కొండవీటి వెంకటకవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''కొండవీటి వెంకటకవి''' ([[జనవరి 25]], [[1918]] - [[ఏప్రిల్ 7]], [[1991]]) ప్రసిద్ధ కవి, [[హేతువాది]] చలనచిత్ర సంభాషణ రచయిత. వీరి అసలు పేరు '''కొండవీటి వెంకటయ్య'''.
==జీవిత విశేషాలు==
వీరు [[గుంటూరు]] జిల్లా [[సత్తెనపల్లి]]విప్పర్ల తాలూకా [[విప్పర్ల(క్రోసూరు)]] గ్రామంలో జన్మించారు. వీరు నారాయణ, శేషమ్మ దంపతులకు [[జనవరి 25]], [[1918]] సంవత్సరంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసము తండ్రివద్ద జరిగింది. ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనము చేశారు. చిట్టిగూడూరు నరసింహ సంస్కృత కళాశాలలో చేరి దువ్వూరు వేంకటశాస్త్రిగారి శిశులై బాషా ప్రావిణపట్టా పొందారు. 1936లో కిసాన్ కాంగ్రేసుకు సహాయకార్యదర్శిగా పనిచేశాడు.1944-45లో శరభయ్యగుప్త హైస్కూల్లో తెలుగు పండితునిగా ఉద్యోగం ప్రారంభించారు. 1946 నుండి 1952 వరకు వెంకటకవి జిల్లా [[మాచర్ల]]లో బోర్డు ఉన్నతపాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశాడు.[[బాబా]] లను విమర్శిస్తూ ఉపన్యాసాలిచ్చారు. [[ఈనాడు]], లో అనేక వ్యాసాలు రాశారు.1952నుంచి పొన్నూరు భావనారాయణ స్వామివారి సంస్కృత కళాశాలో ఆంధ్రఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు.
 
==రచనలు==
కవితా రచనకు తన 14వ ఏటనే శ్రీకారం చుట్టిన వీరు అనేక గ్రంథాలు రచించారు. 1932లో వీరు కర్షకా! శతకాన్ని రచించారు. ఇది మూడు ముద్రణలు పొందింది. 1942లో “హితభోద”రచించారు. 1940లో “చేన్నకేసవశతకం” వెలువరించారు. దివంగతులైన ప్రముఖుల గురించి దివ్య స్క్రుతులు 1954లో వీరు నెహ్రూ చరిత్ర మొదటి భాగం ప్రకటిస్తూ తాము బహుళ ప్రబంధయుతుడని పేర్కొన్నారు. ఈగ్రంధం [[బెజవాడ గోపాలరేడ్డి]] గారికి అంకితం ఇవ్యబడింది. [[నెహ్రు]] చరిత్ర రెండవ భాగం [[గుత్తికొండ నరహరి]]గారికి అంకితం ఈయబడింది. మూడవ భాగం అముద్రితంగానే ఉంది. బుద్ధుడు, వేమన, గాంధీజీల గురించి వీరు మూడు శతకాలు రాసి దాన్ని “త్రిశతి” పేరుతో 1960లో ప్రకటించారు. నిదబ్రోలుకు చెందిన ప్రముఖ విద్యా పోషకులు [[పాములపాటి బుచ్చి నాయుడు]] దీని కుతిపతి శ్రీకృష్ణవ్యాసావళి వీరి మరొక రచన. వీరు 1984 ప్రాంతంలో [[కడప జిల్లా]] [[కందిమల్లయపల్లె]]లోని బ్రహ్మమ్ గారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు. ఆమఠానికి సర్వఅధ్యక్షుడుగా ఉన్న శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాములు వారి ఆదేశానుసారం “శ్రీవీర బ్రహెంద్ర సుప్రభాతమును” సంస్కృతంలోకి రచించారు.
"https://te.wikipedia.org/wiki/కొండవీటి_వెంకటకవి" నుండి వెలికితీశారు