హిరోషిమా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: జపాన్ కు చెందిన చారిత్రక పట్టణం '''హీరోషిమా''' (Hiroshima). ఇది జపాన్ యొ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[జపాన్]] కు చెందిన చారిత్రక పట్టణం '''హీరోషిమా''' (Hiroshima). ఇది జపాన్ యొక్క పెద్ద ద్వీపమైన [[హోంషు]]లో ఉంది. [[రెండో ప్రపంచ యుద్ధం]] చివరిలో [[1945]], [[ఆగస్ట్ 6]]న [[అమెరికా]] [[అణుబాంబు]]కు గురై నగరం భస్మీపటలమైంది. అణుబాంబుకు గురైన తొలి నగరం కూడా ఇదే.
 
హీరోషిమా నగరాన్ని [[1589]]లో మోరి టెరిమోటో స్థాపించాడు. ఆ తర్వాత యుద్ధాల వల్ల ఎందరో రాజుల చేతులు మారింది. బలమైన ఆర్థిక వ్యవస్థను కల్గి [[1905]]లో జర్గిన జపాన్-[[రష్యా]] యుద్ధంలో సహకరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో చుగోకు ప్రాంత సైన్యపు ప్రధానస్థావరం హీరోషిమానే. సైన్యానికి సరఫరా చేసే అనేక డిపోలు కూడా ఈ నగరంలో ఉండేవి. కాబట్టి ఈ నగరాన్ని ధ్వంసంచేయాలని అమెరికా నిర్ణయించి 1945, ఆగస్ట్ 6 న బి-29 అనే బాంబర్ విమానం ద్వారా అనొలాగే (Enola Gay) అణుబాంబును ఉదయం గం.8.15 ని.లకు జారవిడిచింది. అణుబాంబు దాడికి గురైన తొలి నగరంగా శాశ్వతంగా ఈ నగరం చరిత్రలో నిల్చిపోయింది.
"https://te.wikipedia.org/wiki/హిరోషిమా" నుండి వెలికితీశారు