నాగార్జునసాగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 169:
==[[అనుపు]]==
 
బౌధ్ధ మతాచార్యుడు [[ఆచార్య నాగార్జునుడు]] క్రీస్తు శకము నాలుగవ శతాబ్దంలో ఇచ్చటకు వచ్చి ఒక విశ్వ విద్యాలయాన్ని నిర్మించాడు. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్య నబ్యసించారని చారిత్రికాదారాలున్నాయి. సాగర గర్బంలో వుండిన ఆనాటి విశ్వ విద్యాలయ శిథిలాలను యదా తదంగా తరలించి నాగార్జున కొండ పైన మ్యూజియంలోను, ఆరుబటయ కూడా భద్ర పరచి సందర్శకులు చూడ డానికి ఏర్పాటు చేశారు. '' అనుపు '' అనే ప్రాంతం సాగర్ ముంపునకు గురికాలేదు. కనుక అక్కడ వున్న ఆనాటి కట్టడాలు ఎక్కడ వున్నవి అక్కడనే భద్రపరచి జాగ్రత్త తీసుకుంటున్నారు భారత పురావస్తు శాఖ వారు. ఈ విషమై పరిశోధన చేసే వారికిది అమూల్యమైన ప్రదేశము: ''అనుపు '' నాగార్జున సాగర్ ఆనకట్టకు దక్షిణం వైపున సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి రవాణా సౌకర్యం అంతగా లేదు. వాహనాలలో వచ్చే వారికి రోడ్డు మార్గమున్నది. అనుపు నుండి కూడా నాగార్జున కొండ వరకు లాంచీలను అప్పుడప్పుడు నడుపుతారు. అనుపులోని ఆనాటి కట్టడాలను ఈ క్రింద చూడ వచ్చును.
 
==జలవిద్యుత్తు==
ఇక్కడ నిర్మించిన జలవిద్యుత్తు కేంద్రం 8 యూనిట్లతో... 815.6 మెగా వాట్ల విద్యుత్తు తయారుకాగల శక్తి గలది. అందులో మొదటి యూనిట్ 1978 మార్చి 7 లో ప్రారంభమైనది. 8 వ యూనిట్ 24 డిశెంబరు 1985 న ప్రారంభమైనది. నాగార్జున సాగర్ కుడికాలువ పై నిర్మించిన జలవిద్యుతు కేంద్రం 90 మెగా వాట్ల సామర్థమున్నది. ఎడమ కాలువ జల విద్యుత్తు కేంద్రం 60 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యము కలిగి యున్నది.
"https://te.wikipedia.org/wiki/నాగార్జునసాగర్" నుండి వెలికితీశారు