చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంగీత సరస్వతి సేవ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , , → , using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
==తొలినాళ్లు==
సుబ్రహ్మణ్యం పేరయ్య మరియు మొగిలమ్మ దంపతులకు 22 జూన్ 1898 తేదీన [[చిత్తూరు జిల్లా]] [[పలమనేరు]] మండలం (అప్పటి [[పుంగనూరు]] తాలూకా) లోని [[కొలమాసనపల్లె]] గ్రామంలో జన్మించారు. మొదట తల్లిదండ్రుల వద్ద కర్ణాటక సంగీతాన్ని నేర్చుకొన్నారు. వీరు బాలమేధావిగా తన 5వ ఏటనే శాస్త్రీయ సంగీతం పాడటం ప్రారంభించారు.<ref>సుబ్రహ్మణ్యం పిళ్లె, చిత్తూరు (1900-1960) : 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ 989.</ref> తండ్రి వద్ద చిన్నప్పుడే [[హరికథ]]లను చెప్పటం నేర్చుకున్నారు. పదేళ్లు వచ్చేసరికి చిత్తూరు, వేలూరు, బెంగుళూరు మొదలైన ప్రాంతాల్లో పాట కచేరీలు చేయడం ప్రారంభించారు. ప్రఖ్యాత గాయని [[ధనకోటియమ్మ]] సలహా మేరకు కాంచీపురంలోని [[నాయన పిళ్లై]] గారి వద్ద శిష్యునిగా చేరి శాస్త్రీయ సంగీతాన్ని శాస్త్రీయంగా గురుకుల పద్ధతిలో 14 సంవత్సరాలు అభ్యసించారు.<ref name="carnatica1">[http://www.carnatica.net/artiste/chittoorsubramanyam.htm Chittoor SubramanYam Pillai]. Carnatica.net. Retrieved on 28 July 2011.</ref>
 
==సంగీత సరస్వతి సేవ==
చిత్తూరు సుబ్రహ్మణ్యం [[మద్రాసు]] నగరంలో స్థిరనివాసమేర్పరచుకున్నను భారతదేశమంతా తిరిగి సుమారు 50 సంవత్సరాలకు పైగా సంగీత కచేరీలు చేసి శ్రోతల్ని మెప్పించారు.
 
వీరు [[త్యాగరాజస్వామి]] వారి కీర్తనలను లయ ప్రధానంగా గానం చేయడంలో మేటిగా పేరుపొందారు. వీరు ఎక్కువగా కాంచీపురం రీతిలో గానం చేసేవారు. వీరు స్వరప్రస్థానం మరియు కాలప్రమాణంలో ప్రసిద్ధిచెందారు. వీరు త్యాగరాజు మరియు ముత్తుస్వామి దీక్షితులు రచించిన అరుదైన కీర్తనలను ఆలపించడంలో దిట్ట.<ref name="musicplug1">[http://www.musicplug.in/blog.php?blogid=7897&cmtdisp=1 Classical&nbsp;– Vocal&nbsp;– Chittoor Subramania Pillai 1&nbsp;– Jaganmohini Shines With Chittor Subramania Pillai]. Musicplug.in (30 May 2007). Retrieved on 28 July 2011.</ref>
 
ఆకాలంలో రికార్డింగు విధానం ప్రారంభ దశలో ఉండుటవలన, వీరు రచించిన ''మధురా నగరిలో చల్లలమ్మ బోను'', ''కులములోన గొల్లదాన'' మరియు '''మావల్లగాదమ్మ''' వంటి కొన్ని మాత్రము [[కొలంబియా బ్రాడ్కాస్టింగ్ సిస్టం|కొలంబియా]] సంస్థ ద్వారా రికార్డు చేయబడ్డాయి.<ref>[http://www.hindu.com/fr/2006/10/27/stories/2006102701150300.htm Friday Review Hyderabad / Tribute : Carnatic classicist remembered]. The Hindu (27 October 2006). Retrieved on 28 July 2011.</ref>
 
వీరు గురుకుల పద్ధతిలో ఎందరో శిష్యులకు సంగీతవిద్యను బోధించారు. వారిలో కొందరు సుప్రసిద్ధ విద్వాంసులుగా పేరుపొందారు. వీరిలో [[మధురై సోమసుందరం]], [[బొంబాయి ఎస్. రామచంద్రన్]], <ref name="musicplug1"/> [[చిత్తురు రామచంద్రన్]], [[టి. టి. సీత]], [[తాడేపల్లి లోకనాథ శర్మ]] మరియు [[రేవతీ రత్నస్వామి]] ముఖ్యులు.
 
వీరు [[తిరుపతి]] పట్టణంలో 1942 నుండి [[త్యాగరాజ ఆరాధనోత్సవాలు|త్యాగరాజ]] ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించి ''సప్తగిరి సంగీత విద్వన్మణి'' అనే పురస్కారాన్ని ప్రముఖ కర్ణాటక విద్వాంసులకు ప్రదానం చేసేవారు.<ref name="hindu2002"/> ఆకాలంలోనే చాలా [[అన్నమాచార్య]] కీర్తనలను స్వరపరచి అందించారు. అందులో ఇతడొకడే, నారాయణతే ముఖ్యమైనవి.
 
కర్ణాటక విద్వాంసునిగా చివరిదాకా సంగీత సాధనతోనే జీవితాన్ని సఫలం చేసుకున్న ధన్యజీవి<ref name="carnatica1"/><ref>[http://www.hindu.com/fr/2009/05/15/stories/2009051551300400.htm Friday Review Chennai / Columns : Titan from Kanchipuram]. The Hindu. Retrieved on 28 July 2011.</ref> 1975 సంవత్సరంలో పరమపదించారు.
 
వీరికి మొదటి భార్య కాంతమ్మ మరియు రెండవ భార్య రామతిలకం వలన ఇద్దరు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు కలిగారు. వారిలో పెద్దకుమార్తె రేవతీ రత్నస్వామి తండ్రి పేరును విశ్వవ్యాప్తం చేయాలని నిరంతరం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు.
తండ్రిగారి జ్ఞాపకార్థం [[సుబ్రహ్మణ్య సంగీతక్షేత్ర]] ప్రారంబించి ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరంలో మూడు రోజులపాటు వివిధ సంగీత కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.
 
==నిర్వహించిన పదవులు==