జయదేవ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
==కార్టూన్లతో సంఘ సేవ==
[[ఫైలు:NO SMOKING_WKIPEDIA_JAYADEV.jpg|200Px|right|thumb|'''పొగతాగటం అనారోగ్య హేతువు అని చక్కగా చెపుతున్న నిశ్శబ్ద వ్యంగ్య చిత్రం''']]
పొగ తాగటం వల్ల వచ్చే దుష్పరిణామాలు, నలుగురూ ఉన్నచోట ధూమపానం వల్ల జరెగే అసౌకర్యం, ఇతరులకు అనారోగ్య హేతువు కావటం వంటి విషయాలమీద అవగాహన 1970లలోనే[[1970]]లలోనే వచ్చింది. కాని, బహిరంగ ప్రదేశాలలో పొగతాగటాన్ని నిషేధించటానికి అప్పటినుండి, మూడు దశాభ్దాల పైన పట్టింది. [[1960]]-[[1970]] దశకాలలో మధ్యాహ్నం సమయంలో వేసే ఆటలకు (అప్పట్లో సౌకర్యవంతమైన చల్లని వాతావరణం కలిగివుండే హాళ్ళు లేవు, మొదటి ఆటకు బయట వెలుగు ఉండదు కనుక తలుపులు మొత్తం తీసేవారు)సినిమాకు వెళ్ళితే, పొగ మేఘాల మధ్య చూడవలసి వచ్చేది. పొగరాయుళ్ళు అంతగా తమ అలవాటును యధేచ్ఛగా అన్ని చోట్లా కొనసాగించేవారు. ఇది గమనించి బాధపడిన జయదేవ్, తన కార్టూన్లను మాధ్యమంగా వాడుకుంటూ, ధూమపానం వల్ల వచ్చే దుష్పరిణామాలను ప్రజలకు హాస్యంతో జతపరిచి చెప్పసాగారు. అంతేకాక, తాను స్వతహాగా ఆచార్యుడవటం వల్ల, తాను పాఠం మొదలు పెట్టటానికి ముందు విద్యార్థులకు పొగ తాగవద్దని హితవు పలికేవారు. వీరి మాటలు సరైన సమయంలో, సరైన విధంగా ఆ విద్యార్థుల మనస్సులమీద పనిచేసి అనేకమందిని ఆ చెడ్డ అలవాటు బారిన పడకుండా చేసింది. వీరు వేసిన కార్టూన్ (పక్కన కనబడుతున్న కార్టూన్) సకల ప్రజాదరణ పొందటమే కాకుండా, భారత కాన్సర్ సంఘం వారు, తమ ధూమపాన వ్యతిరేక ఉద్యమ ప్రచారంలో కూడా వాడుకుంటున్నారట. భారత వాణిజ్య ప్రదర్శన సంస్థ వారు జయదేవ్‌ను ఢిల్లీకి ఆహ్వానించి సత్కరించారు.
 
==ప్రముఖుల అభిప్రాయాలు==
"https://te.wikipedia.org/wiki/జయదేవ్" నుండి వెలికితీశారు