సింధు లిపి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:సింధు లోయ నాగరికత చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
సింధూ --> సింధు |
||
పంక్తి 1:
'''
ఈ చిహ్నాలను 1875 వ సంవత్సరంలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే పురాతత్వ శాస్త్రవేత్త మొట్టమొదటి సారిగా ఒక బొమ్మ రూపంలో ప్రచురించాడు. <ref>{{cite journal|last1=Cunningham|first1=Alexander|title=Harappa|journal=Archaeological Survey of India: Report for the Years 1872-3|date=1875|volume=5|pages=105–108}}</ref> అప్పటి నుండి ఈ చిహ్నాలు ముద్రితమై ఉన్న వస్తువులు 4,000 వరకు దొరికాయి. వీటిలో కొన్ని ఎక్కడో సుదూర ప్రాంతమైన [[మెసొపొటేమియా నాగరికత|మెసొపొటేమియా]] లో కూడా దొరికాయి. 1970 వ దశకం ప్రారంభంలో [[ఐరావతం మహదేవన్]] అనే శాస్త్రజ్ఞుడు సుమారు 3,700 ముద్రలకు సంబంధించిన పాఠ్యాన్ని ప్రచురించాడు. అందులో 417 వేర్వేరు గుర్తులు, వివిధ రకాలైన నమూనాలలో అమర్చబడి ఉన్నాయి. ఒక్కో శాసనానికి సగటున ఐదు చిహ్నాలున్నాయి. అత్యంత పొడవైన దానిపై కేవలం 17 చిహ్నాలు మాత్రమే ఉన్నాయి. ఈ లిపి కుడి వైపు నుండి ఎడమ వైపుకు రాయబడుతుందని ఆయనే కనుగొన్నాడు. <ref name="natureindia2009">{{cite web|url=http://www.nature.com/nindia/2009/090531/full/nindia.2009.147.html|title=Write signs for Indus script?|date=2009-05-31|publisher=Nature India|accessdate=2009-06-01}}</ref>
|