సి.హెచ్. నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (7), కు → కు (2), గా → గా (2), మహ → మహా, గాడం → గాఢం, జనబ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''చదలవాడ నారాయణ రావు''' ([[సెప్టెంబరు 13]], [[1913]] - [[ఫిబ్రవరి 14]], [[1984]]) 1940 నుంచి 1950 దాకా ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన [[సినిమా]] నటుడు. [[చిత్తూరు నాగయ్య]], [[వేమూరి గగ్గయ్య]], [[కన్నాంబ]], [[ఋష్యేంద్రమణి]], [[సురభి బాలసరస్వతి]] వంటి కళాకారులు సినిమా రంగంలో ప్రవేశించక ముందు నాటకరంగాన్ని పరిపుష్టం చేసినవారే. అందుకు భిన్నంగా ఎలాంటి నాటకానుభవం, సిఫారసు లేకుండా సినీరంగంలోకి ప్రవేశించి స్వయంకృషితో నటుడుగా పేరు తెచ్చుకొన్న వ్యక్తి '''సి.హెచ్‌.నారాయణరావు'''. వాహినీవారు భక్తి రసాత్మకమైన చిత్రం ‘భక్తపోతన’ (1944) ను విడుదల చేసారు. అందులో రెండు మూడు సార్లు [[శ్రీరాముడు]] ప్రత్యక్షమవుతాడు. ఆ శ్రీరాముడ్ని చూసి ప్రేక్షకులు తన్మయులైనారు. అంతకుముందు అంత అందమైన, ఆకర్షణీయమైన శ్రీరామచంద్రుడ్ణి చూడలేదు. ‘సాక్షాత్తు రాముడే’ అన్నారు ప్రజ, పోతన పక్షమై. ఆ శ్రీరామ పాత్రధారి చదలవాడ నారాయణరావు.
==బాల్యం==
సి.హెచ్. నారాయణ రావుగా పిలువబడే ఈయన 1913 సెప్టెంబర్‌ 13న కర్నాటకలో[[కర్ణాటక|కర్నాటక]]<nowiki/>లో [[బెంగుళూరు]] - [[హుబ్లీ]] మార్గంలో ఉన్న మధుగిరిలో జన్మించారు. నారాయణరావు తల్లి వైపు తాత, ముత్తాతలు, మేనమామలు అప్పట్లో [[మైసూరు]] దివాణంలో పనిచేసేవారు. నారాయణరావు తండ్రి చదలవాడ లక్ష్మీ నరసింహారావు రెవెన్యూ అధికారిగా ఉద్యోగం చేసేవారు. అనంత పద్మనాభ వ్రతం రోజున పుట్టిన బిడ్డ కావడంతో, ఆ దంపతులు పెట్టుకున్న పూర్తి పేరు చదలవాడ అనంత పద్మనాభ దత్తాత్రేయ సత్యనారాయణరావు. ఆ పేరే వెండితెరపై సంక్షిప్తంగా సిహెచ్‌. నారాయణరావు అయింది.
==విద్యాభ్యాసం==
నారాయణరావు బాల్యంలో[[బాల్యం]]<nowiki/>లో చదువంతా [[ఏలూరు]]లో సాగింది. ఆ తరువాత చాలాకాలం [[గుంటూరు]]లో ఉన్నారు. సోషలిస్టు భావాలున్న ఆ తరువాత కాలంలో ట్రేడ్‌ యూనియనిస్ట్‌గా పనిచేశారు. రైల్వే వర్కర్స్‌ యూనియన్‌కు కార్యదర్శిగా, రైల్వే వర్కర్స్‌ బెనిఫిట్‌ ఫండ్‌కు కార్యదర్శిగా వ్యవహరించారు.అప్పట్లోనే రైల్వే సమ్మెకు నాయకుడై, రాజకీయ నాయకుడు [[వి.వి.గిరి]] తదితరులతో కలసి ఉత్తర భారతమంతటా తిరిగారు.సినీ రంగంలోకి రాక ముందు [[ఏలూరు]] లోని ప్రసిద్ధ 'వెంకట్రామా అండ్‌ కో' లో పనిచేశారు. పుస్తకాలు ప్రచురించడం, ఇంజనీరింగ్‌ వర్క్‌షాపులో పనిచేయడం లాంటివన్నీ చేశాక, తలవని తలంపుగా సినిమా అవకాశం ఆయన తలుపు తట్టింది.
==సినీ రంగ ప్రవేశం==
అసలు సినిమాల్లోకి వస్తానని కానీ, రావాలని కానీ ఆయన అనుకోలేదు. ఆయన సినీ రంగప్రవేశం చాలా తమాషాగా జరిగింది. ఓ రోజు రైలు ప్రయాణం చేస్తున్న సినీ దర్శకుడు ద్రోణంరాజు చిన కామేశ్వరరావు, నారాయణరావును చూశారు. అందం, మాటతీరు చూసి ముగ్ధుడైన కామేశ్వరరావు ఆయనను ఏకంగా హీరో పాత్రకు ఎంపిక చేశారు. అనుభవం లేదంటున్నా సినీ నటుణ్ణి చేశారు. అలా మీర్జాపురం రాజావారు జయా ఫిలిమ్స్‌ పతాకంపై తీస్తున్న 'జీవనజ్యోతి' (1940)లో హీరోయిన్‌ [[కృష్ణవేణి]] సరసన కథానాయకుడిగా సిహెచ్‌. నారాయణరావు సినీ రంగ ప్రవేశం జరిగింది. తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు వచ్చింది.
==కథానాయకుడిగా==
1940 లో వచ్చిన సాంఘికం ‘జీవనజ్యోతి’లో మాంచి పర్శనాలిటి గల హీరో ప్రవేశించాడు. నునుపైన, సహజమైన జుట్టు. సోగకళ్ళు, పొడుగైన ముక్కు, నవ్వితే నవరత్నాలు రాలినట్టు కనిపించే పెదవులు, పలువరసతోఅందర్నీ ఆకర్షించాడు. ఆ హీరో నారాయణరావు. నాగయ్య, సి.ఎస్‌.ఆర్‌., జి.వి.రావు., ఉమామహేశ్వరరావులు ముఖ్య పాత్రలు ధరిస్తున్నారు ఆ రోజుల్లో పర్సనాల్టీలో వీరికి భిన్నంగా కనిపిస్తూ నారాయణరావు రాగానే, ‘ హీరో అంటే ఇలా అందంగా ఉండాలన్న మాట... హీరోయిన్‌ లాగానే’ అనుకున్నారు ప్రేక్షకులు. రైల్వేలో ఉద్యోగం చేస్తున్న నారాయణరావూని చూసి, ద్రోణంరాజు చినకామేశ్వరరావు (‘జీవనజ్యోతి’ దర్శకుడు) చిత్రాల్లో ప్రవేశ పెట్టారు. కృష్ణవేణి ఆ చిత్రంలో కథనాయిక. నారాయణరావు నటన చాలా సహజంగా ఉంటుందని, అవలీలగ నటించేస్తాడనీ పత్రికలు రాసేవి.
పంక్తి 49:
ఎక్కువగా నాటకానుభవం లేకపోయినా, సినిమాలకి వచ్చిన తర్వాత నాటకాల్లో నటించారు. మల్లాది కృష్ణ శర్మ రాసిన ‘మిస్‌ ప్రేమ బి.ఏ.’ (తిమ్మరాజు శివరావు దర్శకత్వం) లో నారాయణరావు హీరోగా నటించి, చాలా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పకడ్బందీగా, క్రమశిక్షణతో రిహార్సల్సు జరిపి ఆ నాటకంలో నటించారు. హరీంద్రనాథ్‌ ఛటోపాధ్యాయతో సాన్నిహిత్యమున్న ఆయన తరువాతి రోజుల్లో [[పాలగుమ్మి పద్మరాజు]] 'పట్నవాసం' లాంటి రేడియో నాటికల్లోనూ పాల్గొన్నారు.
==సినీ జీవితం==
[[1939]] సంవత్సరంలో ''నారాయణరావు'' చిన్న ఉద్యోగం చేసుకుంటూ తరచు [[చెన్నపట్నం]] వెళ్ళి వస్తుండేవారు. ఒకసారి హోటల్‌లో ఆయన భోజనం చేస్తుండగా ప్రముఖ దర్శకుడు [[ద్రోణంరాజు కామేశ్వరరావు]] గారితో పరిచయం అయింది. మొదట ద్రోణంరాజు గారు నారాయణరావుని చూసి బెంగాలీ అనుకొన్నారట. తరువాత నారాయణరావు తెలుగువాడే అని తెలిసిన మీదట తన దర్శకత్వంలో [[శోభనాచల]] సంస్థ నిర్మించబోయే [[జీవన జ్యోతి]] అనే చిత్రానికి స్క్రీన్‌ టెస్ట్‌కు రమ్మని చెప్పారు. స్క్రీన్‌ టెస్ట్‌లో భాగంగా నారాయణరావుకు కొన్ని సంభాషణలు ఇచ్చి చిత్రీకరించారు. ఆ టెస్ట్‌ పీస్‌ను థియేటర్లో ప్రొజెక్ట్‌ చేసే తతంగం సాగర్‌ టాకీస్‌లో మొదలైంది. దర్శకుడు రాజు గారు, నిర్మాతలు, కెమెరామెన్‌ కొట్నీస్‌, సౌండ్‌ ఇంజనీర్‌ రంగయ్య తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు. తరువాత ఆ సినిమా అసిస్టెంట్‌ కెమెరామెన్‌ వచ్చి నారాయణరావు [[జీవన జ్యోతి]] సినిమాకు హీరోగా నారాయణరావు ఎంపికయ్యారు అన్న వార్తను చేరవేశారు. ఈ సినిమాకోసం ఆయనకు ఇచ్చిన పారితోషికం అక్షరాలా వంద రూపాయలు. అప్పట్లో వంద రూపాయల జీతగాఢంటే ధనవంతుడుగా లెక్క. అలా సిఫారసు లేకుండా నటుడైన నారాయణ రావు [[మనదేశం]], [[ముగ్గురు మరాఠీలు]], [[లక్ష్మమ్మ]], [[వీలునామా]], [[రహస్యం]] వంటి 50కి పైగా చిత్రాల్లో హీరోగా, సహాయ నటుడుగా నటించారు.
 
నారాయణరావు శోభనాచల స్టూడియోకి దగ్గర్లోనే అళ్వారుపేటలో ఉండేవారు. సినిమాల్లో ప్రవేశిస్తూ మొదట ఏ ఇంట్లో ప్రవేశించారోస్టార్‌ అయిన తరువాత కూడా అదే ఇంట్లో ఉన్నారు. ఆయనకి ఆర్భాటం లేక పోయినా, ఆత్మాభిమానం హెచ్చు. ఒక దశలో ఆయనకి చిత్రాలు లేవు.
పంక్తి 55:
1953 లో వై.వి.రావు దర్శకత్వంలో వరుణ అండ్‌ మహాత్మా అనే కంపెనీ ‘మంజరి’ (జానపదం) నిర్మించింది. నారాయణరావు దాదాపు నిర్మాత. తను సంపాదించుకున్నది ఆ చిత్రానికి ధారపోసారు. చిత్రంవిజయవంతం కాలేదు. అప్పులు మిగిలాయి. అప్పట్నుంచి నారాయణరావు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. చిత్రాలూ లేవు. జరుగుబాటుకీ, పిల్లల చదువులకీ ఎదురీత మొదలైంది. అయినా, ఆయన గుండె నిబ్బరం తగ్గలేదు. చాలా మంది తారలు, కళాకారులు ఉచ్ఛస్థితికి వెళ్ళీ, కిందికి పడిపోవడం సామాన్యంగా చూస్తూనే ఉంటాం. అదే జరిగింది నారాయణరావు జీవితంలోనూ. ఎంతటి ప్రసిద్దుడికైనా, గొప్పవాడికైనా ఒక దశ దాటిన తరువాత పరిస్థితి, స్థితీ మారడం విధాత శాపం కాబోలు.
 
తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లీషుతో పాటు మలయాళం, [[హిందీ భాష|హిందీ]] భాషలు కూడా ఆయన ధారాళంగా మాట్లాడేవారు. కెరీర్‌ తొలి రోజుల్లోనే 'దీనబంధు' (1942) చిత్రంలో వకీలుగా కోర్టు సీనులో ఆయన అనర్గళంగా చెప్పిన ఇంగ్లీషు డైలాగులు పరిశ్రమ వర్గీయులనూ, ప్రేక్షకులనూ ఆశ్చర్యపరిచాయి. మంచి గాత్రమున్న నారాయణరావు ఆ సినిమాలో సొంత గొంతుకలోనే పాట పాడారు. ఇక, ఘంటసాల పాడిన తొలి సినీ గీతం 'స్వర్గసీమ' (1946)లో నారాయణరావు, భానుమతులపై చిత్రీకరించినదే!
'దేవత' (1941)లో భావకవిగా చిన్న పాత్ర పోషించారు. అందాల నటుడిగా పేరు తెచ్చుకొని, 'చెంచులక్ష్మి' (1944)లో సవతుల పోట్లాటలో చిక్కిన కథానాయకుడిగా, 'తాసిల్దార్‌' (1944)లో పాశ్చాత్య జీవనశైలీ వ్యామోహంలో పడే తాసిల్దార్‌గా, 'స్వర్గసీమ' (1946)లో నెగటివ్‌ ఛాయలున్న పాత్రలో - అందరినీ ఆకట్టుకున్నారు. ఓ పక్క హీరోగా చేస్తూనే మరో పక్క కీలకమైన పాత్ర అయితే, చిన్నదైనా సరే నటించడానికి ఆయన వెనుకాడకపోవడం విశేషం.
==ప్రముఖులతో అనుబంధాలు==
"https://te.wikipedia.org/wiki/సి.హెచ్._నారాయణరావు" నుండి వెలికితీశారు