హెచ్.వి.నంజుండయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''హెబ్బళలు వేల్పనూర్ నంజుండయ్య''' (1860 – 1920) మైసూర్ దీవాన్, మైసూర్ విశ్వవిద్యాలయం యొక్క వ్యవస్థాపకుడు మరియు మొట్టమొదటి ఉపకులపతి, మైసూరు రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయాధిపతి, మరియు [[కన్నడ సాహిత్య సమ్మేళనం]] వ్యవస్థాపక అధ్యక్షుడు. <ref>{{cite web|title=Honouring Malleswaram’s eminent residents|url=http://www.thehindu.com/news/cities/bangalore/honouring-malleswarams-eminent-residents/article7984814.ece|website=The Hindu|accessdate=14 December 2015}}</ref> ఇతడు 1915 నుండి 1917 వరకు బెంగళూరు, మైసూరులలో జరిగిన కన్నడ సాహిత్య సమ్మేళనాలకు అధ్యక్షత వహించాడు. ఇతడు ప్రపంచంలోని మానవజాతి శాస్త్రవేత్తలలో మొదటి తరంవాడు.<ref>{{cite web|url=http://www.krazykioti.com/articles/anthropology-was-not-all-white-males-early-ethnographies-by-women-and-persons-of-color/ |title=Anthropology was Not All White Males: Early Ethnographies by Women and Persons of Color « Krazy Kioti – the Gene Anderson website |publisher=Krazykioti.com |date=2012-01-09 |accessdate=2013-10-24}}</ref> ఇతడు మైసూరు జాతులు, కులాలపై 1906లో ఒక ప్రభావశీలమైన గ్రంథాన్ని రచించాడు.<ref>[http://library name=హెచ్.gipeవి.ac.in/xmlui/bitstream/handle/1/421/6-012043.pdf?sequence=1]నంజుండయ్య {{dead link|date=October 2013}}</ref> మరికొన్ని న్యాయసంబంధ గ్రంథాలను కూడా వ్రాశాడు.
 
ఇతడు [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఎ., ఎం.ఎల్. చదివాడు. ఇతడు 1920లో మరణించే నాటికి మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్నాడు. అంతకు ముందు ఇతడు మైసూరు రాష్ట్రం హైకోర్టులో సీనియర్ జడ్జిగా, తరువాత మైసూరు రాజ్యానికి దీవాన్‌గా పనిచేశాడు.
పంక్తి 7:
[[File:H V Nandjundayya Road.jpg|thumb|మల్లేశ్వరం 6వ మెయిన్‌రోడ్డుకు నంజుండయ్య పేరు పెట్టినట్లు సూచించే బోర్డు]]
[[File:H. V. Nanjundaiah's home in Malleswaram.jpg|thumb|right|హెచ్.వి.నంజుండయ్య బాలికల ఉన్నతపాఠశాల కోసం ప్రభుత్వానికి దానం చేసిన భవనం.]]
కర్ణాటక రాష్ట్రానికి ఇతడు చేసిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా మల్లేశ్వరం 6వ మెయిన్ రోడ్డుకు ఇతని పేరును పెట్టారు.{{Citation needed|date=October 2013}}
 
ఇతడు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్‌లో కూడా మమేకమైనాడు. 1915లో మానవజాతి శాస్త్రపు ఉపాధ్యక్షుడిగా సేవలనందించాడు.<ref>{{cite book|url=https://books.google.com/books?id=qRlDwpTgJ4oC&q=hv+nanjundayya&dq=hv+nanjundayya&hl=en&sa=X&ei=pWUqT_PUJ4KzrAf2pfS9DA&ved=0CGQQ6AEwCThG |title=Journal & Proceedings of the Asiatic Society of Bengal - Google Books |publisher=Books.google.co.in |date= |accessdate=2013-10-24}}</ref>
పంక్తి 14:
 
==జీవిత విశేషాలు==
ఇతడు తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నత స్థానానికి ఎదిగాడు. ఇతడు [[1860]] [[అక్టోబర్ 13]]వ తేదీన [[మైసూరు]]లో సుబ్బయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఒక బీద కుటుంబంలో జన్మించాడు<ref name=హెచ్.వి.నంజుండయ్య>{{cite web|last1=వెబ్ మాస్టర్|title=ಎಚ್.ವಿ. ನಂಜುಂಡಯ್ಯ|url=http://kanaja.in/?tribe_events=ಎಚ್-ವಿ-ನಂಜುಂಡಯ್ಯ|website=కణజ|publisher=కణజ|accessdate=19 November 2017}}</ref>. మైసూరు మహారాజు నుండి విద్యార్థి వేతనం పొంది మైసూరులోని వెస్లియన్ హైస్కూలు, మద్రాసులోని మద్రాసు క్రిస్టియన్ కళాశాలలలో చదివి 1880లో బి.ఎ., తరువాత బి.ఎల్.,1893లో ఎం.ఎల్.పట్టాలు పుచ్చుకున్నాడు. ఇతడు 1885లో [[నంజనగూడు]]లో మున్సిఫ్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించాడు. అటు పిమ్మట [[హసన్ జిల్లా|హసన్‌]]లో అసిస్టెంట్ కమీషనర్, [[బెంగుళూరు]]లో సబ్ జడ్జి, [[శివమొగ్గ]] జిల్లా కలెక్టర్‌, మైసూరు రాజ్య ముఖ్యకార్యదర్శి, ఛీఫ్ జస్టీస్ వంటి వివిధ పదవులను చేపట్టాడు. 1916లో మైసూరు విశ్వవిద్యాలయం ప్రారంభమైనప్పుడు దానికి మొదటి ఉపకులపతిగా నియమించబడి 1920లో మరణించేవరకు ఆ పదవిలో కొనసాగాడు. ఇతడు యుక్తవయసులో ఉన్నప్పుడే ఇద్దరు భార్యలను, ఒక కుమారుని కోల్పోయాడు. తన కుమారుని స్మృత్యర్థం [[విక్టర్ హ్యూగో]] వ్రాసిన ఫ్రెంచి కవితలను "టియర్స్ ఇన్ ద డార్క్" అనే పేరుతో ఆంగ్లంలోనికి అనువదించాడు.
==సంఘసేవ==
ఇతడు తన అక్కకు సంభవించిన వైధవ్యం చూసి చలించి విధవల ఉన్నతి కోసం "విడోస్ హోమ్" ను స్థాపించాడు. హరిజనోద్ధరణ కొరకు సెంట్రల్ బోర్డింగ్ స్కూలు, హాస్టలు, కుటీర పరిశ్రమ స్థాపించాడు. స్త్రీ విద్య గురించి ప్రచారం చేశాడు. పల్లెపల్లెలో తిరిగి విద్యావసతులలోని కొఱతను గుర్తించి జాతీయ విద్యావిధానానికి పిలుపునిచ్చాడు. అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు<ref name=హెచ్.వి.నంజుండయ్య />.
 
==భాషాసేవ==
పంక్తి 23:
కన్నడ సాహిత్య సమ్మేళనాలకు మొదటి మూడు సంవత్సరాలకు ఇతడిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.<ref>{{cite web|author= |url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/article1131761.ece |title=The truth that is Kannada |publisher=The Hindu |date=2011-01-28 |accessdate=2013-10-24}}</ref>
==రచనలు==
ఇతడు బహుభాషావేత్త. ఇతడు అనేక గ్రంథాలను రచించాడు. కన్నడ భాషలో వ్యవహార దీపికె, వ్యవహార ధర్మశాస్త్ర, అర్థశాస్త్ర, లేఖ్యబోధిని, రాత్రియల్లి కంబని, ఆంగ్లభాషలో మైసూర్ ట్రైబ్స్ అండ్ కాస్ట్స్, టియర్స్ ఇన్ ద నైట్ (విక్టర్ హ్యూగో ఫ్రెంచి రచనకు ఆంగ్లానువాదం)<ref name=హెచ్.వి.నంజుండయ్య /> మొదలైనవి ముఖ్యమైన రచనలు.
 
==సత్కారాలు==
"https://te.wikipedia.org/wiki/హెచ్.వి.నంజుండయ్య" నుండి వెలికితీశారు