మిర్జా మొహమ్మద్ హషీమ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
'''[[మిర్జా మొహమ్మద్ హషీమ్]]''', భారతీయ రాజకీయనాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోం శాఖామంత్రిగా పనిచేశాడు. 1971 నుండి 1980 వరకు లోక్‌సభలో [[సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం|సికింద్రబాదు నియోజకవర్గానికి]] ప్రాతినిధ్యం వహించాడు.<ref name=loksabha>{{cite web|title=6th Lok Sabha - Member Profile|url=http://164.100.47.194/loksabha/writereaddata/biodata_1_12/2105.htm|website=Lok Sabha|accessdate=13 December 2017}}</ref>
 
మొహమ్మద్ హషీం, హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్లో, మల్లేపల్లి విభాగానికి కార్పోరేటరుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1960లో జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎం.ఐ.ఎంలో అప్పుడే ఎదుగుతున్న సలావుద్దీన్ ఒవైసీ చేతిలో ఓడిపోయాడు. ఆ పరాజయంతో, తన దృష్టిని ఆసిఫాబాదు శాసనసభ ఎన్నికలపై మరల్చి, 1962 మరియు 1967లో రెండుపర్యాయాలు ఆసిఫాబాదు నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.<ref name=twocircles>{{cite news|title=Former AP Home Minister MM Hashim passes away|url=http://webcache.googleusercontent.com/search?q=cache:I04mdCE_T2oJ:twocircles.net/2013dec23/former_ap_home_minister_mm_hashim_passes_away.html+&cd=10&hl=en&ct=clnk&gl=us|accessdate=14 December 2017|work=Two Circles|date=December 23, 2013}}</ref>
 
మొహమ్మద్ హషీం, ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, నాయకత్వం వహించాడు. తెలంగాణ ఉద్యమ ఊపులో 1971లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్ధిగా సికింద్రాబాదు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. తెలంగాణ ప్రజాసమితి కాంగ్రేసు పార్టీలో విలీనమైన తర్వాత, కాంగ్రేసు అభ్యర్ధిగా తిరిగి సికింద్రాబాదు నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మొహమ్మద్ హషీం, మర్రి చెన్నారెడ్డికి రాజకీయ సన్నిహితుడు. 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు, మొహమ్మద్ హషీం ఆయన మంత్రివర్గంలో హోంశాఖా మంత్రిగా పనిచేశాడు. 1989లో చెన్నారెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పుడు, తన పిల్లల వద్ద అమెరికాలో ఉంటున్న హషీంను పిలిపించి రాజ్యసభ సభ్యున్ని చేశాడు.<ref name=toi20131224>{{cite news|title=Veteran Cong leader M M Hashim dies in US|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/Veteran-Cong-leader-M-M-Hashim-dies-in-US/articleshow/27810634.cms|accessdate=14 December 2017|work=The Times of India|date=Dec 24, 2013}}</ref>
 
1990వ దశకంలో క్రియాశీలక రాజకీయాలనుండి వైదొలగి, కుటుంబంతో సహా శాశ్వతంగా అమెరికాలో స్థిరపడ్డాడు. ఈయన సంతానమంతా అమెరికాలోనే స్థిరపడ్డారు.
 
మిర్జా మొహమ్మద్ హషీం, [[అమెరికా]]లోని బాల్టిమూర్ నగరంలో 2013, డిసెంబరు 22న మరణించాడు. ఈయనకు ఇద్దరు [[కుమారులు]], నలుగురు కుమార్తెలు.