నాట్య శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఇప్పుదు → ఇప్పుడు , భేధా → భేదా, బేధా → భేదా, సార్ధక → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
== ముఖ్య విషయము ==
నాట్యానికి అనేక ప్రయోజనాలున్నవి. అవ్వంతరప్రయోజనాలెన్ని ఉన్నప్పటికీ మహారసమే నాట్యముఖ్యప్రయోజనం. మనోరసానికి అనుకూలమైన ప్రవనత ఎక్కడ సంపాదించగలిగితే అక్కడే ఆస్వాదం కలుగుతుంది. మనోవృత్తిలో విజృంభించితే స్పందశక్తులను నిరోధించి సమానావస్థను సంపాదించినతరువాతనే సాధకుడు ఆస్వాదభూమికను అందుకోగలుగుతాడు. నాట్యం వలన చక్షురాదీంద్రియాలు ఏయే విధంగా ఉన్నప్పటికీ భవనా చక్షువు, భవనా శ్రోత్రము, భవనేంద్రియము స్వస్వవ్యాపారంలో బగా మగ్నత పొంది ఉంటవి.అందువలన మనో భూమికూడా భావనకు మహాసాగరం అవుతుంది. దీని వలన ప్రపంచభేదం సులభము. దీని వలన ఆత్మ ప్రకాశము చెందును. ఈ మహాప్రకాశావస్థనే మహారసమంటారు. ఇటువంటి మహారస సంపత్తిని నాట్యం అందజేయగలుగుతుందని ఈ శాస్త్రము తెలుపుచున్నది. ఈమహారస సంపదే ఆత్మసంవేదనము. ఆత్మసంవేదనము నాట్యం చూచే ప్రతీవానికి కలుగదు. విశిష్టమైన అర్హత ఇక్కడకూడా అవసరము. అవాంతరంగా అర్హతాసంపత్తిని కూడా నాట్యమే సంపాదించుతుంది. ధార్మిక శిక్ష నివ్వటానికి మునులు నాట్యమును అవతరింపజేసారని ఆనందవర్ధనుడు చెప్పినాడు.
 
==ఇతర నాట్యశాస్త్ర గ్రంధములు==
 
భరతుని మతమును తు, చ తప్పకుండా అనుసరించినవాడు దత్తిలుడు. దత్తిల గ్రంధమునకు ప్రయోగస్తబక మను వ్యాఖ్యానము కలదు.కోహలుడు నాట్యశాస్త్రము లోని విషయములను పెంచి, ప్రస్తార తంత్రమును చెప్పినట్లుగా నాట్యశాస్త్రముననే కలదు.ఇతడు రచించిన అభినయశాస్త్రములోని తాళాధ్యయమే నేడు లభించుచున్నది.కోహలుడు, దత్తిలునకు చెప్పినట్లున్న దత్తిల కోహలీయము, మతంగునకు చెప్పిన కోహల రహస్యము నేడుగూడా కలవని వినికిడి, కోహలుడు తన ప్రధానగ్రంధమును శార్దూలునకు చెప్పినట్లు కల్లినాధుని సంగీత రత్నాకరవ్యాఖ్యలలో కనిపించుచున్నది.
 
మతంగుని బృహదేశ ఆరు అధ్యాయముల వరకే లభించుచున్నది.దీనిలో శ్రుతులు, స్వరములు మాత్రమే వివరించబడినవి.మూర్చనలో 12 స్వరములు భరతునిలో లేనివి ఇటగలవు.నందికేశ్వరుని మతము భరతునికన్నా భిన్నమైనట్లు అభినవుడు, కల్లినాధుడు ఎంచినారు.
 
నాట్య, సంగీతశాస్త్ర ప్రవక్తులుగా మాధవ గణేశ,షణ్ముఖ, వాయు, దుర్గలు గలరని మతంగుడు పల్కినాడు.కామదేవుని నృత్యలక్షణము తాలలక్షణమున కలదు.సింగభూపుని సంగీత రత్నాకర వ్యాఖ్యలో దక్ష ప్రజాపతి కారిక కనిపించుచున్నది.ప్రశాంత నాటకమున సాత్వతీ వృత్తి కలదని ద్రౌహిణుడు అనినాడు. ధేనుకుని తాళాధ్యాయము కుట్టినీ మతమున స్మరించబడినది.కంబళ, అశ్వతరులను నాగులు సరస్వతీ ప్రసాదవశమున నాదవిద్యను గ్రహించిరని దామోదరుని సంగీతదర్పణమున కలదు. ఇంద్రధ్వజోత్సవమున ప్రదర్సించిన నాటకములో భాండవాద్యమునౌ స్వతి వాయించెనని భరతుడనినాడు. దీనిపై వ్యాఖ్యానించుచు స్వాతి కనుగొనిన పుష్కరవాద్యమును అభినవుడు వివరించెను.
 
సంగీతాచార్యులలో కశ్యపుడు కలడని అభినవుడు లేదా [[అభినవ గుప్తుడు]] అభినవ భారతి లో చెప్పుచు, రసభావ వినియోగములకు అనుగుణమైన రాగములను తెలుపు కశ్యపపంక్తులనిచ్చినాడు.కావ్యాదర్శ వ్యాఖ్యయగు హృదయంగమములో కశ్యపుడు, వరరుచి లక్షణశాస్త్రములను చెప్పిరని కలదు.
 
నారదీయశిక్ష అను నారదుని సంగీతశాస్త్ర మొకటి కలదు. భరతుడు సామస్వరమున నారదుని భావముల ఉదహరించినాదు.అభినవుడు అనేకస్థలముల నారదుని గ్రంధమును ప్రస్తుతించెను. నారదశిక్షలొ చెప్పబడిన గాంధారగ్రామము మానవస్వరమునకు అందనిదగుటచేత భరతుడు దీనిని వదెలెనట.రాగనిరూపణము అను గ్రంధమున నారదుడు క్ష్140 రాగములను నారదుడు వివరించినాడు.పంచమసారస్ంహిత మరియుక నారద గ్రంధము.మూడు అధ్యాయములలో నున్న దత్తిల నారద సంవాదమున రాగములు, శ్రుతులు, స్వరములు వివరించబడినవి.నారదుని సంగీతమకరందమున నాలుగు అధ్యాయమునకు భాష్యము రచించెను.దీనినే భరతవార్తికము అని, సరస్వతీ హృదయభూషణమని, సరస్వతీ హృదయాలంకారము అని అందురు.ఇది 17 అధ్యాయముల గ్రంధము.
 
శారంగదేవుడు సంగీతరత్నాకరము (క్రీ.శ.1170) జగదేకమల్ల చాళుక్య చక్రవర్తి (1138-1150) రచించిన సంగీతచూడామని భూలోకమల్ల సోమేశ్వరుడు (1116-1127) మానసోల్లాసము మొదలైనవి సంగీత శాస్త్ర వివేచన పలు ఉపయోగకర గ్రంధములు.
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నాట్య_శాస్త్రం" నుండి వెలికితీశారు