ఆండాళ్ వెంకటసుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''ఆండాళమ్మ''', '''లేడీ ఆండాళ్'''గా ప్రజలచే పిలువబడే '''ఆండాళ్ వెంకటసుబ్బారావు''' ఒక ప్రముఖ సంఘ సేవకురాలు మరియు విద్యావేత్త.
==విశేషాలు==
ఈమె 1894లో [[మద్రాసు]] పట్టణంలో ఒక సంపన్న కుటుంబంలో[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం మద్రాసులోని సెయింట్ థామస్ కాన్వెంటులోను, హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హైయ్యర్ సెకండరీ స్కూలులోను, ప్రెసిడెన్సీ గర్స్ హైస్కూలులోను గడచింది. ఈ చదువు ఆమెకు సామాజిక స్పృహను కలిగించింది. బీదలకు, నిస్సహాయులకు, దురదృష్టవంతులకు ఏదో ఒకటి చేయాలనే తపనను కలిగించింది. ఈమె చిన్నవయసులోనే భర్తను[[భర్త]]<nowiki/>ను కోల్పోయి వితంతువుగా మారింది. ఆ కాలంలో బాలవితంతువులు ఎదుర్కొనే సాధకబాధకాలను స్వయంగా అనుభవించింది. మద్రాసు హైకోర్టు జడ్జి [[ముత్తా వెంకట సుబ్బారావు]] పరిచయం ఆమె జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పింది. అతడు ఈమెను 1922లో ఆదర్శ వివాహం చేసుకున్నాడు. సమాజంలోని రుగ్మతలను తొలగించడానికి ఈమె తనకు సరియైన జోడీగా ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ దంపతులిద్దరూ కలిసి వందలాది అభాగ్యుల జీవితాలలో వెలుగును నింపినారు.
==సంఘసేవ==
1928లో ఈ దంపతులు దిక్కులేని [[పిల్లలు]], స్త్రీలకు[[స్త్రీ|స్త్రీల]]<nowiki/>కు, సమాజం నుండి వెలియేయబడిన వారికి ఆశ్రయమిచ్చి చదువు చెప్పించడం కోసం తమ స్వంత ధనం 10,000 రూపాయలు వెచ్చించి "మద్రాస్ సేవా సదన్" అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఆరంభంలో ఈ సంస్థలో 8 మంది అనాథలను చేర్చుకుని వారికి తిండి, దుస్తులు ఇచ్చి వారికి శిక్షణ యిచ్చి వారు సమాజంలో నిలదొక్కుకునేలా చేశారు. 8 మందితో ప్రారంభమైన మద్రాసు సేవా సదన్‌లోని సభ్యుల సంఖ్య 30 యేళ్లలో 3000కు పెరిగింది. ఈమె ఈ సంస్థలోని పిల్లల పట్ల పత్యేక శ్రద్ధ కనబరచేది. వారికి స్వయంగా [[భోజనం]] తినిపించేది. సాయంకాలాలు తన కారులో[[కారు]]<nowiki/>లో బీచికి వ్యాహ్యాళికి తీసుకు వెళ్లేది. ఆ పిల్లలకు యుక్త వయసు వచ్చేవరకు [[పెళ్ళి|పెళ్లి]] జరగకుండా జాగ్రత్త వహించి, మంచి వారికి ఇచ్చి పెళ్లిళ్లు చేసేది. వారికి [[ఆభరణాలు|నగలు]], [[దుస్తులు]] స్వయంగా తన డబ్బుతో కొనిపెట్టేది. ఈ సంస్థలో [[జాతి]], [[కులం|కుల]], [[మతము|మత]] భేదం లేకుండా అన్ని వర్గాల వారికీ చోటు కల్పించింది. ఈ సంస్థకు అనుబంధంగా లేడీ ఆండాళ్ వెంకట సుబ్బారావు హయ్యర్ సెకండరీ స్కూలును, సర్ ముత్తా వెంకట సుబ్బారావు [[సంగీతము|సంగీత]] సభను ప్రారంభించింది.