"సుఘ్రా హుమాయున్ మిర్జా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
సుఘ్రా, 1884లో హైదరాబాదులో సఫ్దర్ అలీ మిర్జా, మరియం బేగం దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి సఫ్దర్ అలీ మిర్జా, [[నిజాం]] సైన్యంలో కెప్టెన్ హోదా కలిగిన శస్త్రచికిత్సా వైద్యుడు. సఫ్దర్ అలీ మిర్జా తండ్రి, నిజాం అలీ ఖాన్ పాలనాకాలంలో [[టర్కీ]] నుండి హైదరాబాదుకు వలసవచ్చి స్థిరపడ్డాడు. సుఘ్రా ప్రాథమిక విద్యాభ్యాసం ఇంట్లోనే సాగింది. ఈమె 1900 డిసెంబర్లో హుమాయున్ మిర్జా అనే న్యాయవాదిని వివాహం చేసుకొంది.<ref name=hellohyd>{{cite web|title=Hyderabad History - Suogra Humayun Mirza|url=http://www.hellohyderabad.com/Hyderabad-History/Biographies/Suogra-Humayun-Mirza.aspx|website=Hello Hyderabad.com|accessdate=24 November 2017}}</ref> 1902 నుండి జాతీయ విషయాల్లో ఆసక్తి కనబరచింది.
 
1912లో బేగం [[తయ్యబా బేగం బిల్‌గ్రామీ|తయ్యబా ఖదివేజంగ్]] తో కలిసి "అంజుమనే ఖవాతీన్ దక్కన్" అనే మహిళా సంక్షేమ సంస్థను స్థాపించి, ఆ సంస్థకు కార్యదర్శిగా మూడు సంవత్సరాల పాటు పనిచేసింది.
 
1934లో ఈమె, తన తండ్రి సఫ్దర్ అలీ మిర్జా స్మారకార్ధం, మద్రస్సా-ఏ-సఫ్దరీయా అనే బాలికల ఉర్దూ మాధ్యమపు పాఠశాల స్థాపించింది. ఈ విద్యా సంస్థను నడపటానికి సఫ్దరియా ట్రస్టును ఏర్పాటుచేసి, తన ఆస్తిలో చాలామటుకు ఈ ట్రస్టుకు ధారపోసింది. సఫ్దరియా పాఠశాల నేటికి హైదరాబాదులోని హుమాయున్ నగర్ ప్రాంతంలో ఉన్నది.<ref name=towheed2007>{{cite book|last1=Towheed|first1=Shafquat|title=New Readings in the Literature of British India, c. 1780-1947|date=Oct 1, 2007|publisher=Columbia University Press|isbn=9783898216739|page=163|url=https://books.google.com/books?id=W2EZBQAAQBAJ&pg=PA163&lpg=PA163&dq=Sughra+mirza#v=onepage&q=Sughra%20mirza&f=false|accessdate=23 November 2017}}</ref><ref name=safdariafounder>{{cite web|title=The Founder|url=http://safdariaschool.com/the-founder-2/|website=Safdaria Girl High School|accessdate=24 November 2017}}</ref>
919

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2265654" నుండి వెలికితీశారు