కొల్లిపర: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి, ఆగష్టు → ఆగస్టు using AWB
పంక్తి 145:
#శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామి వార్ల ఆలయం;- కొల్లిపర గ్రామంలో [[కృష్ణా నది]] పరీవాహక ప్రాంతములో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామి వార్ల తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, ఫాల్గుణమాసంలో పౌర్ణమిరోజున వైభవంగా నిర్వహించెదరు. సూర్యోదయానికే భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చి, పొంగళ్ళు, పసుపు కుంకుమలు, పట్టువస్త్రాలు సమర్పించుకుంటారు. తిరునాళ్ళను పురస్కరించుకొని, వీధులలో సందడి వాతావరణం నెలకొంటుంది. " వింతా " వారి కుటుంబం నుండి తిరుపతమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించటం ఇక్కడి ఆనవాయితీ. గ్రామ (ప్రభ) బండి ఏర్పాటు చేసి, పసుపు, కుంకుమలతో కుటుంబసభ్యులు ఆలయానికి తరలివచ్చెదరు. [5]
#శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి మాన్యం భూములు, మెట్ట-16 సెంట్లు, ఆర్ధనూరివారి ధర్మ తోపు మాగాణి-8.66 ఎ., చేపలచెరువు-2 ఎ., దావులూరి అడ్డరోడ్డు లోని విశ్వబ్రాహ్మణచెరువు భూమి-3.93 ఎ. [8]
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 49 రోజులనుండి నిర్వహించుచున్న హనుమాన్ చాలీసా పారాయణం ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని, ఆఖరిరోజైన 2015,జూన్-13వ తేదీ [[శనివారం]]నాడు, స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయస్వామివారి కళ్యాణాన్ని, కన్నులపండువగా నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ వేడుకలలో పాల్గొన్నారు. [11]
శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- కొల్లిపర గ్రామములో, కృష్ణానది కరకట్టపై నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-3వతేదీ శనివారంనాడు ప్రారంభమైనవి. 5వతేదీ సోమవారంనాడు, మూలమంత్ర మహాహోమం, యంత్రస్థాపన, స్వామివారి విగ్రహప్రతిష్ఠ, విమాన శిఖరస్థాపన, స్వామివారి కళావాహన మొదలగు పూజాకార్యక్రమాలు నిర్వహించెదరు. శనివారం నుండి సోమావారం వరకూ, ఈ మూడురోజులూ, ఆలయంలో హనుమాన్‌చాలీసా పారాయణ కార్యక్రం నిర్వహించెదరు. చివరిరోజున శ్రీ సీతారాముల శాంతికళ్యాణం నిర్వహించెదరు. []
#శ్రీ [[షిర్డీ సాయిబాబా]] మందిరం.
 
"https://te.wikipedia.org/wiki/కొల్లిపర" నుండి వెలికితీశారు