బకర్ అలీ మిర్జా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) |
||
పంక్తి 15:
|religion=
}}
'''బకర్ అలీ మిర్జా''', భారత
బకర్ అలీ మిర్జా, 1900, మార్చి 7న [[హైదరాబాదు]]లో జన్మించాడు. ఈయన తండ్రి డాక్టర్ సఫ్దర్ అలీ మిర్జా, [[నిజాం]] సైన్యంలో కెప్టెన్ హోదా కలిగిన శస్త్రచికిత్సా వైద్యుడు. సఫ్దర్ అలీ మిర్జా తండ్రి, నిజాం అలీ ఖాన్ పాలనాకాలంలో [[టర్కీ]] నుండి హైదరాబాదుకు వలసవచ్చి స్థిరపడ్డాడు. బకర్ అలీ అక్క [[సుఘ్రా హుమాయున్ మిర్జా]] ప్రముఖ ఉర్దూ రచయిత్రి.
బకర్ అలీ విద్యాభ్యాసం హైదరాబాదులోని [[నిజాం కళాశాల]]లో, మద్రాసు క్రైస్తవ కళాశాల మరియు [[ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం|ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయా]]నికి అనుబంధితమైన సెయింట్ కేథరిన్స్ కళాశాలలో సాగింది. ఆక్ఫర్డ్లో చదివే రోజుల్లోనే, స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితుడై క్రియాశీలకంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. ఆక్స్ఫర్డ్ మజ్లిస్ సు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆక్స్ఫర్డ్ నుండి వెలువడిన భారత్ అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 1926లో ప్రాగ్లో జరిగిన అంతర్జాతీయ విద్యార్ధి సదస్సుకు సదస్యుడిగా వెళ్ళాడు. 1927లో బ్రసెల్స్‌లో జరిగిన లీగ్ ఎగెయిన్స్ట్ ఇంపీరియలిజం (సామ్రాజ్యావాద వ్యతిరేక సదస్సు) కు సదస్యుడిగా హాజరయ్యాడు.<ref name=loksabha/> బకర్ అలీ ఆక్స్‌ఫర్డ్‌లో అటవీశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. అప్పటికే క్రియాశీలక రాజకీయ విద్యార్ధిగా బ్రిటీషు ప్రభుత్వం దృష్టిలో పడిన బకర్ అలీ, లీగ్ ఎగెయిన్స్ట్ ఇంపీరియలిజం యొక్క బ్రిటీషు కమిటీకి హాజరయ్యాడని తెలుసుకొని, బకర్ అలీ చదువు పూర్తయిన తర్వాత భారతదేశం తిరిగివెళితే అక్కడ ఇండియన్ ఫారెస్టు సర్వీసులో కానీ, హైదరాబాదు ప్రభుత్వంలో కానీ ఉద్యోగం రాకుండా చేసేందుకు, సంబంధిత వర్గాలకు ఈయన సరైన
1940లో డాక్టర్ ప్రభాబతీ దాస్ గుప్తాను వివాహం చేసుకున్నాడు. ఈమె ఎం.ఏ కొలంబియా విశ్వవిద్యాలయంలోనూ, డాక్టరేటు ఫ్రాంక్ఫర్ట్ విశ్వవిద్యాలయంలోనూ చేసింది.<ref name=loksabha/> వీరికి సంతానం లేదు. బకర్ అలీ మిర్జా 1960వ దశకపు చివరిలో ఊపిరితిత్తుల కాన్సర్ తో మరణించాడు.<ref name=Fuechtner>{{cite book|last1=Fuechtner|first1=Veronika|title=A Global History of Sexual Science, 1880–1960|date=Nov 14, 2017|publisher=Univ of California Press|isbn=9780520293373|page=415|url=https://books.google.com/books?id=0Go3DwAAQBAJ&pg=PA415&lpg=PA415&dq=Bakar+Ali+Mirza+smedley#v=onepage&q=Bakar%20Ali%20Mirza%20smedley&f=false|accessdate=16 December 2017}}</ref>
|