కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

Created and wrote article on the sanctuary.
(తేడా లేదు)

20:46, 3 మే 2017 నాటి కూర్పు

ఈ అభయారణ్యం కాకినాడ పట్టణానికి సుమారు 10 కి.మీ. దూరంలో ఉంది. కాకినాడ నుంచి ఆటో లేక టాక్సీ లో ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చును. ఇక్కడ తిరుగు ప్రయాణానికి వాహనాల లభ్యత తక్కువ కావున, అందుకు ముందుగానే వాహన ఏర్పాటు చేసుకోవాలి. లేనిచో కోరంగి బస్‌స్టాండ్ కు నడవాలి.

ఇవి సుందరమైన మడ అడవులు. గౌతమి నది ఉప్పుకయ్య లో ఈ మడ అడవులున్నాయి. పడవ లో వీటిని సందర్శించవచ్చు. అభయారణ్య పడవ రేవు నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పడవ సౌకర్యం ఉంది. మనిషికి 50 రూ||లు ప్రవేశ ధరపై, రేవు నుంచి, సముద్ర ముఖద్వారం దాకా, పడవ లో, మడ అడవుల గుండా తీసుకు వెళ్తారు.  కనీసం 10 మంది ప్రయాణీకులు ఉంటే పడవ నడుపుతారు. లేదా తక్కువైన ప్రయాణీకుల రుసుము కూడా చెల్లించి, సముద్రముఖము వరకు పయనించవచ్చును.

ఇంకా ఓడలకు దిక్కు తెలియుటకై రేవున ఉండే దీపస్తంభం (Light-house) దాకా పడవ వెళ్ళే మరో పర్యటన కూడా కలదు. దీనికి ఒక రోజు ముందు ఆరక్షణ (Reservation) చేసుకొనవలెను. సముద్రపు ఆటు పోటు  ల పై ఆధారపడి పడవ ప్రయాణ సమయాలు నిర్ధారిస్తారు. ఉదయం 8 గం||లకు అభయారణయాని కి పర్యాటకులు రావాల్సుంటుంది. ఇది పూర్తి రోజు పర్యటన. కనీసం 15 మంది ప్రయాణీకులు లేక  5000/- రూపాయల రుసుము ఈ పర్యటనకు వసూలు చేస్తారు. దీపస్తంభం పై నుంచి మడ అడవుల సౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఈ ప్రయాణం లోనే కోరంగి సుందర సముద్రతీరం (Beach) కూడా చూడవచ్చు. దీపస్థంభ యాత్రీకులు తమతో ఆహారము మరియు నీటిని తీసుకు రావలెను. Light-house వద్ద ఎలాంటి తినుబండారాలు లభించవు.

కోరంగి పర్యటనలో పలు సుందర పక్షులతో పాటు, నక్కలు, నీటి కుక్కలు (Otters), సముద్రపు తాబేళ్ళు ఇంకా ఆడవి పిల్లులను చూడవచ్చును.

ఈ మడ అడవులు 235 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో రెండవ అతిపెద్ద మడ అడవులివి. ఈ మడ ఆడవుల లో దీపస్థంభం వెళ్ళలేని వారు పడవరేవు దగ్గర ఉన్న ఎత్తైన గోపురం పై నుంచి మడ అడవుల సౌందర్యాన్ని వీక్షింపవచ్చు. ఇంకా చూడవలసినవి చెక్కబాట (Boardwalk), కోరంగి తాళ్ళ వంతెన (Corangi Rope Bridge).

నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు వలస పక్షులను చూడవచ్చు. జనవరి నుంచి మార్చ్ నెలల వరకు  సముద్రపు తాబేళ్ళు, సముద్ర తీరాన గుడ్లు పెట్టడానికై వస్తాయి. సంవత్సరంలో 12 నెలలూ ఈ అభయారణ్యాన్ని దర్శించవచ్చు ఐతే  దర్శించటానికి నవంబరు, డిసంబరు నెలలు  అత్యుత్తమమైనవి.

కోరంగి అభయారణ్యం లో ఉండటానికి రమ్య కుటీరాలున్నాయి. మరింత సమాచారానికి, కుటీర రిజర్వేషన్లకు అటవీ సంరక్షణాధికారి, కాకినాడ ను సంప్రదింపవచ్చును.

Reference: http://www.coringawildlife.com/