"ఆకాశవాణి" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు, అక్టోబర్ → అక్టోబరు (2), డిసెం using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు, అక్టోబర్ → అక్టోబరు (2), డిసెం using AWB)
1938 జూన్ 25 రాత్రి తొలిగా జానపద సంగీతం ప్రసారమైంది. మద్రాసు ప్రసారాల తొలి తెలుగు వ్యాఖ్యాత మల్లంపల్లి ఉమామహేశ్వరరావు (ప్రముఖ చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ సోదరుడు). ఆయన రేడియో తాతయ్యగా పిల్లల కార్యక్రమాల ద్వారా సుప్రసిద్ధులు.<ref>''ఆకాశవాణి... వార్తలు చదువుతున్నది...'' శీర్షికన [[సుధామ]] రాసిన వ్యాసం([[తెలుగు వెలుగు]]; ఫిబ్రవరి 2014 సంచిక)</ref>
=== హైదారాబాద్, విజయవాడ కేంద్రాల ప్రారంభం ===
ఆకాశవాణి మద్రాసు కేంద్రం తెలుగులో తొలి ప్రసారాలు చేయగా 1948 అక్టోబర్అక్టోబరు 12న తొలి తెలుగు రేడియో స్టేషనుగా విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. అదే సంవత్సరం డిసెంబర్డిసెంబరు 1 నుంచి విజయవాడ కేంద్రం ప్రసారాలు ప్రారంభించింది. 1933లో హైదారాబాద్ చిరాగ్ అలీ వీధిలో మహబూబ్ అలీ 200వాట్ల శక్తిగల రేడియోకేంద్రం స్థాపించారు. దాన్ని 1935 ఫిబ్రవరి 3న నిజాం తన అదుపులోకి తీసుకున్నారు. ''దక్కన్ రేడియో''గా 7వ అసఫ్ జా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాము ఉర్దూ ప్రసారాలతో ప్రారంభించినా పరిమితంగా తెలుగు, [[కన్నడ]], మరాఠీ కార్యక్రమాలుండేవని తొలి తెలుగు రేడియో కార్యక్రమాల గురించి పరిశోధించిన విశ్రాంత ఆకాశవాణి ఉద్యోగి సుధామ పేర్కొన్నారు. స్టూడియో సరూర్ నగర్ నుంచి [[ఖైరతాబాద్]] యావర్ మంజిల్ కు తరలింది. 1948 డిసెంబరు 1నాటికి 800వాట్ల శక్తితో షార్ట్ వేవ్, మీడియం వేవ్ లతో ఉన్న దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు [[మాడపాటి హనుమంతరావు]] ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. 1950లో దక్కన్ రేడియో కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆలిండియా రేడియో హైదారాబాద్ కేంద్రంగా మార్చింది. హైదారాబాద్, విజయవాడ కేంద్రాలు తెలుగులో విజ్ఞాన వినోదాలను మేళవించి రూపొందించిన వివిధ కార్యక్రమాలతో తెలుగు జనజీవితంలో భాగమయ్యాయి.
=== ఇతర తెలుగు ఆకాశవాణి కేంద్రాలు ===
{| class="wikitable"
=== వార్తలు ===
రేడియో వార్తలు నిబద్ధతకు, విశ్వసనీయతకు పేరుపొందాయి. సమాచార వ్యవస్థ పటిష్ఠంగా లేని రోజుల్లో రేడియో వార్తల్లో స్కూళ్లకు సెలవిచ్చారని విని - వూళ్లలో బళ్ళు మూసేసిన రోజులున్నాయని, వివిధ రకాల ఛానెల్స్, న్యూస్ ట్రాకింగ్ వంటి వ్యవస్థలు లేకపోవడం వల్ల రేడియోలో ఇప్పుడే అందిన వార్త కోసం జనం ఎదురుచూసేవారని ఆకాశవాణి మాజీ విలేకరి భండారు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆకాశవాణి సంచలనాలకు తావివ్వకున్నా ఎన్నో వార్తలను ముందుగా బ్రేక్ చేసిన ఘనత పొందింది. అంజయ్య భారీ మంత్రివర్గం రాజీనామా, విమానప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం, తెలుగుదేశం ప్రధానకార్యదర్శిగా చంద్రబాబునాయుడు ఎన్నిక, నెలరోజుల నాదెండ్ల ఎపిసోడ్ అనంతరం ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణస్వీకారం చేయడానికి ఎన్టీ రామారావుకు ఆహ్వానం వంటి వార్తలను ముందుగా బ్రేక్ చేసింది ఆకాశవాణి వార్తాలే. ఎన్టీ ఆర్ మరణవార్తను ఆయన మరణించిన కొద్ది గంటల్లోపే ఆకాశవాణి డిల్లీ నుంచి వెలువడే ఇంగ్లీష్ న్యూస్ బులెటిన్ ద్వారా ప్రజలకు ముందుగా తెలిపింది<ref>వార్తల వెనుక కథ పుస్తకంలో అడవిబాటలో రాజీవ్ గాంధీ శీర్షికన భండారు శ్రీనివాసరావు రాసిన వ్యాసం</ref><br />
1939 అక్టోబర్అక్టోబరు 1 నాడే ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు మొదలయ్యాయి. అనంతరం ప్రారంభమయిన హైదారాబాద్, విజయవాడ కేంద్రాల వార్తా విభాగాలే నేడు తెలుగు వార్తా ప్రసారాలు చేస్తున్నాయి. ప్రాంతీయవార్తలే కాక తెలుగు వార్తాబులెటిన్లు కూడా ప్రస్తుతం హైదారాబాద్ కేంద్రం నుంచే ప్రసారమవుతున్నాయి. ఢిల్లీ నుంచి వార్తలు చదివిన తొలితరం వారిలో శ్రీశ్రీ, కొంగర జగ్గయ్య వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. కపిల కాశీపతి, శ్రీవాస్తవ, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, వనమాలి ప్రసాద్, కందుకూరి సూర్యనారాయణ, తిరుమలశెట్టి శ్రీరాములు, ఏడిద గోపాలరావు, మల్లాది రామారావు, దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్, [[పి.ఎస్.ఆర్. ఆంజనేయశాస్త్రి]], సురమౌళి, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, జోళిపాలెం మంగమ్మ, డి.వెంకట్రామయ్య, జ్యోత్స్నాదేవి, కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ తదితరులు వార్తలు వినిపించడంలో సుప్రసిద్ధులు. పన్యాల రంగనాథరావు, నర్రావుల సుబ్బారావు, ఆకిరి రామకృష్ణారావు, నర్రావుల సుబ్బారావు, ఆకిరి రామకృష్ణారావు, మల్లాది రామారావు, ఆర్.వి.వి.కృష్ణారావు, జె.బి.రాజు, కె.ఆసయ్య వంటి వార్తా సంపాదకులు వార్తల వెనుక పనిచేశారు.
 
=== లలిత సంగీతం ===
మొదట్లో గీతావళి పేరుతో భావగీతాలు తొలుత ప్రసారమైనా [[లలిత సంగీతం]] అన్న పేరు ప్రాచుర్యం పొందింది ఆకాశవాణితోనే. [[పాలగుమ్మి విశ్వనాథం]], [[బాలాంత్రపు రజనీకాంత రావు]] తదితర స్వరకర్తలు, [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], [[దాశరధి కృష్ణమాచార్యులు|దాశరధి]] వంటి కవులు, [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]], [[ఎమ్మెస్ రామారావు]], [[చిత్తరంజన్]], వేదవతీ ప్రభాకర్ తదితర కళాకారులు లలిత గీతాలకు ఆదరణ కల్పించారు. ''అమ్మదొంగా నిన్ను చూడకుంటే'', ''ఆకులో ఆకునై'', ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'', ''నారాయణ నారాయణ అల్లా అల్లా'' తదితర గీతాలు ఆకాశవాణిలో ప్రసారమై తెలుగునాట బహుళ ప్రచారంలోకి వచ్చాయి. “శతపత్రసుందరి”, “మ్రోయింపు జయభేరి” (సూర్యకుమారి), “మనప్రేమ” (బాలమురళి, గోపాలరత్నం), “గుడారమెత్తివేశారు”, “ఎందు చూచినగాని” (ఘంటసాల) “ఎన్ని తీయని కలలు కన్నానో” (మల్లిక్‌), “నటన మాడవే మయూరి” (బాలసరస్వతి), “పోయిరావే కోయిలా”, “కోపమేల రాధ” (సాలూరి, బాలసరస్వతి), “జాబిల్లి వస్తున్నాడు” (వింజమూరి సోదరీమణులు), “ఓహో ప్రతిశ్రుతి” (రజని), “ఓ భ్రమరా” (టి.జి. కమలాదేవి) ” రొదసేయకే తుమ్మెదా” (వి. లక్ష్మి?) గేయాలు బాలాంత్రపు రాజనీకాంతరావు స్వరకల్పన చేయగా రేడియోలో ప్రసారమై ఆంధ్రదేశంలో మార్మోగాయి.<ref>[http://eemaata.com/em/issues/200101/616.html ''తెలుగు లలిత సంగీతంలో రజనీ గంధం'' శీర్షికన పరుచూరి శ్రీనివాస్ రాసిన వ్యాసం(ఈమాట పత్రిక:జనవరి 2001 సంచిక)]</ref>
=== శాస్త్రీయ సంగీతం ===
ఆకాశవాణి మద్రాసు కేంద్రం ప్రారంభమే త్యాగరాజ కృతితో మొదలుఅయింది. ఆపై ఆకాశవాణిలో పలువురు శాస్త్రీయ సంగీత విద్వాంసుల ప్రదర్శనలు వచ్చి, ప్రజలకు చేరువైంది. రేడియోలు, గ్రామఫోన్లు, ప్రత్యక్షంగా కచేరీలు తప్ప ఇతర సంగీత సాధనాలు అందుబాటులో లేని తొలినాళ్లలో శాస్త్రీయ సంగీతాన్ని సమర్థంగా శ్రోతలకు ఆకాశవాణి అందించింది.<ref>[http://eemaata.com/em/issues/200809/1333.html ''బాలమురళీకృష్ణ'' శీర్షికన కొడవటిగంటి రోహిణీప్రసాద్ రాసిన వ్యాసం(ఈమాట పత్రిక:సెప్టెంబర్ 2008)]</ref> [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] తన పదకొండేళ్ళ వయసులోనే 1941 జూలై 2న మొదటి రేడియో కార్యక్రమం ఇచ్చారు. అనంతర కాలంలో ఆయన ఆకాశవాణిలో ఉద్యోగం చేశారు. ప్రముఖ సినీనేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తన తొలినాళ్లలో 1944 సెప్టెంబర్సెప్టెంబరు 30న రేడియోలో శాస్త్రీయ సంగీతాన్ని వినిపించారు.
=== సాహిత్య ప్రదర్శనలు ===
1948లో ప్రారంభమయిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం, 1950లో ఆలిండియా రేడియోగా పరివర్తన చెందిన హైదారాబాద్ రేడియో కేంద్రం సాహిత్యాంశాలను శ్రోతలకు అందించాయి. ప్రసంగాలు, గోష్ఠులు, సంచికా కార్యక్రమాలు కవిసమ్మేళనాలు, అష్టావధానాలు, సమస్యా పూరణాలు, ధర్మసందేహాలు, భద్రాచల సీతారామ కళ్యాణం, తిరుపతి బ్రహ్మోత్సవాలు, శ్రీశైల శివరాత్రి ఉత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాలు వంటి కార్యక్రమాలతో శ్రోతలను అలరించాయి. హైదారాబాద్ కేంద్రం నవలా స్రవంతి పేరిట తెలుగు నవలలను ఎన్నింటినో వినిపించింది. జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విజయవాడ కేంద్రం నుంచి తమ [[బద్దన్న సేనాని]] నవలను తానే స్వయంగా చదివి వినిపించారు.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2100830" నుండి వెలికితీశారు