అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి''' తెలుగు కవి, బహుగ్రంథకర్త. భార్గవ రామ చరిత్రం అనే మహాకావ్యంతో పాటుగా శ్రీ భర్తృహరి నిర్వేదము, కావ్యగుచ్ఛము, విద్వద్దంపతీ విలాసము మొదలైన కావ్యాలెన్నో రాశారు. మహాకావ్యమైన భార్గవ రామ చరిత్రం గ్రంథాన్ని [[మహా భారతము|మహాభారతం]] ఉద్యోగ పర్వంలో 5 శ్లోకాల్లో క్లుప్తంగా - ప్రజాకంటకులైన హైహయులు, వారిని అనుసరించిన క్షత్రియులను[[క్షత్రియులు|క్షత్రియు]]<nowiki/>లను నిర్జించేందుకు [[బ్రాహ్మణులు]], ఇతర వర్ణాల వారు ప్రత్నించి భంగపడడం. నాయకత్వేలేమిని నివారించేందుకు ఓ నీతిశాస్త్ర, శస్త్రాస్త్ర విశారదుడైన బ్రాహ్మణ వీరుని నేతృత్వంలో సర్వక్షత్రియులను జయించడం కనిపిస్తుంది. ఆ విషయాన్నే విస్తరించి మహాకావ్యాన్ని సుబ్రహ్మణ్యశాస్త్రి నిర్మించారు.
== వ్యక్తిగత జీవితం ==
అనుముల వేంకట సుబ్రహ్మణ్యకవి 1888లో కార్తీక [[పౌర్ణమి]] నాడు [[నెల్లూరు జిల్లా]] [[పెదగోగులపల్లి]] గ్రామంలో జన్మించారు. విద్యాభ్యాసం ముగించుకుని 1909 నుంచి 1923 వరకూ [[వనపర్తి]] తాలూకాలోని [[వ్యాపర్ల]] గ్రామానికి చెందిన వామననాయక్ జాగీరులో[[జాగీరు]]<nowiki/>లో అధ్యాపకునిగా పనిచేశారు. 1923 నుంచి 1948 వరకూ [[కర్నూలు]] పురపాలకసంఘ ఉన్నత పాఠశాలలో [[తెలుగు]] పండితునిగా పనిచేశారు. 1950ల్లో [[జనగాం]] ప్రెస్లన్ విద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశారు. అధ్యాపక వృత్తిలో ఉండగానే [[ఏప్రిల్ 5]], [[1959|1959న]] మరణించారు.
 
== రచన రంగం ==
పంక్తి 7:
=== ముద్రిత గ్రంథాలు ===
ఆయన ముద్రిత కావ్యాల్లో '''భార్గవ రామ చరిత్ర''' అనే మహాకావ్యం కూడా ఉంది. హైహయులు, వారి అనుయాయులైన [[క్షత్రియులు]] ప్రజలను పీడించడంతో [[బ్రాహ్మణులు]] మొదలైన ఇతర మూడు వర్ణాల వారు ఒక్కటై వారితో పలుమార్లు పోరాడి ఓడిపోయారనీ, తమ ఓటమికి నాయకత్వలేమి కారణమని గ్రహించి నీతిశాస్త్ర విశారదుడు, శూరుడు అయిన బ్రాహ్మణ వీరుడిని ([[పరశురాముడు]]) సైన్యాధిపత్యానికి ఒప్పించి, సర్వ క్షత్రియులను జయించినట్టు మహాభారత ఉద్యోగపర్వంలోని సైన్య నిర్యాణ పర్వంలో 5 శ్లోకాల్లో సంగ్రహంగా ఉంది. దీన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఇతర పురాణాల్లో ఉన్న పరశురామ గాథలను సమన్వయం చేసుకుంటూ ఈ మహాకావ్యాన్ని నిర్మించారు సుబ్రహ్మణ్యశాస్త్రి.<br />
హరిహరోపాధ్యాయుడు సంస్కృతంలో[[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో రాసిన వేదాంత ప్రధానమైన గ్రంథాన్ని '''శ్రీ భర్తృహరి నిర్వేదము''' పేరిట ప్రబంధాన్ని రచించారు. మూలంలోని భావాన్ని వదలక, తనదైన ప్రత్యేక కావ్యంగా దీన్ని ఆయన తీర్చిదిద్దారు. ఈ కావ్యంలో భర్తృహరి తన భార్య భానుమతీదేవి మౌనముద్రకు కారణం తెలియక ఆమెను అనునయించే ఘట్టాన్ని [[పారిజాతాపహరణం]]లోని సత్యభామ అలక ఘట్టానికి సాటివచ్చేలా రచించే ప్రయత్నం చేశారు. [[సుభాషిత త్రిశతి]] రచించిన [[భర్తృహరి]] జీవితంలో అందుకు పాదులు వేసిన ఘట్టాలను, ఆయన వేదాంతి కావడం వంటివి ఈ కావ్యవస్తువు.<br />
'''కావ్యగుచ్ఛము''' అనే మరో గ్రంథంలో తారాచంద్రుల ఇతివృత్తం, అష్టావక్రుని బ్రహ్మచార దీక్షకు పరీక్షాఘట్టం వంటి పలు ఇతివృత్తాలతో నిర్మించిన చిరు కావ్యాలు గుదిగుచ్చారు. '''విద్వద్దంపతీ విలాసము''' అనే మరో కావ్యంలో విదుషీమణి ఐన కాపుకులస్త్రీ, [[బ్రాహ్మణుడు]] ప్రేమించి ఫలించక మరణిస్తారు, తర్వాత [[ఈజిప్ట్]] దేశంలో మళ్ళీ పుట్టి ప్రేమ ఫలింపజేసుకుంటారు. ఈజిప్టులో వారిద్దరి కలయికకు ఇతివృత్తాన్ని ప్రఖ్యాత [[అరేబియన్ నైట్స్]] లోని ఒక కథను తీసుకుని దాని అనుసృజనగా చేశారు. [[కాకతీయులకాకతీయులు|కాకతీయు]]<nowiki/>ల నాటి ఇతివృత్తంతో '''కుమార రుద్రదేవకవి''', '''బమ్మెర పోతన''', పౌరాణికాంశాలతో '''భారతీయ స్త్రీ ధర్మాలు''', '''శ్రీకృష్ణ చరిత్ర''' రాశారు. ఇవన్నీ వివిధ సంస్థలు ముద్రించినవి.<br />
సుబ్రహ్మణ్యశాస్త్రి రాసిన మహాకావ్యమైన భార్గవ రామచరిత్ర సహా ఏ రచనలూ జీవించివుండగా ప్రచురణకు నోచుకోలేదు. జీవించినంతకాలం ఇవి ముద్రితాలు కావాలని, పదుగురూ తన రచనలు చదవాలనీ కోరుకున్నారు. ఆయన మరణించాకా పలు సంస్థలు, వ్యక్తుల చొరవతో ఒక్కొక్కటిగా ఈ రచనలు ప్రచురితమయ్యాయి.<ref name="కర్నూలు జిల్లా రచయితల చరిత్ర">{{cite book|last1=కె.ఎన్.ఎస్.|first1=రాజు|title=కర్నూలు జిల్లా రచయితల చరిత్ర|date=3 మే 1994|publisher=కర్నూలు జిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘం|location=కర్నూలు|pages=25 - 31|edition=1|accessdate=22 November 2015|chapter=అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి}}</ref>