ద్రుపదుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Raja Drupada Begs Shiva to Grant him a Boon.jpg|thumb|శివుని వరమడుగుతున్న ద్రుపద మహారాజు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం]]
'''[[ద్రుపదుడు]]''' [[పాంచాల]] దేశానికి రాజు. ఇతనికి '''యజ్ఞసేనుడు''' అని కూడా పేరు.
 
విద్యాభ్యాస సమయంలో [[ద్రోణుడు]] అతడికి సహాధ్యాయి, మంచి మిత్రుడు. తమ మైత్రిని పురస్కరించుకుని, తన సకల సంపదలను పంచుకుంటాను అని ద్రోణునికి మాట ఇచ్చాడు. ద్రుపదుడు రాజ్యాధికారానికి వచ్చాక [[ద్రోణాచార్యుడు|ద్రోణుడు]] అతనిని కలసి, చిన్నప్పుడు ఇచ్చిన మాట గుర్తు చేసి సహాయం చేయమన్నాడు. ద్రుపదుడు అతడిని గుర్తించనట్లుగా నటించి, అవమానించి పంపివేసాడు. ఆ సంఘటనతో [[ద్రోణుడు]] ద్రుపదునిపై కోపం వహించి ఉన్నాడు. తరువాత ద్రోణుడు [[హస్తినాపురం]] సందర్శించి [[కౌరవులు|కౌరవ]] [[పాండవులు|పాండవులకు]] గురువుగా నియమితుడయ్యాడు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత [[గురుదక్షిణ]]గా ద్రుపదుని బంధించి తెమ్మని తన శిష్యులను అడిగాడు. [[అర్జునుడు]] ద్రుపదుని బంధించి తెచ్చి ద్రోణునికి సమర్పించాడు. ద్రోణుడు అతడిని అవమానించి, రాజసభలో ద్రుపదుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
 
భీష్ముని చేతిలో భంగపడిన [[అంబ]], [[శిఖండి]]గా ద్రుపదునికి జన్మించింది. ద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు యాగం చేసాడు. ఆ యాగ ఫలంగా [[ద్రౌపది]], [[దృష్టద్యుమ్నుడు|దృష్టద్యుమ్నులను]] సంతానంగా పొందాడు.
 
[[కురుక్షేత్ర సంగ్రామం]]లో ద్రోణుడు ద్రుపదుని చంపాడు. ఆ యుద్ధంలోనే[[యుద్ధం]]<nowiki/>లోనే దృష్టద్యుమ్నుడు ద్రోణుని వధించాడు.
 
==చూడండి==
"https://te.wikipedia.org/wiki/ద్రుపదుడు" నుండి వెలికితీశారు