అంతర్జాలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
మా ఊరు రైలు స్టేషన్ లో “సామానులని నిల్వ చేసే గిడ్డంగి” (గొడౌను) ఉంది. దీనినే గోదాం అని కాని, మండీ అని కాని అంటారు. మా ఉరుపాటి ఊళ్లన్నిటిలోను ఇలాటి గిడ్డంగులు ఉంటాయి. మా ఊరు నుండి ఎగుమతి చేసే ఖద్దరు బట్టలు, బెల్లం, చింతపండు, అడ్డాకులు, తమలపాకులు, మామిడి పళ్లు, వగైరాలు ఈ గిడ్డంగిలో ఉన్న గదులలో పేర్చేవారు - బండి వచ్చి బరువులు ఎక్కించుకుని మోసుకుపోయేవరకు. ఇలా ప్రతి ఊళ్లోను ఎగుమతులు, దిగుమతులు చెయ్యవలసిన సరకులని దాచడానికి గిడ్డంగి గదులు ఉంటాయి కదా. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అల్లుకుపోయిన గిడ్డంగులని “విశ్వ వ్యాప్త గిడ్డంగుల అల్లిక” అందాం. దీనినే ఇంగ్లీషులో అంటే “వరల్డ్ వైడ్ వెబ్” (World Wide Web) అవుతుంది. ఇక్కడ “వెబ్” అన్న పదం “స్పైడర్ వెబ్” (spider web) లాంటి ప్రయోగం కనుకనున్నూ, “స్పైడర్ వెబ్”ని తెలుగులో “సాలె గూడు” అని కాని, “సాలె పట్టు” అని కాని అంటాము కనుకనున్నూ, “వరల్డ్ వైడ్ వెబ్” (world wide web లేదా WWW) ని “ప్రపంచ పరివ్యాప్తమైన పట్టు” లేదా “పపప” అనొచ్చు.
 
రైలు పట్టాలు లేకుండా కేవలం గిడ్డంగులు, ఆ గిడ్డంగులలో సామానులు ఉండి మాత్రం ఏమి లాభం? అలాగే రైలు మార్గాలు ఉండి, వాటి మీద రవాణా చెయ్యడానికి సరుకులు లేకపోతే ఏమి ప్రయోజనం? కనుక రైలు మార్గం లాంటి ఇంటర్‌నెట్టూ, అల్లుకుపోయిన గిడ్డంగులు లాంటి వర్లడ్ వైడ్ వెబ్బూ, రెండూ ఉంటేనే ప్రయోజనం. ఇంటర్‌నెట్ రవాణాకి కావాలి. వెబ్ సరుకులు దాచుకుందికిదాచుకునేందుకు కావాలి. ఈ ఉపమానం ఇంతటితో సమాప్తం.
 
ఇప్పుడు రైలు మార్గాలకి బదులు సమాచార ప్రసార మార్గాలు – అంటే టెలిఫోను సౌకర్యాలలాంటివి – చూద్దాం. రైలు మార్గాలలాగే ఈ సమాచార ప్రసార మార్గాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ సమాచార వలయానికి (అంతర్జాలానికి, ఇంటర్‌నెట్‌కి) మన కంప్యూటరుని (మన గిడ్డంగిని లేదా మన వెబ్ పేజిని) తగిలించేమనుకొండి. మనం ఇతరులతో పంచుకోవాలనుకున్న వ్యాసాలు, కథలు, ఛాయాచిత్రాలు, పాటలు, వగైరాలని మన కంప్యూటర్‌లో ఉన్న మన “గిడ్డంగి”లో పెడితే అప్పుడు అవన్నీ ఆ సమాచార వలయంతో లంకించుకున్న వారందరి అందుబాటులోకి వస్తాయి. టూకీగా ఇదీ కథ.
 
మనం ఇతరులతో పంచుకోదలచిన సమాచారాన్ని కంప్యూటర్‌లో ఎక్కడ దాచుకుంటామో ఆ స్థలం “మన వెబ్‌సైట్” లేదా తెలుగులో “మన గిడ్డంగి” అనో “మన ఆటపట్టు” అనో అందాం. ఈ ఆటపట్టులో ఉండేవి చింతపండు, బెల్లం కాదు - సమాచారం. కనుక ఈ “వెబ్ సైట్” (ఆటపట్టు) ని పుస్తకంలో పేజీలలా అమర్చుకుంటే చదివేవారికి సదుపాయంగా ఉంటుంది. అప్పుడు ప్రతి పేజీని “వెబ్ పేజ్” (web page) లేదా “పట్టు పుట” అని కాని “పట్టు పత్రం” అని కాని అనొచ్చు. పుస్తకానికి ముఖపత్రం ఎలాంటిదో అలాగే ఆటపట్టు (“వెబ్ సైట్”) కి ముఖపత్రం (“హోం పేజి”) అలాంటిది. పుస్తకం కొనేవాడు అట్ట మీద బొమ్మ చూసి కొంటాడు. ఇంట్లోకి వచ్చేవాడు వీధి వాకిలి ఎలా ఉందో చూస్తాడు. కనుక ప్రతి వెబ్ సైట్ కి అందంగా ఉన్న ముఖపత్రం ఒక ముఖ్యమైన అంగం.
 
===డొమెయిన్ నేమ్‌ లేదా ఇలాకా పరిధి ===
ఇళ్లకి చిరునామాలు లేదా విలాసాలు ఉన్నట్లే ఈ వెబ్ సైట్లకి (ఆటపట్లకి) కూడా చిరునామాలు ఉంటాయి. చిరునామాలో వ్యక్తి పేరో, సంస్థ పేరో ఉండడమే కాకుండా, ఊరు పేరు దేశం పేరు ఉంటాయి అన్న విషయం మరచిపోకండి. వెబ్ సైట్ల చిరునామాని ఇంగ్లీషులో URL (Universal Resource Locator) అంటారు. ఉదాహరణకి http://www.Friendsoftelugu.org అనే చిరునామానే తీసుకుందాం. ఇందులో http అనేది ఇది ఏ రకం వెబ్ సైటో చెబుతుంది. అంటే వెబ్ సైట్లలో రకాలు ఉంటాయన్నమాట. తరువాత ://ని చూడగానే కంప్యూటర్ (బ్రౌజర్) రాబోయేది "ఒకానొక రకం" వెబ్ సైటు విలాసం అని తెలుసుకుంటుంది. ఈ విలాసంలో “మాటకీ మాటకీ మధ్య” చుక్కలు మాత్రమే ఉండొచ్చు (కామాలు, కోలన్లు, వగైరా విరామ చిహ్నాలు నిషిద్ధం). తరువాత Friendsoftelugu అనేది వెబ్ సైటు పేరు. తరువాత చుక్క, ఆ చుక్క తరువాత “ఆర్గ్” (org) - అంటే ఇది ఏ రకం సంస్థో చెబుతోందన్న మాట. దీనిని ఇంగ్లీషులో “డొమైన్ నేం” (domain name) అంటారు; తెలుగులో “ఇలాకా పేరు” అందాం. ఇలాకా అంటే అధికార పరిధి అని అర్థం.
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలం" నుండి వెలికితీశారు