కాసర్ల శ్యామ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
సినిమాలకు రాకముందు కాసర్లశ్యాం వేలాది జానపద గీతాలు రాసి పాడాడు. వాటిని ఆల్బమ్స్‌గా కూడా తీసుకువచ్చాడు. సుమారు 50పైగా ఆల్బ్‌మ్స్‌కు ఆయన [[పాటలు]] రాశారు. “కాలేజీ పిల్ల చూడరో..యమ ఖతర్నాక్‌గుందిరో..” అనే పాట శ్యాం రాసిన తొలిపాట. మస్తుగుంది పోరి, గల్ గల్ గజ్జెలు వంటి అనేక ప్రైవేటు ఆల్బమ్స్ ఆయన చేసినవే.
 
2003లో ప్రముఖ దర్శకురాలు బి.జయ దర్శకత్వంలో వచ్చిన ‘చంటిగాడు’ సినిమాతో శ్యాంకు తొలి అవకాశం దక్కిది. ఆ చిత్రంలో ‘కోకోకో .. కొక్కొరోకో’ పాటతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుసగా అనేక సినిమాలకు సందర్భానుసారంగా తాను రాసిన పాటలకు సినిమాల్లోకి తీసుకోవడంతో పరిశ్రమలో గేయ రచయితగా మంచి స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో శ్రీకాంత్‌ హీరోగా విడుదలైన ‘మహాత్మ’ సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి అంటూ రాసిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ హీరోగా వచ్చిన పటాస్‌ లో రాసిన ఓ పాట కూడా విశేష గుర్తింపు తెచ్చింది.2017లో వచ్చిన ''లై'' చిత్రంలో "బొమ్మోలే ఉన్నదిరా పోరి" అంటూ తనదైన జానపద బాణీని జోడించి రాసిన పాట సరికొత్త వైవిధ్యతతో అందరినీ ఆకట్టుకుంటుంది, అలరించింది.
 
 
"https://te.wikipedia.org/wiki/కాసర్ల_శ్యామ్" నుండి వెలికితీశారు