రోజర్ బిన్నీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[కర్ణాటక]] లోని [[బెంగుళూరు]] లో [[1955]] [[జూలై 19]] న జన్మించిన రోజర్ బిన్నీ పూర్తి పేరు రోజర్ మైకెల్ హంప్రీ బిన్నీ (Roger Michael Humphrey Binny) (Kannada:ರೋಜರ್‌ ಮೈಖೆಲ್‌ ಹಂಫ್ರಿ ಬಿನ್ನಿ). పూర్వపు భారత క్రికెట్ ఆల్‌రౌండర్ అయిన రోజర్ బిన్నీ [[1983]] ప్రపంచ కప్ క్రికెట్ లో మంచి ప్రతిభను చూపినాడు. ఆ ప్రపంచ కప్ లో మొత్తం 18 వికెట్లు సాధించి , అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిల్చినాడు. [[1985]] లో వరల్డ్ సీరీస్ క్రికెట్ చాంపియన్ లో కూడా ఇదే ప్రతిభ ప్రదర్శించి 17 వికెట్లు సాధించాడు.
 
బిన్నీ అతని సొంత మైదానమైన బెంగుళూరు లోనే [[1979]] లో [[పాకిస్తాన్]] పై తన అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేసినాడు. [[ఇమ్రాన్ ఖాన్]], [[సర్ఫ్రరాజ్ నవాజ్]] లాంటి మేటి బౌలర్లను ఎదుర్కొని తొలి మ్యాచ్ లోనే 46 పరుగులు సాధించాడు. ఈ సీరీస్ లోని ఐదవ టెస్టులో ఇమ్రాన్ ఖాన్ బౌన్సర్ కు సిక్సర్ కొట్టిన సంఘటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సమయంలో అతడు మంచి బౌలర్ మరియు ఫీల్డర్ కూడా. రోజర్ బిన్నీ భారతదేశం తరఫున ఆడిన తొలి [[ఆంగ్లో-ఇండియన్]]. [http://content-usa.cricinfo.com/ci/content/current/story/149642.html].
 
==మూలాలు==
<references/>
 
[[వర్గం:1955 జననాలు]]
[[వర్గం:భారత క్రికెట్ క్రీడాకారులు]]
[[వర్గం:బెంగుళూరు క్రికెటర్లు]]
[[ఆంగ్లో ఇండియన్లు]]
 
 
[[en:Roger Binny]]
"https://te.wikipedia.org/wiki/రోజర్_బిన్నీ" నుండి వెలికితీశారు