దాసరి మారుతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
'''దాసరి మారుతీ ''' ఒక తెలుగు సినిమా దర్శకుడు.
==నేపథ్యము==
ఇతడిది [[మచిలీపట్నం]]. పేదరికంలో పెరిగాడు. వీళ్ళ నాన్న బండ్ల మీద అరటిపళ్లు అమ్మేవాడు. అమ్మ టైలరింగ్ చేసేది. ఇతను మొదట్లో వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడు. కష్టాల మధ్యే డిగ్రీ పూర్తి చేశాడు. టూడీ [[యానిమేషన్]] నేర్చుకోవాలన్న సంకల్పంతో 1998లో[[1998]]లో [[హైదరాబాదు]] వచ్చేశాడు. నిజాంపేటలోని వీళ్ళ అక్క వాళ్లింటో మొదటి నివాసము.
 
ఆ రోజుల్లో నిజాంపేటకు బస్సులు తక్కువ. ఆటోలు కూడా వచ్చేవి కావు. జేఎన్‌టీయూ నుంచి నిజాంపేట వరకూ నడిచేవాడు. [[జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం|జూబ్లీహిల్స్‌]]<nowiki/>లోని హార్ట్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో టూడీ [[యానిమేషన్]] కోర్స్‌లో చేరాడు. ఉదయం పదింటికే [[నిజాంపేట్|నిజాంపేట]] నుంచి సైకిల్ మీద జేఎన్‌టీయూ బస్టాప్ చేరుకునేవాడు. తెలిసిన వాళ్ల షాప్ దగ్గర సైకిల్ పార్క్ చేసి [[బస్సులు]] మారి రెండింటికి ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేవాడు. ఐదింటికి క్లాస్ అయిపోయాక బయల్దేరితే.. ఇంటికి చేరుకునే సరికి రాత్రి తొమ్మిది దాటేది. ఇలా చదువు కన్నా జర్నీకే ఎక్కువ టైం పట్టేది.
"https://te.wikipedia.org/wiki/దాసరి_మారుతి" నుండి వెలికితీశారు