పెద కొత్తపల్లి
పెద కొత్తపల్లి, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 211., ఎస్.టి.డి.కోడ్ = 08592.
పెద కొత్తపల్లి | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°ECoordinates: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | మద్దిపాడు మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,444 హె. (3,568 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 3,736 |
• సాంద్రత | 260/కి.మీ2 (670/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523211 ![]() |
గ్రామ భౌగోళికంసవరించు
సమీప గ్రామాలుసవరించు
ఏడుగుండ్లపాడు 5 కి.మీ, మద్దిపాడు 4 కి.మీ, లింగంగుంట 6 కి.మీ, బసవన్నపాలెం 4 కి.మీ, నందిపాడు 5 కి.మీ, ఒంగోలు 12 కి.మీ.
సమీప మండలాలుసవరించు
దక్షణాన ఒంగోలు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, తూర్పున నాగులుప్పలపాడు మండలం, పశ్చిమాన చీమకుర్తి మండలం.
గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు
Bus shelters = 2.
గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామంలో మౌలిక వసతులుసవరించు
వైద్య సౌకర్యంసవరించు
- nalluri nursing home
- venkata ramana nursing home
- Dr.subramanyeswari garu.
- Dr.harish (sp.in dental)
- medical camps and govt.nurse facility
- RMP facilities.
ఇతర సదుపాయాలుసవరించు
- micro water filters
- cement roads.
- co-operative society bhawan
- pala kendram
- kirana dhukanalu.
- tiffin centers.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు
చెరువుసవరించు
ఈ చెరువు 70 ఎకరాలలో విస్తరించియున్నది. ఇది చుట్టుప్రక్కల గ్రామాలలోని చెరువులకంటే పెద్దది. దీనిలో 40 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉంది. మిగిలిన భాగం వృధాగా ఉంది. అది గూడా ఉపయోగంలోనికి వస్తే, గ్రామానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం నాలుగు చెరువులున్నవి.
గ్రామ పంచాయతీసవరించు
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
- శివాలయం:- ఇక్కడి శివాలయం దక్షిణముఖంగా కలదు, అమ్మవారు తూర్పుముఖంగా ఉంటుంది.
- శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్నకేశవాలయం:- పెదకొత్తపల్లిలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంపై ఉన్న కలశానికి అతీతశక్తులున్నాయని, ఆ కలశం విలువ రూ.5 కోట్లు .అది బియ్యాన్ని కూడా ఆకర్షిస్తుంది అంతర్జాతీయ మార్కెట్‌లో అతీత శక్తులు ఉన్న దాని విలువ రూ.5 కోట్లు పైమాటే నని. దానిని తెచ్చి ఇస్తే రూ.5 లక్షలు ఇస్తామంటూ' కొందరు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మిన ఓ ముఠా గుంటూరు జిల్లా నుంచి స్కార్పియో వాహనంలో ఇక్కడికి వచ్చింది. తమను ఎవరూ అనుమానించకుండా వెంట ఓ మహిళను కూడా తీసుకొచ్చారు. తాము పావురాళ్ల వేటగాళ్లుగా నమ్మించారు. ఆలయంపై కలశాన్ని దొంగిలించేందుకు యత్నించి మద్దిపాడు పోలీసులకు పట్టుబడ్డారు. (ఈనాడు 29.11.2009) & [8]
- శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం:- గ్రామంలో నూతనంగా ఈ అలయ నిర్మాణానికి, 2017, మార్చి-18వతేదీ శనివారంనాడు, శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామస్థులు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించి, దేవాలయ నిర్మాణానికి తీసిన పునాదిలో, బిందెలతో నీరుపోసి, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా నిర్మాణం పూర్తి అయిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2017, జులై-1వతేదీ సోమవారం నాడు వైభవంగా నిర్వహించారు. [6]&[8]
- శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్సమేత శ్రీ రామచంద్రమూర్తివారి ఆలయం:- పెదకొత్తపల్లి గ్రామంలోని అంజయ్యనగర్‌లోని ఈ ఆలయంలో 2017, జూన్-8వతేదీ గురువారం ఉదయం 8-30 కి, శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి విగ్రహ ధ్వజస్తంభ, విమాన, కలశ, మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. భక్తులు ధ్వజస్తంభానికి నవధాన్యాలు సమర్పించి పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఉదయం 9 గంటల నుండి భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు స్థానికులతోపాటు పరిసరప్రాంతాలనుండి గూడా భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసారు. [7]
- శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం:- ఈ 21 అడుగుల విగ్రహం వద్ద, 2015, మే నెల-13వ తేదీ నుండి 23వ తేదీ వరకు, హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆఖరిరోజైన 23వతేదీ శనివారంనాడు, భజనా కర్యక్రమం ఘనంగా నిర్వహించారు. 1001 నిమ్మకాయల గజమాలను అలంకరించారు. 101 బుట్టల అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఇకనుండి, హనుమాన్ చాలీసా భజనా కార్యక్రమాన్ని, ప్రతి శనివారంనాడు, ఒక సంవత్సరం పాటు నిర్వహించెదరని గ్రామస్థులు తెలియజేసినారు. [4]
- poleramma temple.
- gangamma temple.
- poli devathalu.
- famous darga.
- chuches—5.
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
వరి, అపరాలు, కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు
నేతాజీతోపాటు యుద్ధంలో పాల్గొన్న శ్రీ కోటా వీరాస్వామి పీటర్, ఈ గ్రామస్తులే. [5]
కీ.శే. నల్లూరి రామస్వామి :- వీరు ఈ గ్రామానికి మూడుసార్లు సర్పంచిగా పనిచేసి, గ్రామానికి విశేషసేవలందించి, అందరి మన్ననలను పొందినారు. వీరు సి.పి.ఐ.లో ఎంతోకాలం పనిచేసి, పేదలకు పెన్నిధిగా ఎంతోమందిని అభివృద్ధిపథంలో నిలిపినారు. వీరి సేవలకు గుర్తుగా, గ్రామంలో వీరి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వీరి 5వ వర్ధంతిని, గ్రామంలో, 2015, మార్చి-21వ తేదీనాడు నిర్వహించారు. [3]
1.gattineni ayodhya ramaiah (ayyanna) 2.pothineni Srinivasa Rao 3.upputuri Prakasam 4.Tummala srinivasa Rao 5.Pavuluri anjaiah 6.Kaki ramarao.
గ్రామ విశేషాలుసవరించు
ఈ గ్రామంలో 60 సంవత్సరాల క్రితం, కాంగ్రెస్ నేత శ్రీ ఉప్పుటూరి ఆదిశేషయ్య నేతాజీ సుభాస్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. కాలక్రమేణా ఆ విగ్రహం శిథిలమవగా, విశ్రాంత ఉద్యోగి శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు, తన స్వంత ఖర్చుతో నూతన విగ్రహన్ని ఏర్పాటు చేసారు. అవసరమైన స్థలాన్ని శ్రీ గోనుగుంట వీరయ్య విరాళంగా అందించారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ, నేతాజీ శతజయంతి ఉత్సవాలను, నేతాజీ జన్మదినం సందర్భంగా, 2016, జనవరి-23న ఘనంగా నిర్వహించారు. [5]
గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 3,736 - పురుషుల సంఖ్య 1,828 - స్త్రీల సంఖ్య 1,908 - గృహాల సంఖ్య 1,031
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,860.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,940, మహిళల సంఖ్య 1,920, గ్రామంలో నివాస గృహాలు 924 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,444 హెక్టారులు.
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
మూలాలుసవరించు
వెలుపలి లింకులుసవరించు
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, జూలై-25; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మార్చి-22; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మే-22; 3వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, జనవరి-24; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, మార్చి-19; 1వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, జూన్-8&9; 2వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, ఆగస్టు-1; 2వపేజీ.