వేంగి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వేంగి చాళుక్యులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృవ → ధ్రువ, ) → ) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 68:
{{main|ఇక్ష్వాకులు}}
శాతవాహనుల అనంతరం ఇక్ష్వాకులు క్రీ.శ.225 నుండి 300 వరకు, కృష్ణానది ముఖద్వారానికి ఇరువైపుల ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించి రాజ్యమేలారు. వీరి రాజధాని అయిన విజయపురి శ్రీపర్వత ప్రాంతం యొక్క పశ్చిమపాదంలో ఉన్నదని చెప్పబడింది. వీరిలో శ్రీఛాంతమూలుడు (225-245) పెద్ద రాజ్యాన్ని ఏర్పరచాడు. నేటి ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు, నల్లగొండ, గోదావరి జిల్లాలు అతని రాజ్యంలో ఉండేవి. కనుక వేంగి వారి రాజ్యంలో ఒక నగరమై ఉండాలి. ఇక్ష్వాకుల చివరిరాజు రుద్రపురుషదత్తుడు. ఇక్ష్వాకులను జయంచి పల్లవ రాజు సింహవర్మ విజ్యపురిని నాశనం చేసి, గుంటూరు ప్రాంతంలో పల్లవరాజ్యాన్ని క్రీ.శ.300లో స్థాపించాడు.ఇక్ష్వాకుల [[సామ్రాజ్యం]] పతనమయ్యేనాటికి విజయవేంగిపురం ఒక పెద్ద నగరం. కాని అప్పటికి పల్లవుల రాజ్యం కృష్ణానదీ దక్షీణ తీరంలోనే ఉండడం వలన వేంగి రాజ్యం వారి క్రిందికి రాలేదు.
 
== బృహత్పలాయనులు ==
{{main|బృహత్పలాయనులు}}
పల్లవుల అధికారం కృష్ణానదీ తీరం దక్షిణ భాగానికే పరిమితమైన కాలంలో కృష్ణానది ఉత్తర తీరంలో కొద్దికాలం మాత్రమే బృహత్పలాయనుల అధికారం సాగింది. కనుక వేంగి ప్రాంతం వారి అధీనంలో ఉండి ఉండాలి. కాని వీరి గురించిన ఆధారాలు చాలా తక్కువ. ఒకే ఒక కొండముది తామ్రశాసనం ఆధారంగా వీరు 300 ముండి 325 వరకు రాజ్యం చేసినట్లు భావిస్తున్నారు. వీరి రాజధాని కోడూరు కావచ్చును.
 
ఇక్ష్వాకుల సామంతులైన బృహత్పలాయనులు కృష్ణానది [[ఉత్తర]] తీరంలో స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. వీరి వంశచరిత్రను తెలిపే ఒకే ఒక శాసనం కొండముది తామ్ర (రాగి) శాసనం. గుంటూరు జిల్లాలోని తెనాలి దగ్గరలో ఉన్న గ్రామమే ‘కొండముది’. ఈ శాసనాన్ని బృహత్పలాయన రాజు జయవర్మ వేయించాడు. ఇందులో జయవర్మ పూర్వీకుల గురించి ప్రస్తావన లేదు. ఐతే ఇతడు బృహత్పలాయన గోత్రీకుడని ఈ శాసనం తెలియజేస్తోంది.
 
జయవర్మ తన పదో రాజ్య పాలనా కాలంలో కూదూర హారంలోని ‘పాంతూర గ్రామాన్ని’ 8 మంది బ్రాహ్మణులకు బ్రహ్మధేయంగా దానమిచ్చాడు. ఇతని ఇష్టదైవం మహేశ్వరుడు. కొండముది శాసనం ప్రకారం ‘కూదూరు’ (గూడూరు) రాజధానిగా కృష్ణానది ఉత్తర తీరాన్ని పాలించినట్లు తెలుస్తోంది. జయవర్మ పల్లవుల చేతిలో ఓడిపోయాడు. పల్లవ శివస్కంధవర్మ దక్షిణదేశ రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్న సమయంలో జయవర్మ నాటి ‘కర్మరాష్ర్టం’ (కమ్మ రాష్ర్టం) లోని కొంత భాగాన్ని ఆక్రమించి ఉండొచ్చని బి.ఎస్.ఎల్. హనుమంతరావు అభిప్రాయం.<ref>[http://appscgroup1n2.blogspot.in/2013/06/blog-post_8.html ఎ.పి.పి.యస్.సి.గ్రూప్స్ బ్లాగు నుండి]</ref>
 
== శాలంకాయనులు ==
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు