విజయనగర సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 82:
{{విజయనగర సామ్రాజ్యం}}
 
'''విజయనగర సామ్రాజ్యాని'''కి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావని మొత్తం తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన [[ధర్మము]], [[సంస్కృతి]], వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర [[విజయనగరం|విజయనగర]] ఇతిహాసము.
 
==[[ఆనెగొంది]] ==
విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర (హక్క) మరియు బుక్క అనే [[అన్నదమ్ములు]] 1336 లో స్ధాపించారు. వారి [[రాజధాని]] మొదట [[ఆనెగొంది]]. [[ఆనెగొంది]] ప్రస్తుతము [[తుంగభద్ర]] ఉత్తర తీరమున ఒక చిన్న పల్లె. సామ్రాజ్యము బుక్కరాయని పరిపాలనలో అభివృద్ధి చెందిన తరువాత రాజధానిని [[తుంగభద్ర]] దక్షిణ తీరమున గల [[విజయనగరము]] నకు తరలించారు. ఈ సామ్రాజ్యం 1336 నుండి 1660 వరకు వర్ధిల్లింది. చివరి శతాబ్దాన్ని దీనికి క్షీణదశగా చెప్పుకోవచ్చు. సుల్తానుల సమాఖ్య వీరిని [[తళ్ళికోట యుద్ధం]]లో దారుణంగా ఓడించింది. సుల్తానుల సైన్యం రాజధానిని ఆరునెలల పాటు కొల్లగొట్టి, నేలమట్టం చేసింది. ఈ సామ్రాజ్యపు స్థాపన వివరాలూ, దాని చరిత్రలో ఎక్కువ భాగం అస్పష్టంగా ఉన్నాయి; కానీ దాని శక్తీ, అర్ధిక పుష్టి లను [[పోర్చుగీసు]] యాత్రికులైన డోమింగో పేస్‌, నూనిజ్‌ వంటి వారే కాక మరి కొందరు కూడా నిర్ధారించారు.
 
''రాయలవారి రెండో రాజధాని [[పెనుగొండ]]. ప్రస్తుతం గంగావతి, [[ఆనెగొంది]]<nowiki/>లో రాయల వంశానికి చెందిన 17వ తరం వారున్నారు. ఆనెగొందిలో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా రాయల వారి ఇంటి నుంచే [[తాళిబొట్టు]] వెళుతుంది. ముస్లింలు[[ముస్లిం]]<nowiki/>లు సైతం ఏ పండుగ వచ్చినా నమాజ్ చేసిన తర్వాత నేరుగా రాయలవారి ఇంటికే వెళ్లి వారికి [[శుభాకాంక్షలు]] చెప్పిన తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలుపెడతారు. ఈ ఆచారం వందల సంవత్సరాలుగా ఆ గ్రామంలో కొనసాగుతోంది.''
 
శ్రీరంగనాథస్వామి దేవాలయం, నవ బృందావనం, ఉచ్చప్పయ్య మఠం, 64 స్తంభాల మండపం, చింతామణి ఆలయం, గజశాల, ఒంటెశాల, ఆదిశక్తి దుర్గాదేవి ఆలయం, మేల్కోటే, గవి రంగనాథస్వామి దేవాలయం, పంపా సరోవరం (విజయలక్ష్మి దేవస్థానం), అంజినాద్రిబెట్ట ఆలయాలన్నింటిలోనూ రాయల కుటుంబీకుల ఆధ్వర్యంలోనే హోమాలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. రాయల కుటుంబీకుల్లో ఎవరి [[పెళ్ళి|వివాహం]] నిశ్చయమైనా మొదట [[హంపి]]లోనే పూజలు చేస్తారు.''
"https://te.wikipedia.org/wiki/విజయనగర_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు