చక్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నారాయన → నారాయణ, రూ. → రు. using AWB
పంక్తి 27:
ఇతడు [[జూన్ 15]], [[1974]]న [[వరంగల్]] జిల్లా [[మహబూబాబాద్]] మండలం [[కంబాలపల్లి]]లో జన్మించాడు<ref name="Music director Chakri dies of heart attack" />. ఇతను సంగీతం సమకూర్చిన సినిమాల్లో చెప్పుకోదగినవి [[ఇడియట్]], [[అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి]], [[సత్యం]]. తెలుగులోనే కాక తమిళం, కన్నడంలో కూడా చక్రి సంగీతం సమకూర్చాడు. చక్రధర్ జిల్లా సంగీతం అందించిన చివ‌రి చిత్రం [[ఎర్ర‌బస్సు]].
 
[[స్వయంకృషి]] ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి సంగీత దర్శకుడు చక్రి జీవితం ఒక ఉదాహరణ. చక్రి అసలు పేరు చక్రధర్ జిల్లా. [[వరంగల్ జిల్లా]] [[మహబూబాబాద్‌|మహబూబాబాద్]] సమీపంలోని [[కంబాలపల్లి]] చక్రి స్వస్థలం. ఉపాధ్యాయుడైన చక్రి తండ్రి వెంకటనారాయణ కళాకారుడు కూడా. బుర్రకథలు స్వయంగా రాసుకొని ప్రదర్శించేవారు. చక్రి తల్లి విద్యావతి గాయని. చక్రికి సంగీత జ్ఞానం అబ్బడానికి కారణం తల్లిదండ్రులే. చిన్నప్పట్నుంచీ చక్రి బాగా పాడేవారు. కొడుకు మనోభీష్టాన్ని గౌరవించి తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహించారు.కంబాలపల్లిలో పదవ తరగతి వరకూ చదువుకున్న చక్రి... అక్కడే ఫ్లూట్ నేర్చుకున్నారు.
[[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] నుంచి డిగ్రీ వరకూ మహబూబాబాద్‌లో చదువుతూ.. అక్కడే [[వయొలిన్|వయోలిన్]], [[కర్ణాటక సంగీతం]] అభ్యసించారు.అప్పట్లో మహబూబాబాద్ చుట్టుపక్కల ఎలాంటి కార్యక్రమాలు జరిగినా... చక్రి సంగీత విభావరి ఉండాల్సిందే. చక్రి ట్రూప్ పేరు ‘సాహితీ కళాభారతి’. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు... [[కళాశాల]] [[వార్షికోత్సవం]] సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘ఒకే జాతి మనదిరా... ఒకే బాట మనదిరా’ అనే పాటను చక్రి స్వయంగా రాసి, స్వరపరిచి ఆలపిస్తే... కాలేజ్ ఆడిటోరియమంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. చక్రి ప్రతిభను గమనించిన స్నేహితులందరు... ‘నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. నీ పాట ఊళ్లల్లో జరిగే శుభకార్యాలకు పరిమితం కాకూడదు. తెలుగు సినీ సంగీతాన్ని శాసించే సత్తా నీలో ఉంది. నువ్వు [[హైదరాబాదు|హైదరాబాద్]] వెళ్లు’ అంటూ బతిమాలారట. కానీ... చక్రి మాత్రం పెడచెవిన పెట్టాడు.
 
చక్రిని టీచర్‌గా చూడాలనేది తండ్రి ఆకాంక్ష. కానీ... చక్రికి మాత్రం ఉద్యోగాలపై ఆసక్తి ఉండేది కాదు. '''ఒకరి ముందు చేతులు కట్టుకొని నిలబడలేను ''' అంటూ నిర్మొహమాటంగా చెప్పేసేవారు. 'ఏదైనా వ్యాపారం పెడితే.. తానే పదిమందికి పని ఇవ్వొచ్చు కదా!' అనుకొని... ఓ రెడీమెడ్ బట్టల దుకాణం పెట్టడానికి సమాయత్తమయ్యారు. అయితే... చక్రి బట్టల దుకాణం పెట్టడం ఫ్రెండ్స్‌కి ఇష్టం లేదు. వాళ్లు మాత్రం చెవిలో జోరీగల్లా హైదరాబాద్ వెళ్లమని మొత్తుకుంటూనే ఉన్నారు. చివరకు హైదరాబాద్ బస్సెక్కారు చక్రి.
పంక్తి 36:
హైదరాబాద్ మహానగరం ఆయనకు అగమ్య గోచరంగా అనిపించింది. ఏం చేయాలో తెలీక ఫిలింనగర్ అంతా తిరిగారు. చివరకు పదివేలు ఖర్చు పెట్టి '''పండు వెన్నెల ''' అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. దానికి పేరైతే వచ్చింది కానీ... డబ్బులు మాత్రం రాలలేదు. దాంతో చేసేది లేక భుక్తి కోసం ప్రైవేటు ఉద్యోగాలు కూడా చేశారు. 'పండు వెన్నెల ' స్ఫూర్తితో... ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒక ప్రైవేటు ఆల్బమ్స్ చేస్తుండేవారు చక్రి. అలా... మూడేళ్లల్లో 30 మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. చక్రి జీవితంలో మేలి మలుపు 'చిరునవ్వు ' మ్యూజిక్ ఆల్బమ్. సన ఆడియో వారు చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేకంగా ఓ ఆల్బమ్ చేయాలనుకొని చక్రిని సంప్రదించారు. స్వతహాగా చిరంజీవి వీరాభిమాని అయిన చక్రి ఆ ఆల్బమ్ చేయడానికి అంగీకరించారు.
చిరంజీవి పాత పాటలనే రీమిక్స్ చేసి, ఆల్బమ్ చేయాలనేది సన ఆడియో వారి ఆలోచన. అయితే... చక్రి మాత్రం అందుకు ససేమిరా అన్నారు. తానే స్వయంగా రాసి, స్వరపరుస్తానని చెప్పి, 8 పాటలతో 'చిరునవ్వు ' ఆల్బమ్‌ని రూపొందించారు. ఆ ఆల్బమ్ విన్న చిరంజీవి... చక్రిని ఎంతో మెచ్చుకున్నారు. ఆ అల్బమ్‌లోని పాటల్ని '''చల్లగాలి ''' అనే కలంపేరుతో చక్రే రాశారు. చక్రి మంచి గీత రచయిత కూడా. చిరునవ్వు పుణ్యమా అని చక్రికి సినిమా అవకాశాలు రావడం మొదలైంది. అరంగేట్రం పెద్ద సినిమాతో చేయాలనుకున్న చక్రి.. చిన్న సినిమా ఆవకాశాలన్ని తోసిపుచ్చారు. తప్పక ఒప్పుకున్న రెండు మూడు చిన్న [[సినిమాలు]] విడుదలకు నోచుకోలేదు. చివరకు పూరి జగన్నాథ్ [[బాచి]] (2000) చిత్రంతో సంగీత దర్శకునిగా చక్రి సినీ సంగీత ప్రస్థానం మొదలైంది. ఏ సంగీత దర్శకుని వద్ద సహాయకుగా చేయకుండానే సంగీత దర్శకుడైన ఘనత చక్రికి దక్కుతుంది.
 
ఆ తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు చక్రి దర్శకత్వం వహించాడు. అంత‌కు ముందే పిల్లలు కాదు పిడుగులు చిత్రంలో ఒక పాటకు సంగీతం అందించారు. దేనికైనా రెడీ చిత్రంలోనూ 3 పాటలకు చ‌క్రి సంగీతం అందించారు.సత్యం సినిమాకు ఉత్తమ గాయకుడిగా చక్రి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 85 చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు. బాచి సినిమాతో సంగీత దర్శకుడిగా చక్రి తన కెరీర్‌ను ప్రారంభించారు. సింహా సినిమాకు చక్రి నంది అవార్డు అందుకున్నారు. చక్రి సంగీతం అందించిన చివరి చిత్రం ఎర్రబస్సు.
"https://te.wikipedia.org/wiki/చక్రి" నుండి వెలికితీశారు