అరుణా అసఫ్ అలీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
→‎కుటుంబము: +విస్తరణ
పంక్తి 7:
==కుటుంబము==
అరుణ తండ్రి ఉపేంద్రనాథ్ గంగూలీ తూర్పు బెంగాల్లోని బరిసాల్ జిల్లాకు చెందినవాడు. అయితే సంయుక్త రాష్ట్రాల్లో (యునైటెడ్ ప్రావిన్స్)లో స్థిరపడ్డాడు. ఆయన ఒక రెస్టారెంటు యజమాని మరియు సాహసికుడు. ఈమె తల్లి అంబాలికా దేవి, అనేక హృద్యమైన బ్రహ్మసమాజ ప్రార్ధనాగీతాలు రచించిన ప్రముఖ బ్రహ్మజ నాయకుడు [[త్రైలోక్యనాథ్ సన్యాల్]] యొక్క కూతురు. ఉపేంద్రనాథ్ గంగూలీ యొక్క చిన్నతమ్ముడు [[ధీరేంద్రనాథ్ గంగూలీ]] తొలితరం భారతీయ సినిమా దర్శకుడు. ఇంకో సోదరుడు నాగేంద్రనాథ్, ఒక మృత్తికా జీవశాస్త్రజ్ఞుడు, [[రవీంద్రనాథ్ టాగూర్]] యొక్క జీవించి ఉన్న ఏకైక కుమార్తె మీరాదేవిని పెళ్ళిచేసుకున్నాడు. కానీ, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు విడిపోయారు. అరుణ సోదరి, [[పూర్ణిమా బెనర్జీ]] భారత రాజ్యాంగ సభలో సభ్యురాలు.
 
==స్వాతంత్ర్యోద్యమం: తొలి రోజులు==
వివాహము తర్వాత అరుణ [[భారత జాతీయ కాంగ్రేసు]]లో క్రియాశీలక సభ్యురాలై [[ఉప్పు సత్యాగ్రహము]]లో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలలో పాల్గొన్నది. ఈమెను [[దిమ్మరితనము|దేశదిమ్మరి]] అనే అభియోగము మోపి అరెస్టు చేశారు. అందువల్ల రాజకీయ ఖైదీలందరి విడుదలకు తోడ్పడిన గాంధీ-ఇర్వింగ్ ఒప్పందముతో 1931లో ఈమెను విడుదల చేయలేదు. అరుణతో పాటు ఖైదులో ఉన్న ఇతర మహిళా ఖైదీలు అరుణను విడుదల చేసేవరకు జైలును వదిలి వెళ్ళేది లేదని పట్టుబట్టారు. మహాత్మా గాంధీ కలుగజేసుకోవటంతో కానీ వీరు తమ పట్టును సడలించలేదు. ఆ తరువాత ప్రజాఆందోళన వలన ఈమెను విడుదల చేశారు.
 
1932లో తీహార్ జైళ్ళో రాజకీయ ఖైదీగా ఉండగా అరుణ జైల్లో రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష నిర్వహించింది. ఈమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైళ్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది కానీ ఈమెను అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు. జైలునుండి విడుదలైన తర్వాత ఈమె రాజకీయాలలో పాల్గొనలేదు.
 
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]
"https://te.wikipedia.org/wiki/అరుణా_అసఫ్_అలీ" నుండి వెలికితీశారు