యానాదులు: కూర్పుల మధ్య తేడాలు

చి Added IAST.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[యానాదులు]]([[అంతర్జాతీయ సంస్కృత లిప్యంతరీకరణ వర్ణమాల|అ.సం.లి.వ.]]: Yānādulu) అనగా ఒక సంచార గిరిజన [[తెగ]]కు చెందిన ప్రజలు. యానాద కులం [[ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా]] లో 32వ కులం. [[నల్లమల]] అడవుల నుంచి [[నెల్లూరు]] [[సముద్రతీరం]] వరకూ విస్తరించిన యానాదులు, సామాజిక పరిణామంలో [[ఆహారం|ఆహార]] సేకరణ దశకు చెందిన జాతి. ఒక యానాదికి భూస్వామి మణియంకు, మధ్య జరిగిన సంఘర్ణణను డా॥ కేశవరెడ్డి ‘‘చివరి గుడిసె’’ నవలలో చిత్రించారు. [[గిరిజనులు|గిరిజనుల]] కళల్లో ముఖ్యమైనది చిందు నాట్యం. [[యానాదులు]], [[ఎరుకలు]], [[సుగాలీలు]] పండుగ పర్వదినాలలో చిందులేస్తారు. వివిధ పురాణ పాత్రలు గూడా ధరిస్తారు. యానాదులు ‘రంగము’ అనే ఆట ఆడతారు. ఏదైనా వస్తువు పోయిందని తెలిస్తే బాగా [[సారాయి]] తాగి వాద్యం వాయిస్తూ నృత్యం చేస్తూ వారి కులదైవాన్ని గొంతెత్తి ఆలపిస్తారు. వారి దేవత వారి శరీరంలో ప్రవేశించి ([[పూనకం]] వచ్చి) పోయిన వస్తువు జాడ తెలుపుతుంది. [[చిత్తూరు జిల్లా]], [[కుప్పం]] మండలంలో [[యానాదిపల్లె]] అనే ఓ గ్రామం ఉంది. ఎక్కడికక్కడ వీరు నివాస స్థలాలను అమ్మి వేరే ప్రాంతాలకు తరలిపోతూ ఉంటారు. గ్రామాలలో [[రైతులు|రైతుల]] పొలాలలో కూలికి [[ఎలుకలు]] పడుతూ కొంతమంది జీవిస్తున్నారు. [[తెలుగు]] భాషకు మూలపురుషులు యానాదులేనని కత్తి పద్మారావు లాంటివారి వాదన.
ప్రముఖ జానపద పరిశోధకులు వెన్నెలకంటి రాఘవయ్య యానాదులపై చేసిన పరిశోధనకు గుర్తింపుగా ఆయనను యానాది రాఘవయ్యగా పిలుస్తారు.
 
=== శబ్ద్యోత్పత్తి(ఎటిమాలజీ) ===
తెలుగు భాషలోని చాలా పదాలలాగే '''యానాదులు''' అనేది ఒక [[సంస్కృతము|సంస్కృత]] పదం నుండి పుట్టిన పదంగా తెలుస్తున్నది. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ పదాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. యానాది అనేది '''అనాది''' యొక్క శబ్ద రూపాంతరం కావచ్చు. అనాది అనగా ఆది లేనిది, అంటే మొదలు లేనిదని అర్థం. అంటే అప్పట్లోని మిగతా తెగల వారికి వీరి యొక్క మూలం తెలియక అలా వ్యవహరించి ఉండవచ్చు. ఒక విధంగా వారు పురాతనమైనవారు అన్న అర్థం వస్తుంది.<ref name=":0">Page no.6 Origin of the Yanadi http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/106382/8/08_chapter-iii.pdf</ref> అదే కాకుండా [[:en:Yana_(Buddhism)#Nomenclature,_etymology_and_orthography|యానా]] (నిజానికి య <ref>Yana, <abbr>aka</abbr>: Yāna; 6 Definition(s)[https://www.wisdomlib.org/definition/yana]</ref>) అనేది సంస్కృతంలోని ఒక మూల పదం కూడా. ఉదాహరణకు[[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>కు ప్ర'''యా'''ణం, విమాన'''యా'''నం. దీని అర్థం గమనానికి సంబంధించింది. దీనిని బట్టి వీరు సంచార జాతికి చెందిన వారు కాబట్టి ఆ పేరు వచ్చి ఉండవచ్చని మరి కొందరి అభిప్రాయం.<ref name=":0" />
 
==యానాదులపై నవలలు,కథలు==
"https://te.wikipedia.org/wiki/యానాదులు" నుండి వెలికితీశారు