క్షేమేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
క్షేమేంద్రుని సాహితీ ప్రతిభ విస్తారమైన సాహిత్యాన్ని సృష్టించడంలోనే కాక విభిన్న అంశాలకు చెందిన గ్రంధాలను చక్కని నైపుణ్యంతో స్పృజించడంలో కూడా వుంది. ముఖ్యంగా బృహత్ గ్రంధాలను సంక్షిప్తపరచడంలోనూ అందులోను సరళ సులభశైలిలో వాటిని రూపొందించడంలో క్షేమేంద్రుడు చక్కని కౌశలం ప్రదర్శించాడు. రామాయణ, మహాభారత బృహత్కావ్యాలను సులభంగా చదవడానికి వీలుగా సంక్షిప్త రూపంలో 'రామాయణమంజరి', 'భారతమంజరి'లను రచించాడు. వీటన్నిటికి మించి ఆతను సంస్కృత సారస్వతానికి అందించిన అవిరళకృషి నాశనమైపోయిన మూల 'బృహత్కథ'ను పునర్జీవింపచేయడంలో వుంది. పైశాచీ భాష (పాకృత భాషకు అపభ్రంశరూపం)లో వున్న గుణాడ్యుని బృహత్కతను క్షేమేంద్రుడు సంక్షిప్త పరచి సంస్కృతంలో బృహత్కథామంజరిగా రచించాడు. పద్యరూపంలో వున్న దీనిలో 7500 శ్లోకాలున్నాయి.<ref name="ముదిగంటి"/>
 
శైవం నుంచి వైష్ణవంలోనికి మారిన కవి అయినప్పటికి, మతసఖ్యతతో బౌద్ధవిశ్వాసాల కనుగుణంగా గ్రంధ రచనలు చేసాడు. తద్వారా ఒక వైపు కవిగా, మరోవైపు రచనలలో మతపరమైన సఖ్యతను (Religious harmonizer) కోరుకొన్నవానిగా కనిపిస్తాడు.

క్షేమేంద్రుని జీవించివున్న కాలం నాటికి కాశ్మీర్‌లో రాజకీయంగా తీవ్రమైన అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి. సంఘంలోనూ, ప్రజలలోను ఎటుచూసినా అవినీతి, నీటినీతి బాహ్యత పెచ్చుపెరిగాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకోసం సందేశాత్మకమైన నీతికథలను రచించాడు. వీటన్నింటికీ మించి సంఘంలో వున్న కుళ్ళును ఎండగడుతూ, వ్యక్తులలోను వున్న అంతర్గత బలహీనతలను ఎత్తిచూపుతూ చక్కని హాస్యంతో వ్యంగ్య రచనలు చేసాడు. తన 'కళావిలాస'లో మనుష్యులలో వున్న అంతర్గత బలహీనతలను స్వలాభానికి వాడుకొనే విధానాలను వ్యంగ్యాత్మకంగా చిత్రిస్తాడు. ఒక వేశ్య, ఉద్యోగి, కమ్మరి, ఇలా సమాజంలోని దాదాపు అన్ని వర్గాలను వారి మాటలను, చేతలను అంతర్‌దృష్టితో వివరిస్తాడు. ఇతని మరో వ్యంగ్య రచన 'నర్మమాల'లో ప్రజలను పీల్చిపిప్పిచేస్తున్న ఆనాటి ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని శక్తివంతంగా చీల్చి చెందాడటంచెండాడటం కనిపిస్తుంది. నాటి పాలనలో కొలువు తీరిన ఉద్యోగులు ప్రధానంగా కాయస్థ కులాలవారే. అవినీతికి పరాకాష్టగా వున్న లంచగొండి ఉద్యోగులను ప్రజల రక్తం పీల్చి బతికేవారుగా, కుళ్ళిన సర్పంపై ముసిరే ఈగలుగా వర్ణిస్తాడు. సమాజంలో కుళ్ళును పెంచుతున్న కాయస్థకులాల పాత్రపై క్షేమేంద్రుని వ్యాఖ్యలు తరువాత కాలంలోని సుప్రసిద్ధ కాశ్మీరీ చరిత్రకారుడు కల్హణుని దృష్టిని కూడా ఆకర్షించాయి.
 
==రిఫరెన్సులు==
"https://te.wikipedia.org/wiki/క్షేమేంద్రుడు" నుండి వెలికితీశారు