కొబ్బరి కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేసెడి → చేసే using AWB
చి →‎పోక చెట్టు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దేశమునకు → దేశానికి using AWB
పంక్తి 66:
హింతాల వృక్షము ఆరు, ఏడు అడుగులెత్తు పెరుగును గాని దాని8 ంరాను ఈత, ఖర్జూరపు మానుల కంటే సన్నముగా నుండును. దీనిలో పోతు చెట్లు ఆడు చెట్లు గలవు. ఆకుల కొంచెము ఈతాకులవలె నుండును. మొదట నున్న చిట్టి ఆకులు చిన్నవి. వాని వద్ద ముండ్లు గలవు. దీని కాయలు బాగుండవు. సన్నముగా నున్న మాను చేతి కర్రలకు బాగుండును. ఈ చేతి కర్రలతో నడుచు చుండిన త్రోవయందుండు పాములు తొలగి పోవునని కొందరకు నమ్మకము గలదు.
==పోక చెట్టు==
పోక చెట్టు చిరకాలము నుండియు తోటలలో పెంచు చున్నారు. అవి సముద్రమునకు రెండు వందల మైళ్ళ దూరములోను మూడు వేల అడుగుల ఎత్తు ప్రదేశములలోను పెరుగ జాలవు. వానికి నీరును వేడిమియు ఎక్కువగానే కావలెను. విత్తనముల కేబది యిరువది సంవత్సరముల చెట్ల కాయలు మంచివి. అట్టి వానినే తోటలలో నొక మడిలో పాతుదురు. ఒకటి రెండు సంవత్సరములైన పిదప చిన్న మొక్కలను దీసి ఆరేడడుగుల దూరమున నాటెదరు. పోక తోటలలోనె కొన్ని చోట్ల, అరటి, కొబ్బరి, పనస చెట్లను వేయు చున్నారు. మరి కొన్ని తావులందు బాడిద చెట్లను వేయుదురు. ఈ చెట్లు లేత పోక మొక్కల కెండ దెబ్బ దగుల నీయవు. అయిదారు సంవత్సరములు రాగాఏ కాయలు కాయుటకు ఆరంభించి, రమారమి ఆరువది సంవత్సరముల ఒకరు కాయును. ఒక చెట్టు సాధారణముగ రెండు గెలలు వేయును. కాని నేల సార వంతమైన యెడల మూడు నాలుగు గెలలు కూడా వేయును. ఒక చెట్టునకు సాధారణముగ 300 కాయలు దిగును. వర్షాకాలములో కాయలపై విస్తారము వాన కురిసినచో అవి కుళ్ళి పోవును గాన వాని పై పోక దొప్పలను కప్పు చుందురు. చెట్లెక్కి దొప్పల గట్టు వారు నిపుణులగుచో ఒక చెట్టు నుండి మరియొక చెట్టుంకు ఆకులను బట్టి కొనియే పోగలరు. కొన్ని కొన్ని తోట లందొకప్పుడు కాయలు పుచ్చు చుండును. పుచ్చునపుడు పువ్వుల మీదను కాయల మీదను నల్లని మచ్చలు బయలు దేరును. ఈ మచ్చలు వర్షము తగిలినచో ఎక్కువగును. కావున వర్షాకాలములో వానిపై దొప్పలను గప్పుట ఆవస్యకము. ఒకొక్కప్పుడు చెట్లకు చెద కూడా పట్టుట ఉంది. విస్తారమెండలు కాయు చున్న దినములలో నీరునెక్కువగా పోయ కూడదు. పోసినచో చెట్టు తలలు విరిగి పడి పోవును. పోక తోటలందు చెమ్మ యారకుండుటయో కొంచెము మంచిది. పొగాకు, అల్లము, పసుపు తమలపాకు మొక్కలు చెమ్మ నారనీయవు గావున వానిని గూడ పోత తోటలందు వేయుట మంచిది.కాయలనుండి పోక చెక్కలను పలు చోట్ల బలువిధములుగా చేస్తున్నారు. కొందరు కాయలు పూర్తిగ ముదరకమునుపే కోయు చున్నారు గాని మిదిరిన కాయల చెక్కలే మంచివి. కొన్ని చోట్ల కాయలను కోసి, ఎండ బెట్టియే ముక్కలుగా కోసెదరు. మరి కొన్ని చోట్ల వానినుడక బెట్టెదరు. కొందరు ముక్కలు చేసి, ఉడక బెట్టుదురు కాని ఉడక బెట్టని ముదురు కాయలు శ్రేష్ఠము. రెండవ రకము చెక్కలకు మంచి వానివలె నగపడుటకు ''కొస '' బూసెదరు. పెద్ద పెద్ద రాగి డేగిసాలలో పోక కాయలనుడక బెట్టుచు అందులో, సున్నము గాని, తెల్ల మద్ది బెరడు యొక్క బూడిద గాని పోసెదరు. అట్లు రెండు గంటలు క్రాగనిచ్చి చత్రములతో ఆ కాయలను దేవి క్రొత్త కాయల నందులో వైతురు. ఆ కాయలు కూడా నించు మించి రెండు గంటలు ఉడకగానే వానిని దీసి వైతురు. కాగులో మిగిలిన అరసము చిక్కపడి, ఎర్తాగా నగును. దీనిని మరియొక దానిలో పోసి ఎండ బెట్టుదురు. ఇదియే ''కొస '' ఇది కవిరి (కాచు) అను కొందురేమో గాని, నిజముగా కాదు. కవిరిని ఒక తుమ్మజాతి చెట్టునుండి చేయుదురు. లవంగ చూరు, చేయుటకు కాయడిప్పతోడనే కత్తిరింతురు. తారుచు మంచి పోక కాయలను లవంగ చూరుచేయుట లేదు.లేక అపోక కాయలు విరేచన కారి. ఎండు కాయలు పొడి గాని, కాల్చిన కాయల పొడిగాని పండ్లకు మంచిది. వీని వాడుక అంతయు తాంబూలములోనే. సదా భోజన మైన పిదప తాంబూలము వేసి కొందుము. అన్నమరుగ జేయు శక్తి కొంచెము దానికి గలదందురు. మరియు తాంబూలమునందు వేసికొను మరి కొన్ని సుగంధ పదార్థములు వీర్య వృద్ధి చేయునందురు. గృహస్తులకు దప్ప మిగిలిన వారలు తాంబూలము వేసికొన కూడదనుటకు నిదియే కారణమై యుండును. ఏదియెట్లున్నను తాంబూలమునకు మిగుల గౌరవము గలదు. అసది నుండియు, మనలను జూడ వచ్చిన వారికి తాంబూలమిచ్చి గౌరవించుట మనకు ఆచార మైయున్నది. మన దేశమునకుదేశానికి క్రొత్తగా వచ్చినపుడు అయిఆరోపియనులు కూడా తాంబూలము తరచు వేసికొను చుండెడి వారట.
[[File:Kallu kumda 1.JPG|thumb|right|కల్లు కుండ కట్టిన ఈత చెట్టు]]
==ఖర్జూరపు చెట్టు==
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_కుటుంబము" నుండి వెలికితీశారు