సమాచార హక్కు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ప్రభుత్వము|ప్రభుత్వ]] కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే '''[[సమాచార హక్కు]]''' (Right to Information). మనం ఏ [[ఆఫీసు|ఆఫీస్]] లో కాలిడినా కావలిసిన సమాచారం పొందుట దుర్లభం. లంచం ఇచ్చుకోనిదే ఫైలు కదలదు. సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం చాలా కష్టం.ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం [[12 అక్టోబర్]] [[2005]] తేదీన ఈ '''సమాచార హక్కు చట్టం''' (Right to Information Act) * <ref>[http://www.persmin.nic.in/RTI/welcomeRTI.htm సమాచారహక్కు ప్రభుత్వవెబ్ సైట్]</ref> భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు [[పార్లమెంటు]], లేక [[విధాన సభ]] లేక [[విధాన పరిషత్]] సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ [[చట్టం]] ద్వారా ప్రజలందరికి కలిగింది,. ప్రభుత్వ [[అధికారులు]] అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 16 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి.
 
== సమాచారం ==
పంక్తి 10:
*'ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలు
 
ఏ ప్రభుత్వ యంత్రాంగము వద్దనున్న సమాచారమునైనను సేకరించుకొనే హక్కును సమాచార హక్కు చట్టము 2005 కల్పించుచున్నది. అంటే, సదరు సమాచారమును కలిగిన [[పనులు]], [[పత్రాలు]], రికార్డులు తనిఖీ చేసేందుకు, వాటి యొక్క నోట్సు తీసుకొనేందుకు, ధ్రువీకృత ప్రతులు పొందేందుకు, ఏదైనా పదార్ధము యొక్క ధ్రువీకృత నమూనాలు పొందేందుకు, కంప్యూటర్ లేదా ఏదైనా పరికరములో నిక్షిప్తము చేయబడిన సమాచారమును డిస్కెట్లు, ప్లాపీలు, టేపులు, వీడియో కేసెట్లు లేదా ఏ ఇతర [[ఎలెక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ|ఎలక్ట్రానిక్]] రూపములో గాని లేదా వాటి ప్రింట్లు గాని పొందేందుకు లేదా సమాచారమును[[సమాచారము]]<nowiki/>ను సేకరించుకొనే హక్కును సమాచార హక్కు చట్టము అందుబాటులోకి తెచ్చింది.
 
== అన్వయింపులు ==
ప్రభుత్వం, న్యాయ, శాసన వ్యవస్థల సంస్థలు, ప్రభుత్వం ఇచ్చే పాక్షిక నిధులతో నడిచే సంస్థలు పౌరులు కోరిన సమాచారాన్ని ఇవ్వాలి. అంటే జిల్లాపరిషత్ లు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీలు, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఇతర రెవిన్యూ అధికార కార్యాలయాలు, విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖ, [[విశ్వవిద్యాలయాలు]], ప్రభుత్వ [[బ్యాంకులు]], సంస్థలు మొదలైనవన్నింటికి ఈ చట్టం అన్వయిస్తుంది.
కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వం నిర్దేశించిన భధ్రతా లేక గూఢచార సంస్థలకి మినహాయింపు ఉంది. అయితే, అవినీతి ఆరోపణలు మరియు మానవ హక్కుల అతిక్రమణలకు సంబంధించిన సమాచార విడుదల సందర్భములో ఈ మినహాయింపు వర్తించదు. ఈ చట్టము క్రింద కొన్ని నియమాల క్రింద సమాచారమును ఇచ్చేందుకు మినహాయింపు ఉంది. అయితే, వాటిలో '''బహుళ ప్రజా ప్రయోజనము''' దృష్ట్యా సమాచారము ఇచ్చేందుకు కూడా అవకాశము ఉంది.
 
పంక్తి 30:
 
=== ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల ఆస్తి పాస్తుల వివరాలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఇవ్వాలి.===
ఆలిండియా సర్వీసుల (విధుల నిర్వహణ) చట్టం -1968 లోని 16వ నిబంధన ప్రకారం ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఎఫ్.ఎస్ అధికారులు తమ స్థిరాస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. అధికారుల ఆస్తివివరాల గురించి సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్, [[న్యూఢిల్లీ]], ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ తీర్పులిచ్చింది..
 
==అమలుపై సమీక్ష, విమర్శలు==
"https://te.wikipedia.org/wiki/సమాచార_హక్కు" నుండి వెలికితీశారు