడ అన్ని రకముల మగ్గములపై వివిధ రకముల నేత బట్టలు నేయగల పనివారలు కలరు. అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన కళంకారీ చేనేత వస్త్రములు ఇక్కడివే.

చేనేతసవరించు

చేనేత ఇక్కడ ప్రముఖ పారిశ్రామిక రంగము. పెడన అనగానే గుర్తు వచ్చేది కలంకారీ కళ. ఇది వస్త్రాల పై అద్దకానికి సంబంధించిన కళ. ఈ కళను ఉపయోగించి ప్రస్తుతం లుంగీలు,చీరలు,టెబుల్ క్లాత్ లు,డోరు కర్టెన్లు, దుప్పట్లు, కర్చీఫులు వంటివి తయారు చేస్తున్నారు. ఇక్కడి నుండి దేశ, విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. ఈ కళకు చాలా ఘనమైన చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈ కళ పెడన, శ్రీకాళహస్తి వంటి కొన్ని ప్రాంతాలలో మాత్రమే సజీవంగా ఉంది. పెడన నేత వస్త్రాలకు కూడా పేరేన్నిక గన్నది. ఇక్కడ నూలుతో మెత్తటి బట్టలు తయ్యారు చేయుదురు.

గ్రామ ప్రముఖులుసవరించు

  1. ఈ గ్రామానికి చెందిన కలంకారీ ఎగుమతుదారులైన శ్రీ పిచ్చుక శ్రీనివాస్, భారత ప్రభుత్వ హస్తకళల అభివృద్ధిబోర్డు సభ్యులుగా నియమితులైనారు. [2]
  2. 2008 సంవత్సరము pedanaకి చెందిన కళాకారుడికి పద్మ అవార్డు రావటం సంతోషించదగిన విషయం.
  3. పెడన వాసియని శ్రీ భట్టా ఙాన కుమారస్వామి, ఆంధ్రా విశ్వవిద్యాలయంనుండి ఎం.ఎస్.సి. జియోఫిజిక్సులో పట్టా పొందినారు. అనంతరం వీరు అయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలో ఉద్యోగంలో ప్రవేశించారు. వీరిని ఇటీవల పెట్రోలియం మంత్రిత్వశాఖ వారు, 2014 సంవత్సరానికిగాను, "పెట్రోఫెడ్ ఇన్నొవేటర్" పురస్కారానికి ఎంపిక చేసారు. ఈయనకు ఈ పురస్కారాన్ని, ఇటీవల కొత్తఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, పెట్రోలియం మంత్రిత్వశాఖ సహాయమంత్రి శ్రీ ధర్మేంద్రప్రధాన్ చేతులమీదుగా అందజేసినారు. భూమి లోపల ఏర్పడే తరంగాల ఫలితంగా పెట్రో ఉత్పత్తుల అన్వేషణలో ఏర్పడే అవరోధాలను ఏ విధంగా అధిగమించాలనే అంశంపై వీరు చేసిన ప్రయోగాలకుగాను, వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. వీరి ఈ ప్రయోగం, వాణిజ్యపరంగా గూడా విజయవంతమైనట్లు అయిల్ ఇండియ లిమిటెడ్ సంస్థవారు పేర్కొన్నారు. [5]
  4. డాక్టర్ సయీద్ అహ్మద్, మదని

పెడన లో సగిర్ అహ్మద్ గారి సంతానం ఐన డాక్టర్ సయీద్ అహ్మద్ మదని గారు ఇస్లామిక్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి విదేశాల్లో P.hd పట్టా పోంది యున్నారు, పెడన లో ఆల్ బీర్ స్కూల్ స్టాపకులు మరియూ నిర్వహకులు, జమియత్ అహేలే హాదీశ్ రాష్ట్రా అద్యక్షులు

  1. హఫీజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి

పెడన లో పేషీమమ్ మహమ్మద్ ఉబెదుల్లాహ్ గారి సంతానం ఐనా హఫీజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి ఇస్లామిక్ ఎడ్యుకేషన్ లో పట్టా పొందిఉన్నారు, అలిమ్ మరియూ హఫీజ్ పట్టభద్రులు.

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2001) - మొత్తం 68,367 - పురుషులు 34,269 - స్త్రీలు 34,098

వనరులుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Pedana". Archived from the original on 4 నవంబర్ 2018. Retrieved 2 July 2016. External link in |title= (help)

వెలుపలిలింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2013,డిసెంబరు-2; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,జూన్-3&4; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015,మే-26; 5వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,జులై-19; 43వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2017,మార్చి-27; 5వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2017,జూన్-28; 3వపేజీ. [8] ఈనాడు కృష్ణా/పెడన; 2017,ఆగష్టు-19; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=పెడన&oldid=2989409" నుండి వెలికితీశారు