ఆండీ రాబర్ట్స్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: 1951, జనవరి 29 న జన్మించిన '''ఆండీ రాబర్ట్స్''' (Anderson Montgomery Everton 'Andy' Roberts) [[వెస...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1951]], [[జనవరి 29]] న జన్మించిన '''ఆండీ రాబర్ట్స్''' (Anderson Montgomery Everton 'Andy' Roberts) [[వెస్ట్‌ఇండీస్]] కు చెందిన మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు. ఫాస్ట్ బౌలర్ అయిన ఇతడు ఒకే టెస్ట్ ఇన్నింగ్సులో 7 వికెట్లను రెండు సార్లు సాధించాడు. [[970]] దశకం రెండో భాగం నుంచి [[1980]] దశకం తొలి భాగం వరకు వెస్ట్‌ఇండీస్ కు ప్రాతినిద్యం వహించిన ప్రముఖ చతుర్దయంలో ఇతడు ఒకడు. మిగితా ముగ్గురు [[మైకెల్ హోల్డింగ్]], [[జోయెల్ గార్నర్]] మరియు [[కొలిన్ క్రాఫ్ట్]]. వెస్ట్‌ఇండీస్ విజయం సాధించిన [[1975]] మరియు [[1979]] ప్రపంచ కప్ క్రికెట్‌కు ఇతడు ప్రాతినిద్యం వహించాడు. ఫైనల్లో [[భారతదేశం|భారత్]] చేతిలో భంగపడిన [[1983]] ప్రపంచ కప్‌లో కూడ ఆడినాడు.
 
రాబర్ట్స్ 47 టెస్టులు ఆడి 202 వికెట్లు సాధించాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 11 సార్లు, ఒకే టెస్టులో 10 వికెట్లను 2 సార్లు సాధించాడు. టెస్టులలో అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 54 పరుగులకు 7 వికెట్లు. వన్డేలలో 56 మ్యాచ్‌లు ఆడి 87 వికెట్లు పడగొట్టినాడు. వన్డేలలో అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 22 పరుగులకు 5 వికెట్లు.
 
 
[[en:Andy Roberts]]
"https://te.wikipedia.org/wiki/ఆండీ_రాబర్ట్స్" నుండి వెలికితీశారు