ముదిగొండ లింగమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
| weight =
}}
'''[[ముదిగొండ లింగమూర్తి]]''' [[తెనాలి]] ప్రాంత్రం నుండి వచ్చిన పాత తరానికి చెందిన నటుడు. [[హాస్యము|హాస్యం]], క్రౌర్యం, [[శోకం]] లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు. ప్రతి విషయాన్నీ తర్కం, స్వభావం, శాస్త్రాలతో రంగరించి, విపులీకరించే లింగమూర్తిగారు చివరి దశలో సన్యాసాశ్రమం తీసుకున్నారు.
 
==కుటుంబం==
లింగమూర్తి పూర్వీకులు కాశ్మీర శైవులు. వీరి చరిత్ర కల్హణుని రాజతరంగిణి (12వ వతాబ్దం) అనే సంస్కృత గ్రంథంలో కన్పడుతుంది. ఉద్భటారాధ్యుడు జయాపీడుడు అనే రాజుకు గురువు. అతని వంశస్థులు [[వారణాసి]] వచ్చారు. వారి [[వారసుడు]] 12వ శతాబ్దంలో కాకతీయ ప్రభువైన మహాదేవుని[[మహాదేవుడు|మహాదేవు]]<nowiki/>ని పిలుపుపై [[ఓరుగల్లు]] వచ్చాడు. వారికి నల్గొండ జిల్లాలోని [[ముదిగొండ]] గ్రామం అగ్రహారంగా ఇచ్చారు. 1310 మాలిక్‌ కాఫిర్‌ దండయాత్ర తర్వాత ఈ కుటుంబాలవారు కృష్ణా తీరానికి వలస వెళ్లారు. లింగమూర్తి [[పూర్వీకులు]] గొప్ప మంత్రసిద్ధులు. బాల్యం నుండే నటనపై ఆసక్తి గల లింగమూర్తి [[మద్రాసు]]వెళ్లి తన ప్రతిభను ప్రదర్శించి చిత్రసీమలో స్థిరపడ్డాడు. లింగమూర్తి సంతానం చంద్రశేఖర్‌, త్యాగరాజు ప్రభృతులు బ్యాంకు ఉద్యోగాలు చేసుకుంటున్నా నాటకరంగానికి సేవ చేస్తున్నారు<ref>[http://andhraprabhaonline.com/memories/article-89712 నట యోగులు - రస సిద్ధులు] - ఆంధ్రప్రభ మార్చి18, 2010</ref>
 
==సినిమా రంగం==
నాటకరంగం మీద అన్ని రకాల పాత్రలూ ధరించి, పేరుతెచ్చుకుని, సినిమా రంగంలో ప్రవేశించారు లింగమూర్తి. [[తుకారామ్‌]] (1937) లో నటించినా [[వందేమాతరం]] (1939) తో అందరికీ తెలిసారాయన. రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రాక, సాంఘిక నాటకాల్లో నటించినట్టుగానే, తెరమీద కూడా నటించారు. [[బి.ఎన్‌.రెడ్డి]] దర్శకత్వంలో [[వాహినీ ప్రొడక్షన్స్|వాహిని]] సంస్థ నిర్మించిన తొలి చిత్రం [[వందేమాతరం]] - వాహిని బృందంతో లింగమూర్తినీ కలిపింది. ఆయనా, ఆ యూనిట్‌లో ఒకరైనారు. వేషం వున్నా లేకపోయినా, నిర్మాణవ్యవహారాల్లో పాలుపంచుకునేవారు. కొంతకాలం అధికారికంగా ప్రొడక్షన్‌ మేనేజరుగా వ్యవహరించారు.
 
క్రూరపాత్ర ధరించినా, అక్రూరపాత్ర ధరించినా, హాస్యపాత్ర ధరించినా నటనలో దేనికదే భిన్నంగా వుండేది. వివిధ భూమికానిర్వహణ సమర్థుడు అనిపించుకున్నాడు లింగమూర్తి. తమిళ చిత్రం ఆధారంగా నిర్మించిన [[ఆడజన్మ]]లో అతిగా నటించారన్న పేరు తెచ్చుకున్నారు. తరువాత అది పాత్ర మరియు పరిస్థితి కారణంగా అలా చేశానని చెప్పుకొన్నారు
పంక్తి 62:
 
==వ్యక్తిత్వం==
లింగమూర్తికి పాత్ర, దర్శకుడు, పారితోషికం అన్నీ నచ్చితేనే [[సినిమాలు]] ఒప్పుకొనే వారు. దీని కారణంగా ఆయన ఎక్కువ చిత్రాల్లో నటించలేదు. అన్ని విషయాల్లోనూ కచ్చితమైన మనిషి. ముక్కుకి సూటిగా పోయే మనస్తత్వం, రాజీపడని మనస్తత్వం. మొహమాటం వుండేది కాదు. ఏదైనా కుండ పగలగొట్టినట్టు చెప్పేవాడు. సభల్లో మాట్లాడినప్పుడు కూడా నిర్మొహమాటంగా, బల్లగుద్ది మాట్లాడేవారు. లింగమూర్తిగారు మాట్లాడతారంటే, ప్రేక్షకుల్లో చిన్న కలకలం లేచేది - ఎవర్నో గట్టిగా దుయ్యబడతారని.
 
==ఇతర విశేషాలు==
నిజానికి దర్శకుడు చెప్పింది వేదం. అతను చెప్పింది చెయ్యాలి. కాని మనం కూడా ‘కన్విన్స్‌’ కావాలిగదా! గుడ్డిగా వెళ్లడం నాకు చేతకాదు. అది డిసిప్లిన్‌కి విరుద్ధయమైతే నేనేం చెయ్యలేను. ఒకసారి [[బి.ఎన్‌.రెడ్డి]]తోనే వచ్చింది. ‘[[స్వర్గసీమ]]’లో నేను [[భానుమతి]] తండ్రిని. పల్లెటూరివాడిని. హాస్యంపాలు కూడా వున్న పాత్ర అది. హీరోని వల్లో వేసుకోవాలని కూతురితో చెప్పే సన్నివేశం వుంది. ‘ఎన్నాళ్లని ఈ బిగువు? వాడేం దయ్యమా, రాక్షసుడా? దగ్గరకెళ్లి అంతా సరిచేసుకో’ అని డైలాగు. అందులో నాకు చమత్కారం కనిపించలేదు. ఆ మాటే బి.ఎన్‌.తో అంటే కస్సుమని లేచాడాయన. ‘చమత్కారం ఏం చేస్తావో చేసి చూపించు!’ అని కోపంగా అన్నాడు. ‘నేను చెప్తాను బాగుంటే వుంచండి - లేకపోతే ఉన్నదే చెప్తాను’ అన్నాను. ‘చెప్పు’ అన్నట్టు మొహం పెట్టారు [[డైరెక్టరు]] ధుమధుమలాడుతూనే. ‘వాడేం పులా, సింగమా?’ అని ‘వూ’ అని చమత్కారంగా అన్నాను. ‘వూ’ అనడంలో ఒక చమత్కారం వచ్చింది. డైరెక్టరూ, రైటరూ సరే అన్నారు. సినిమాలో ఆ మార్పు బాగానే పట్టుకుంది జన్నాని‘ అని ఒక సందర్భంలో చెప్పారు లింగమూర్తి. ’అందుకే కొందరు దర్శకులూ, నిర్మాతలూ నా జోలికిరారు. పోనీ! అనేవారాయన.
 
[[నర్తనశాల]] (1963) లో [[శకుని]] వేషానికి లింగమూర్తిని అడిగారు. ‘అప్పుడు నాకు వేషాలులేవు. ఖాళీగానే వున్నాను. అంచేత డబ్బు తగ్గించమన్నారు. నేను తగ్గించనన్నాను. ’నాకు సినిమాలు తగ్గవచ్చు కాని, నా టాలెంట్‌ తగ్గలేదు. మీరిచ్చే డబ్బు నా టాలెంట్‌కి!‘ అని చెప్పేశాను’ అని చెప్పారొకసారి.
 
‘పాండవవనవాసం’లో రంగారావు [[ధుర్యోధనుడు]]. లింగమూర్తి [[శకుని]]. ‘ఈ సీనులో రంగణ్ని జయిస్తాను చూడు!’ అని లింగమూర్తి అంటే ‘రమ్మను, నా శక్తి నేనూ చూపిస్తాను’ అని రంగారావు అనేవారు. ‘అలాంటి ఆరోగ్యకరమైన పోటీలు వుండేవి. [[నాటకరంగం]] మీదా అంతే!’ అన్నారు లింగమూర్తి.
 
‘టాకీషాట్స్‌లో సైలెంట్‌ రియాక్షన్స్‌ ఇవ్వడంలో లింగమూర్తి గట్టివాడు’ అని కె.వి. రెడ్డి పొగిడేవారు. దానికి ఉదాహరణ: ‘[[యోగివేమన]]’ చివరి దృశ్యంలో వేమన చివరిసారిగా అభిరాముడిని (లింగమూర్తి) హత్తుకుంటాడు. ఆ షాటులో లింగమూర్తి వీపు మాత్రమే కెమెరా వైపు వుంటుంది. కనిపించేది నాగయ్యే. ‘వేమన కావలించుకోగానే, ఒళ్లు పులకరించినట్టు, జలదరించినట్టు లింగమూర్తి వీపుతోనే ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. గ్రేట్‌!’ అని అభినందించారు [[కె.వి.రెడ్]]డి ఒక సందర్భంలో.