క్షేమేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
==అంచనా==
క్షేమేంద్రుని సాహితీ ప్రతిభ విస్తారమైన సాహిత్యాన్ని సృష్టించడంలోనే కాక విభిన్న అంశాలకు చెందిన గ్రంధాలను చక్కని నైపుణ్యంతో స్పృజించడంలో కూడా వుంది. ముఖ్యంగా బృహత్ గ్రంధాలను సంక్షిప్తపరచడంలోనూ అందులోను సరళ సులభశైలిలో వాటిని రూపొందించడంలో క్షేమేంద్రుడు చక్కని కౌశలం ప్రదర్శించాడు. రామాయణ, మహాభారత బృహత్కావ్యాలను సులభంగా చదవడానికి వీలుగా సంక్షిప్త రూపంలో 'రామాయణమంజరి', 'భారతమంజరి'లను రచించాడు. వీటన్నిటికి మించి ఆతను సంస్కృత సారస్వతానికి అందించిన అవిరళకృషి నాశనమైపోయిన మూల 'బృహత్కథ'ను పునర్జీవింపచేయడంలో వుంది. పైశాచీ భాష (పాకృత భాషకు అపభ్రంశరూపం)లో వున్న గుణాడ్యుని బృహత్కతను క్షేమేంద్రుడు సంక్షిప్త పరచి సంస్కృతంలో బృహత్కథామంజరిగా రచించాడు. పద్యరూపంలో వున్న దీనిలో 1800 చిన్న కథలున్నాయి.
 
శైవం నుంచి వైష్ణవంలోనికి మారిన కవి అయినప్పటికి, మతసఖ్యతతో బౌద్ధవిశ్వాసాల కనుగుణంగా గ్రంధ రచనలు చేసాడు. తద్వారా ఒక వైపు కవిగా, మరోవైపు రచనలలో మతపరమైన సఖ్యతను (Religious harmonizer) కోరుకొన్నవానిగా కనిపిస్తాడు.
 
==రిఫరెన్సులు==
"https://te.wikipedia.org/wiki/క్షేమేంద్రుడు" నుండి వెలికితీశారు