పెద కొత్తపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 132:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శివాలయం:- ఇక్కడి శివాలయం దక్షిణముఖంగా కలదు, అమ్మవారు తూర్పుముఖంగా ఉంటుంది.
#శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్నకేశవాలయం:- పెదకొత్తపల్లిలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంపై ఉన్న కలశానికి అతీతశక్తులున్నాయని, ఆ కలశం విలువ రూ.5 కోట్లు .అది బియ్యాన్ని కూడా ఆకర్షిస్తుంది అంతర్జాతీయ మార్కెట్‌లో అతీత శక్తులు ఉన్న దాని విలువ రూ.5 కోట్లు పైమాటే నని. దానిని తెచ్చి ఇస్తే రూ.5 లక్షలు ఇస్తామంటూ' కొందరు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మిన ఓ ముఠా గుంటూరు జిల్లా నుంచి స్కార్పియో వాహనంలో ఇక్కడికి వచ్చింది. తమను ఎవరూ అనుమానించకుండా వెంట ఓ మహిళను కూడా తీసుకొచ్చారు. తాము పావురాళ్ల వేటగాళ్లుగా నమ్మించారు. ఆలయంపై కలశాన్ని దొంగిలించేందుకు యత్నించి మద్దిపాడు పోలీసులకు పట్టుబడ్డారు. [] (ఈనాడు 29.11.2009)
# శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం:- గ్రామములో నూతనంగా ఈ అలయ నిర్మాణానికి, 2017,మార్చి-18వతేదీ శనివారంనాడు, శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామస్థులు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించి, దేవాలయ నిర్మాణానికి తీసిన పునాదిలో, బిందెలతో నీరుపోసి, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [6]
#శ్రీ సీతా,లక్ష్మణ,హనుమత్సమేత శ్రీ రామచంద్రమూర్తివారి ఆలయం:- పెదకొత్తపల్లి గ్రామములోని అంజయ్యనగర్‌లోని ఈ ఆలయంలో 2017,జూన్-8వతేదీ గురువారం ఉదయం 8-30 కి, శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి విగ్రహ ధ్వజస్థంభ, విమాన, కలశ మరియు మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించినారు. భక్తులు ధ్వజస్థంభానికి నవధాన్యాలు సమర్పించి పూజలు చేసినారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఉదయం 9 గంటల నుండి భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించినారు. ఈ కార్యక్రమాలకు స్థానికులతోపాటు పరిసరప్రాంతాలనుండి గూడా భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసినారు. [7]
"https://te.wikipedia.org/wiki/పెద_కొత్తపల్లి" నుండి వెలికితీశారు