చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
[[దస్త్రం:MylaporeKapaleeshwararTemple.jpg|thumb|250px| చెన్నై నగరము (మైలాపూర్)లోని అతి ప్రాచీనమైన [[కపాలేశ్వర దేవాలయం]]{{Fact|date=February 2007}}.]]
చెన్నై పట్టణానికి క్రీ.శ. ఒకటో శతాబ్దం నుండి చరిత్ర ఉంది. ఈ నగరము రాజకీయంగాను, వాణిజ్యపరముగాను, సైనికపరముగాను, అధికార నిర్వహణపరముగాను శతాబ్ధాలనుండి ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశ ప్రముఖ సామ్రాజ్యాలు పరిపాలించాయి. వీరిలో ముఖ్యముగా [[పల్లవులు]], [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర రాజులు]],[[పాండ్యులు]], [[చోళులు]] ముఖ్యమైనవారు. ఇప్పుడు చెన్నై నగరములో ఒక ప్రాంతమైన [[మైలాపూరు]] [[పల్లవులు]] రాజ్యము చేస్తున్న సమయములో ఒక ప్రముఖ నౌకాశ్రయము (ఓడ రేవు).
[[1522]] సంవత్సరములో [[పోర్చుగీసు]] వారు ఇక్కడకు వచ్చారు. వారు క్రైస్తవ గురువైన ''సంత థామస్'' పేరు మీద మరో ఓడరేవును నిర్మించుకొని దానికి సెయింట్ టోమ్ అని పేరు పెట్టారు. థామస్ ఇక్కడ 1552-70 మధ్య సంవత్సరాలలో మత ప్రచారం చేసాడు. ఆ తరువాత పోర్చుగీసు వారి ప్రాబల్యం తగ్గింది. [[1612]]లో [[డచ్]] వారి ప్రాబల్యం పెరిగింది. డచ్చివారు డచ్ ఇండియా కంపెనీని చెన్నై నగరానికి ఉత్తరంగా [[పులికాట్]]లో ఏర్పాటు చేసుకొన్నారు. [[1639]] [[ఆగష్టు 22]]వ తారీఖు (దీనినే ''ఫ్రానిన్స్ డే'' అంటారు) బ్రిటీష్ వారు అప్పటి విజయనగర రాజైన పెద వేంకటరాయలు అనుమతితో కోరమాండల్ తీరములో చిన్న భాగాన్ని [[ఈస్ట్ ఇండియా కంపెనీ]] స్థావరాన్ని పెట్టుకోవడానికి, వర్తకం జరుపుకోవడానికి తీసుకొన్నారు. ఈ ప్రదేశం అప్పట్లో వండవాసి పాలకుడు దామెర్ల వేంకటపతి నాయకుని ఆధ్వర్యములో ఉండేది. ఒక ఏడాది పోయాక సెయింట్ జార్జి కోటను బ్రిటీష్ వారు నిర్మించుకొన్నారు. తరువాత కొన్ని రోజులలో ఈ ప్రదేశము అంతా వారి వలసకు కేంద్ర స్థావరము అయ్యింది. [[1746]] సంవత్సరములో సెయింట్ జార్జి కోటను [[ఫ్రెంచ్]]వారు ''జనరల్ బెర్టండ్ ఫ్రానిన్స్ మహె డి లా బౌర్డన్నాయిస్'' (మారిషస్ గవర్నర్) నేతృత్వంలో ఆక్రమించుకొన్నారు. 1749లో మళ్లీ [[ఆంగ్లేయులు]] ఈ ప్రదేశము మీద తమ పెత్తనాన్ని ''ఐక్స్ లా చాఫెల్ సంధి''తో సంపాదించుకొన్నారు. ఆధిపత్యాన్ని సంపాదించుకొన్నాక ఫ్రెంచ్ వారి ఆక్రమణల నుండి మరియు మైసూర్ సుల్తాన్ [[హైదర్ అలీ]] ఆక్రమణల నుండి రక్షించుకోవడానికి తమ బలగాలను ద్విగుణీకృతము చేసి రక్షణను పటిష్ఠం చేసుకొన్నారు. 18వ శతాబ్దం వచ్చేసరికి ఇప్పటి [[తమిళనాడు]]లోని చాలా భాగం, [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్ణాటక]] రాష్ట్రాలలోని కొంత భాగాలతో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు (చెన్నై) రాజధానిగా ఏర్పాటు చేసుకొన్నారు. [[బ్రిటీష్]] వారి పరిపాలనలో నగరం వృద్ధి చెందింది మరియు ప్రముఖ యుద్ధ నౌకాస్థావరముగా కూడా మారింది. బ్రిటిష్ హయామ్ లో, ఈ నగరం పెద్ద నగరప్రాంత కేంద్రంగానూ మరియు ఓడరేవుల మూలంగానూ మారినది. భారతదేశంలో [[రైల్వేలు]] ప్రవేశపెట్టబడిన తరువాత, ఇది [[ముంబై]] మరియు [[కోల్కతా]] నగరాలతో అనుసంధానం చేయబడింది. ఈ అనుసంధాన వలన, మార్గాలు, కమ్యూనికేషన్లు స్థిరపడ్డాయి. ఈ నగరం [[:en:Madras State|మద్రాసు స్టేట్]] యొక్క రాజధానిగా యేర్పడినది. మద్రాసు రాష్ట్రం పేరును 1969లో తమిళనాడుగా మార్చారు.
 
== నగర రవాణా వ్యవస్థ ==
చెన్నైని దక్షిణ భారతదేశానికి ముఖ ద్వారంగా పిలుస్తారు. చెన్నై నగరం దేశ నలుమూలలతోనూ మరియు అంతర్జాతీయ స్థానాలకు కలపబడుతోంది. చెన్నై నుండి ఐదు జాతీయ రహదారులు [[కలకత్తా]], [[బెంగుళూరు]], [[తిరుచినాపల్లి]], [[తిరువళ్ళూరు]] మరియు [[పుదుచ్చేరి]].<ref name=transport>{{cite web | title= GIS database for Chennai city roads and strategies for improvement | work=Geospace Work Portal | url=http://www.gisdevelopment.net/application/Utility/transport/utilitytr0001.htm| accessmonthday=August 4|accessyear=2005}}</ref>కి బయలు దేరుతాయి. కోయంబేడు లోని చెన్నై మఫిసిల్ బస్ టర్మినస్ (సి.యం.బి.టి.) నుండి తమిళనాడు బస్సు సర్వీసులు మరియు అంతరాష్ట్ర బస్సు సర్వీసులు బయలు దేరుతాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏడు రవాణా సంస్థలు నగరంతో పాటూ, తమిళనాడు రాష్ట్రంలోనూ, అంతర్-రాష్ట్ర బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడు సంస్థలు కాకుండా అనేక ప్రైవేటు రవాణా సంస్థలు కూడా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/చెన్నై" నుండి వెలికితీశారు