సముద్ర ట్రెంచ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ను → ను (7), గా → గా (3), తో → తో (3), విచ్చిన్న → వి using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (10), లు ద్వారా → ల ద్వారా using AWB
పంక్తి 7:
==ట్రెంచ్ లక్షణాలు==
* ట్రెంచ్ లు సముద్ర భూతలంపై సబ్‌డక్షన్ మండలం ప్రారంభమయ్యే ప్రాంతాన్ని సూచిస్తాయి.
* సముద్ర భూతలం పైన ఏర్పడిన అత్యంత లోతైన ప్రాంతాలు ట్రెంచ్ లు. సగటును వీటి లోతు 6 కిలోమీటర్లు కాగా అత్యధిక లోతు 11 కిలోమీటర్ల వరకూ వుంటుంది. పసిఫిక్ మహా సముద్రం లోని మెరియానా ట్రెంచ్ వద్ద గల ఛాలెంజర్ డీప్ ప్రాంతం అత్యధికంగా 11,034 మీటర్లు లోతు కలిగి వుందిఉంది.
* ఇవి [[ద్వీప వక్రతలు]] (Island arcs) లేదా అగ్నిపర్వత వక్రతలు (Volcanic arcs) లేదా సముద్రాంతర్గత పర్వత పంక్తుల (Oceanic Ridges) కు సమాంతరంగా వ్యాపించి వుంటాయి.
* ఇవి సాధారణంగా వక్రం లేదా చాపాకారంలో (arc shaped) విస్తరించి వుంటాయి.
* సాధారణంగా ఇవి సముద్ర భూతలం మీద వేలాది కిలోమీటర్ల పొడుగున విస్తరించి వుంటాయి. సగటున 3000-4000 కిలోమీటర్ల పొడవులో విస్తరించి వుంటాయి. [[దక్షిణ ఆమెరికా]] పశ్చిమ తీర సమీపంలో వున్న పెరూ-చిలీ ట్రెంచ్ అత్యధికంగా 5900 కిలోమీటర్ల పొడవు కలిగి వుందిఉంది.
* రెండు సముద్ర పలకలు ఢీ కొన్నప్పుడు కాని లేదా సముద్రపు పలక- ఖండ పలకలు రెండు ఢీ కొన్నప్పుడు కాని ఆ పలకల అభిసరణ సరిహద్దుల వద్ద ఇవి ఏర్పడతాయి. అభిసరణ పలక సరిహద్దుకు సమాంతరంగా వక్రం లేదా చాపం (Arc) ఆకారంలో ఏర్పడతాయి.
* ఇవి చొచ్చుకోనిపోయే పలక (Subducting plate) కు కుంభాకారంగా (Convex) అమరి వుంటాయి.
పంక్తి 41:
[[File:Pacific Ring of Fire.svg|thumb|300 px|right|పసిఫిక్ మహాసముద్ర అంచులలో విస్తరించిన పసిఫిక్ అగ్ని వలయం (Pacific Ring of Fire) -దానిలో భాగంగా వున్న ట్రెంచ్ లు]]
 
పసిఫిక్ మహాసముద్రానికి తూర్పు వైపున ఏర్పడిన ట్రెంచ్ లలో 'మధ్య అమెరికా ట్రెంచ్', 'పెరూ-చిలీ ట్రెంచ్' లు ముఖ్యమైనవి. ఇవి ఖండాల అంచు (మార్జిన్) లలో ఏర్పడిన కారణంగా మార్జినల్ ట్రెంచ్ రకానికి చెందిన ట్రెంచ్ లుగా పేర్కొంటారు. 'మధ్య అమెరికా ట్రెంచ్' 2,750 కిలోమీటర్ల పొడవుతో మధ్య [[మెక్సికో]] నుండి [[కోస్టారీకా]]కు వరకు గల తీర సమీపంలో [[పసిఫిక్ మహాసముద్రం]]లో ఏర్పడింది. దీని గరిష్ఠ లోతు 6669 మీటర్లు. 'పెరూ-చిలీ ట్రెంచ్', [[పెరూ]]-[[చిలీ]] దేశాల తీరానికి 160 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడింది. [[పెరూ]] నుంచి [[చిలీ]] వరకు గల తీరానికి సమాంతరంగా ఏర్పడిన ఈ ట్రెంచ్ 5,900 కిలోమీటర్ల పొడవుతో సగటున 64 కిలోమీటర్ల వెడల్పుతో వుందిఉంది. అత్యధిక లోతు రిచర్డ్స్ డీప్ వద్ద సముద్ర మట్టం నుండి 8,065 మీటర్లుగా నమోదయ్యింది. ప్రపంచంలో అతి పొడవైన ట్రెంచ్ గా 'పెరూ-చిలీ ట్రెంచ్'ను పేర్కొంటారు.
పశ్చిమ [[యు.ఎస్.ఏ]] తీరంలో కొన్ని మార్జినల్ ట్రెంచ్ లు సమీప ఖండ భాగాల నదులచే తీసుకోనిరాబడిన అవక్షేపాలతో పూడుకుపోయి కనిపిస్తాయి. ఇలా పూడుకు పోవడం చేత [[లోతు]]ను దాదాపుగా కోల్పోయిన ట్రెంచ్ లు (Filled Trenches) కొన్ని ఉత్తర కాలిఫోర్నియా లోని కేప్ మెండోసినో (Cape Mendocino) నుండి [[కెనడా]] సరిహద్దు వరకూ గల [[పసిఫిక్ మహాసముద్రం]]లో కనిపిస్తాయి.
పంక్తి 53:
రోమాంచి ట్రెంచ్ [[అట్లాంటిక్ మహాసముద్రం]]లో [[బ్రెజిల్]], పశ్చిమ ఆఫ్రికాల నడుమ [[భూమధ్య రేఖ]]కు కొద్దిగా ఉత్తరంగా ఏర్పడింది. సగటున 300 కిలోమీటర్ల పొడవుతో, 19 కిలోమీటర్ల వెడల్పుతో వున్న ఈ ట్రెంచ్ మద్య అట్లాంటిక్ రిడ్జ్ లను రెండుగా ఖండిస్తూ పోతుంది. దీని గరిష్ఠ లోతు 7,761 మీటర్లు.
 
దక్షిణ [[అట్లాంటిక్ మహాసముద్రం]]లో దక్షిణ సాండ్ విచ్ దీవులకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన 'దక్షిణ సాండ్ విచ్ ట్రెంచ్' 965 కిలోమీటర్ల పొడవునా వ్యాపించి వుందిఉంది. ఈ ట్రెంచ్ లో మిటియర్ (Meteor) వద్ద అత్యధిక లోతు 8,428 మీటర్లుగా నమోదయ్యింది. ఈ మూడు ట్రెంచ్ లు తప్ప అట్లాంటిక్ మహా సముద్రంలో చెప్పుకోదగ్గ ట్రెంచ్ లు ఏర్పడలేదు.
 
==='''[[హిందూ మహాసముద్రం]]'''===
పంక్తి 61:
==='''ఆర్కిటిక్ మహాసముద్రం'''===
 
[[ఆర్కిటిక్ మహాసముద్రం]]లో గల లోతైన ట్రెంచ్ ల ఉనికి-విస్తరణ పై అవగాహన చాలా పరిమితంగా వుందిఉంది. [[గ్రీన్‌లాండ్|గ్రీన్ లాండ్]]కు [[ఈశాన్యం]]లో లిట్కే డీప్ (Litke Deep) ఏర్పడి వుందిఉంది. ఇది [[నార్వే]] దేశానికి చెందిన స్వాల్ బార్డా (Svalbarda) దీవికి 350 కిలోమీటర్ల దూరంలో వుందిఉంది. దీని అత్యధిక లోతు 5,449 మీటర్లుగా గుర్తించబడింది.
.
 
పంక్తి 67:
[[File:Oceanic-oceanic convergence Fig21oceanocean.gif|thumb|300px|right|రెండు సముద్ర పలకల అభిసరణ సరిహద్దుల వద్ద ఏర్పడిన [[ద్వీప వక్రతలు]], ట్రెంచ్ లు (చొచ్చుకొనిపోతున్న పలక: సముద్ర పలక; పైభాగంలో వున్న పలక: సముద్ర పలక) ]]
 
విరూపకారిక ప్రక్రియ (Tectonic activity) వలన సముద్ర భూతలంపై ట్రెంచ్ లు ఏర్పడతాయి. ట్రెంచ్ ల ఆవిర్భావానికి దారి తీసిన విరూపక ప్రక్రియ రెండు విధాలైన పలకల చలనం వలన సంభవిస్తుంది. [[పలక విరూపణ సిద్ధాంతం]] ప్రకారం రెండు సముద్రపు పలకలు ఢీ కొన్నప్పుడు కాని లేదా సముద్రపు పలక-ఖండ పలక రెండూ ఢీ కొన్నప్పుడు కాని ఆ పలకల సరిహద్దులలో సబ్‌డక్షన్ మండలం ఏర్పడి దాని వెంబడి లోతైన సముద్ర కందకాలు (Trenches) మరియు సముద్త భూతలంపై [[ద్వీప వక్రతలు]] (Island Arcs) లేదా ఖండ భూతలంపై అగ్నిపర్వత వక్రతలు (volcanic arc) ఏర్పడతాయి. ఉదాహరణకు సముద్ర-సముద్ర పలకలు ఎదురెదురుగా ఢీ కొన్నప్పుడు పలకల సరిహద్దు అయిన సబ్‌డక్షన్ మండలం వెంబడి సముద్ర భూతలంపై [[ద్వీప వక్రతలు]], లోతైన [[ట్రెంచ్]]లు ఏర్పడతాయి. సముద్ర-ఖండ పలకలు ఎదురెదురుగా ఢీ కొన్నప్పుడు పలకల సరిహద్దు అయిన సబ్‌డక్షన్ మండలం వెంబడి సముద్ర భూతలంపై లోతైన ట్రెంచ్ లు, ఖండ భూతలంపై అగ్నిపర్వత వక్రతలు (volcanic arc) ఏర్పడే అవకాశం వుందిఉంది.
 
రెండు పలకలు (సముద్ర-సముద్ర పలకలు లేదా సముద్ర-ఖండ పలకలు) ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీ కొన్నప్పుడు అభిసరణ సరిహద్దుల వద్ద సబ్‌డక్షన్ మండలం ఏర్పడుతుంది. ఈ సరిహద్దు మండలంలో అధిక వేగంతో చలించే సాంద్రతర సముద్ర పలక వేరొక పలక (సముద్ర లేదా ఖండ పలక ఏదైనా కావచ్చు) లోనికి చొచ్చుకొనిపోతుంది. ఆ విధంగా భూ ప్రావారం (mantle) లోనికి చొచ్చుకుపోయిన సముద్ర పలక లోని కొంత పటల (Crust) భాగం అధిక లోతుల వద్ద, అధిక ఉష్ణోగ్రతల వలన కరిగిపోతుంది. ఇలా కరిగిన పటలం, మాగ్మా రూపంలో చీలికలుచీలికల ద్వారా నిరంతరం పైకి ఉబికి వస్తుంది.
[[File:Oceanic-continental convergence Fig21oceancont.gif|thumb|300px|right|సముద్ర-ఖండ పలకల అభిసరణ సరిహద్దుల వద్ద ఏర్పడిన అగ్నిపర్వత వక్రతలు (volcanic arc), ట్రెంచ్ (చొచ్చుకొనిపోతున్న పలక: సముద్ర పలక; పైభాగంలో వున్న పలక: ఖండ పలక]]
 
పంక్తి 88:
ఒక ట్రెంచ్ రెండు రకాలకూ కూడా చెంది వుండవచ్చు. ఉదాహరణకు అలూషియన్ ట్రెంచ్, ఇది తూర్పు భాగంలో మార్జినల్ ట్రెంచ్ రకానికి చెందినది అయితే పశ్చిమ [[అలస్కా]] నుండి కంచట్కా ద్వీపకల్పం వరకూ గల ప్రాంతంలో [[ద్వీప వక్రత]] రకానికి చెందిన ట్రెంచ్ గా ఏర్పడింది
 
కొన్ని సందర్భాలలో ఖండాల అంచులలో వున్న మార్జినల్ ట్రెంచ్ లు సమీప ఖండాల నుంచి నదీ ప్రవాహాలు తీసుకొని వచ్చే అవక్షేపాలతో పూడుకుపోతాయి. దానివల్ల ట్రెంచ్ ల స్వాభావిక ధర్మమైన [[లోతు]] అనేది ఈ ట్రెంచ్ లలో కనిపించదు. ఈ అవక్షేపాలు నిరంతరం నిక్షేపించబడటం వల్ల ఒకొక్కప్పుడు ట్రెంచ్ ల వద్ద సముద్ర భూతలం మృదువుగాను దాదాపుగా సమతలంగాను మారిపోవచ్చు. అయినప్పటికీ వీటిని ట్రెంచ్ లు గానే వ్యవహరిస్తారు. అలూషియన్ ట్రెంచ్ గల్ఫ్ అఫ్ అలస్కా వద్ద గల కోడియాక్ (Kodiak) దీవి సమీపంలో అవక్షేపాలతో పూడుకుపోడం వల్ల ఆ దీవి సమీపంలో ట్రెంచ్ భాగం సమతలంగా వుందిఉంది.
 
అదే విధంగా పశ్చిమ [[యు.ఎస్.ఏ]] తీరంలోని కొన్ని మార్జినల్ ట్రెంచ్ లు అవక్షేపాలతో పూడుకుపోయి కనిపిస్తాయి. ఉత్తర కాలిఫోర్నియా లోని కేప్ మెండోసినో (Cape Mendocino) నుండి కెనడా సరిహద్దు వరకూ గల సముద్ర తీరంలో ఏర్పడిన ట్రెంచ్ లు, సమీప కాస్కేడ్ పర్వత శ్రేణులకు చెందిన నదులు తెచ్చే అవక్షేపాలతో దాదాపుగా పూడుకుపోయాయి. ఈ విధంగా [[లోతు]]ను కోల్పోయిన ఈ ట్రెంచ్ లను పూడుకుపోయిన ట్రెంచ్ లు (Filled Trenches) గా పేర్కొంటారు. అదేవిధంగా ఏంటిల్లస్ చిన్న దీవులు (lesser Antilles) వద్ద ప్యూర్టోరికో ట్రెంచ్ దక్షిణ అమెరికా నదుల నుండి వచ్చే అవక్షేపాల వలన క్రమేణా పూడుకుపోతుంది.
పంక్తి 114:
 
* భూగోళపు లితోస్ఫియరిక్ పలకల యొక్క సహజ సరిహద్దుల వద్ద ట్రెంచ్ లు ఏర్పడ్డాయి. ఈ ట్రెంచ్ ల అధ్యయనం వలన పలకల అభిసరణ సరిహద్దుల యొక్క విలక్షణమైన, అధ్బుతమైన లక్షణాలు తెలుస్తాయి.
* ప్రపంచంలో భూకంపాలలో అధిక భాగం సబ్‌డక్షన్ మండలాలలోనే సంభవిస్తుంది. ట్రెంచ్ లు సబ్‌డక్షన్ మండలాల వెంబడి ఏర్పడతాయి. ఒకవిధంగా ట్రెంచ్ లు సముద్ర భూతలంపై సబ్‌డక్షన్ మండలం ప్రారంభమయ్యే ప్రాంతాన్ని సూచిస్తాయి అని చెప్పవచ్చు. కనుక ట్రెంచ్ ల సమీపంలో తీవ్రమైన భూకంప ప్రక్రియలు సంభవిస్తాయి. ఇతర ప్రాంతాలలో ఏర్పడే సాధారణ [[భూకంపం|భూకంపాల]]తో పోలిస్తే, సబ్‌డక్షన్ మండలాల వెంబడి ముఖ్యంగా ట్రెంచ్ ల ప్రాంతాలలో సంభవించే భూకంపాల తీవ్రత చాలా ఎక్కువగా వుందిఉంది. తీవ్ర వినాశనానికి దారితీస్తుంటాయి. కనుక ట్రెంచ్ ల అధ్యయనం ప్రపంచంలో తీవ్ర [[భూకంపం|భూకంపాలు]], [[సునామీ]]లు సంభవించగల ప్రాంతాల ఉనికిని ముందుగానే అంచనా వేయడానికి తోడ్పడుతుంది. పసిఫిక్ అగ్ని వలయం (Pacific ring of fire) అనేది పసిఫిక్ అంచులలో [[భూకంపం|భూకంపాలు]], అగ్నిపర్వత ప్రక్రియలు ఏర్పడే ప్రాంతాన్ని సూచిస్తుంది. [[పసిఫిక్ మహాసముద్రం]]లో లోతైన ట్రెంచ్ లు దాదాపుగా పసిఫిక్ అగ్ని వలయంలో భాగంగా ఉన్నాయి.
* ప్రపంచ వ్యాప్తంగా కార్బానిక్ పదార్ధాన్ని సంగ్రహించడం ద్వారా ట్రెంచ్ లు భూగోళపు [[కార్బన్]] సింక్ (Carbon sink) లుగా పనిచేస్తూ, భూమి యొక్క [[కార్బన్ డయాక్సైడ్]] చక్రం ([[CO2|CO<sub>2</sub>]] cycle) లో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఫలితంగా శీతోష్టస్థితిని నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. వాతావరణంలో చేరిన [[కార్బన్ డయాక్సైడ్]] వాయువు చివరకు [[అవక్షేప శిలలు|అవక్షేప శిల]]లలో నిక్షిప్తమవుతుంది. క్రమేణా నదులవల్ల [[అవక్షేప శిలలు]], ఇతర ఆర్గానిక్ పదార్ధాల నిక్షేపాలు సముద్ర భూతలాన్ని చేరుకొని అక్కడనుంచి నెమ్మదిగా లోతైన ట్రెంచ్ ల లోనికి చేరవేయబడతాయి. ఈ విధంగా భూగోళవ్యాప్తంగా [[కార్బన్]] పదార్దాన్ని ([[అవక్షేప శిలలు|అవక్షేప శిల]]ల రూపంలోనూ, సేంద్రియ పదార్ధ రూపంలోను) సంగ్రహించిన ట్రెంచ్ లు [[CO2|CO<sub>2</sub>]] చక్రాన్ని పూర్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. పలకల సబ్‌డక్షన్ మండలంలో ఈ [[అవక్షేప శిలలు]] భూపటలంతో పాటు కరిగి భూప్రావారం (mantle) ను చేరుకొంటుంది. కరిగిపోయిన అవక్షేప శిలలలోని [[కార్బన్ డయాక్సైడ్]] వాయువులో కొంతభాగం తిరిగి మాగ్మాతో కలసి అగ్నిపర్వత ఉద్గారంలో భాగంగా భారీ మొత్తంలో తిరిగి [[వాతావరణం]] లోనికి వెదజల్లబడుతుంది. ఒకవేళ ట్రెంచ్ లు [[కార్బన్]] పదార్దాన్ని అవక్షేప శిలల రూపంలో సంగ్రహించకపోయివుంటే, సబ్‌డక్షన్ మండలంలోనికి వాటిని చేరవేయలేని కారణంగా CO<sub>2</sub> చక్రం పూర్తి కాదు. ఫలితంగా [[వాతావణం]] నుండి [[CO2|CO<sub>2</sub>]] వాయువు క్రమేణా వైదొలుగుతుంది. [[వాతావరణం]]లో [[CO2|CO<sub>2</sub>]] వాయువు [[శాతం]] ప్రస్తుతమున్న [[శాతం]] కన్నా కొద్దిగా పడిపోయినప్పటికీ [[భూమి|భూగోళం]] క్రమేణా గడ్డకట్టుకు పోయి స్నో బాల్ (Snow ball) మాదిరిగా మారిపోతుంది. కనుక ట్రెంచ్ లు భూగోళపు కార్బన్ సింక్ (Carbon sink) లుగా వుంటూ [[భూమి]] యొక్క శీతోష్టస్థితిని నియంత్రించడంలో కీలకపాత్ర వహిస్తున్నాయి.
* ట్రెంచ్ ల వద్ద సముద్ర పటలం (Oceanic crust) రీసైకిల్ (Recycle) చేయబడుతుంది. రిడ్జ్ ల వద్ద ఏర్పడిన సముద్ర పటలం, ట్రెంచ్ ల వద్ద తిరిగి భూప్రావారం (Mantle) లోనికి లాగివేయబడుతుంది. ఫలితంగా భూ ప్రావారం నుండి సముద్ర పటలం లోనికి, తిరిగి సముద్ర పటలం నుండి భూ ప్రావారానికి, సముద్ర పటలం ఒక చక్రం (Cycle) పూర్తి చేస్తుంది. కనుక ట్రెంచ్ లు సముద్ర పటలాన్ని రీసైక్లింగ్ చేస్తున్నాయి అని చెప్పవచ్చు. ఇలా ట్రెంచ్ లు రీసైక్లింగ్ చేయలేని నాడు, రిడ్జ్ ల ద్వారా భూప్రావారం నుండి మాగ్మా నిరంతరంగా పైకి రావడం, దాని వల్ల రిడ్జ్ ల వద్ద కొత్తగా సముద్ర పటలం సృష్టించబడటం మాత్రమే జరుగుతూ వుంటుంది. ఫలితంగా [[భూమి]] సైజు (size) సాపేక్షికంగా పెరిగిపోవడం జరుగుతుంది. కనుక ఆ విధంగా జరగకుండా ట్రెంచ్ లు, నిరంతరం సృష్టించబడుతున్న సముద్ర పటలాన్ని తిరిగి భూప్రావారం లోనికి నిరంతరం పంపడం ద్వారా రీసైక్లింగ్ చేస్తూ ఉన్నాయి. ఫలితంగా ట్రెంచ్ లు 460 కోట్ల సంవత్సరాలనుంచీ [[భూమి|భూగోళం]] సైజును సాపెక్షంగా పెరిగిపోకుండా వుంచగలిగాయి.
"https://te.wikipedia.org/wiki/సముద్ర_ట్రెంచ్" నుండి వెలికితీశారు