జోళదరాశి దొడ్డనగౌడ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కన్నడ ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కర్ణాటక ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయో...
పంక్తి 1:
'''జోళదరాశి దొడ్డనగౌడ''' గాయకుడిగా, నటుడిగా, కన్నడాంధ్ర కవిగా, నాటకకర్తగా, ప్రయోక్తగా, వీరశైవతత్వజ్ఞుడిగా ప్రసిద్ధుడు.
==జీవిత విశేషాలు==
[[దస్త్రం:Joladarasi doddanagowda.jpg|right|thumb|200px| జోళదరాశి దొడ్డనగౌడ]]
జోళదరాశి దొడ్డనగౌడ [[బళ్లారి జిల్లా]] జోళదరాశి గ్రామంలో [[1910]], [[జూన్ 27]]వ తేదీన ఒక సంపన్న రైతు కుటుంబంలో పంపనగౌడ, రుద్రమ్మ దంపతులకు జన్మించాడు<ref>{{cite news|last1=జానమద్ది|first1=హనుమచ్ఛాస్త్రి|title=గమక కళానిధి శ్రీ జోళదరాశి దొడ్డన గౌడ|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=10996|accessdate=29 December 2017|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 66, సంచిక 64|date=14 October 1979}}</ref>. ఇతడు బాల్యం నుండే సంగీత, నాటక, సాహిత్యాలపై అమితమైన ఆసక్తిని కనబరచాడు. స్వగ్రామంలోనే నాటక సంఘాన్ని నెలకొల్పి "గరుడ గర్వభంగ" అనే నాటకాన్ని ప్రదర్శించి ప్రముఖ నటుడు [[బళ్ళారి రాఘవ]] ప్రశంసలందుకున్నాడు. ఆనాటి నుండి వారిద్దరి మధ్య అనుబంధం బలపడి తెలుగు, కన్నడ నాటకరంగానికి ఒక కొత్త వెలుగు నిచ్చింది. ఇతడు వ్రాసిన కన్నడ నాటకాలు బసవేశ్వర, కనకదాసులలో బళ్ళారి రాఘవ ప్రధాన పాత్రలను ధరించాడు. రాఘవ నాటకబృందంలో సభ్యుడిగా ఇతడు బెంగుళూరు, విజయవాడ, హైదరాబాదు, ఢిల్లీ, రంగూన్ మొదలైన పలు పట్టణాలలో ప్రదర్శనలిచ్చాడు. కబీరు, నారదుడు, కృష్ణుడు, రాముడు మొదలైన పాత్రలను ధరించి ప్రేక్షకుల మెప్పును పొందాడు. ఇతడు బళ్ళారి జిల్లా నాటకకళాపరిషత్తును స్థాపించాడు. [[బళ్లారి]]లో రాఘవ కళామందిరం నిర్మాణంలో కృషి చేశాడు. స్వగ్రామంలో రామేశ కళామందిరాన్ని నిర్మించాడు. ఇతడు శివభక్తుడు. శరణకవిగా ఇతడు కళారాధనతో పాటు మత, వేదాంత తత్త్వ ప్రచారాలను చేశాడు. ఇతడు రైతుగా, గ్రామ పంచాయితీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు.
 
==రచనలు==
ఇతడు కన్నడ భాషలో 30కి పైగా కావ్యాలు, నాటకాలు, కవితా సంపుటాలను వెలువరించాడు. తెలుగులో "గేయ గుంజారము", "వచనామృతము", "శూన్య సంపాదనము" మొదలైన గ్రంథాలను రచించాడు. ఇతని జీవిత చరిత్ర "నందే నానోదిదే" అనే పేరుతో కన్నడ భాషలో వెలువడింది. ఇది తెలుగులో "అనుభవాలు - జ్ఞాపకాలు" పేరుతో తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణగా వెలువడింది.
"https://te.wikipedia.org/wiki/జోళదరాశి_దొడ్డనగౌడ" నుండి వెలికితీశారు