ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

/* ఆత్రేయ గురించి ప్రముఖ నటుడు / రచయిత రావి కొండలరావు గారి అభిప్రాయం{{cite web|url=http://www.eenadu.net/Homeinner.aspx?item=break200|title="...
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 34:
| weight =
}}
'''ఆచార్య ఆత్రేయ'''గా [[సినీరంగ ప్రవేశం]] చేసిన '''కిళాంబి వెంకట నరసింహాచార్యులు''' ([[మే 7]], [[1921]] - [[సెప్టెంబర్ 13]], [[1989]]) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి.<ref>[http://www.sakshi.com/news/opinion/heartstrings-poet-atreya-64765 మనసులు దోచిన కవి ఆత్రేయ Written by Nagesh | Updated: September 13, 2013]</ref> అత్రేయకి ప్రముఖ నటుడు [[కొంగర జగ్గయ్య]] ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి [[జగ్గయ్య]] తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య [[ఆత్రేయ]] తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా ఆయన స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే '''ఆత్రేయ''' నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.
==జీవిత సంగ్రహం==
[[1921]] [[మే 7]] న [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లోని [[సూళ్ళూరుపేట]] మండలంలో గల [[మంగళంపాడు]] గ్రామంలో జన్మించాడు. తండ్రి [[కృష్ణమాచార్యులు]]. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', '[[ఎన్.జి.వో]]' నాటకాలు [[ఆంధ్ర నాటక కళా పరిషత్తు|ఆంధ్ర నాటక కళా పరిషత్]] అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే '[[కప్పలు]]' బాగా ప్రాచుర్యం పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం మరియు విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ' మరియు 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.
పంక్తి 41:
చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి [[1989]],[[సెప్టెంబర్ 13]] న స్వర్గస్తులయ్యారు.
== జీవిత తత్వాన్ని గుట్టువిప్పే సంభాషణలు ==
ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన, కరుణ రసముగల, [[శృంగారం|శృంగార]] భావములుగల అర్థాలున్నాయి. సినిమా పరిభాషలో సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే పరస్పర ప్రేమానురాగాలను, ఆత్మీయానుబంధాలతో, కరుణరస భరితంగా ఒకరికొకరు సంభాషించు కోవడం. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగా రాస్తారని చెప్పుకుంటారు.<ref>[http://10tv.in/content/Acharya-Atreya-Death-Anniversary-Today-11389 ఆత్రేయ మనసు కవి]</ref>
== గొప్ప వేదాంతి ==
ఆత్రేయ గొప్ప [[వేదాంతశాస్త్రం|వేదాంతి]]. ప్రతివిషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. "వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి" అని ఆత్రేయ అంటారు. శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు. ఈ కారణమే ఆత్రేయను బూత్రేయ అని కూడా పేరు మూట గట్టుకునేలా చేసింది.
 
==ఆత్రేయ పాటలు గురించి==
"https://te.wikipedia.org/wiki/ఆత్రేయ" నుండి వెలికితీశారు