టచ్ చేసి చూడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[టచ్ చేసి చూడు]] ''' 2018 ఫిబ్రవరి 2న విడుదలైన తెలుగు సినిమా.
==కథ==
పాండిచ్చేరిలో నివ‌సించే కార్తికేయ ఇండ‌స్ట్రీస్ అధినేత కార్తికేయ (ర‌వితేజ‌) కి కుటుంబం అంటే చాలా ప్రేమ‌. కుంటుంబానికి చెడ్డ పేరు తెచ్చే ఏ ప‌ని చేయ‌కూడ‌ద‌ని అనుకునే స్వ‌భావం ఉన్న వ్య‌క్తి. ర‌వితేజ తండ్రి( జ‌య‌ప్ర‌కాష్‌)కి కొడుకు పెళ్లి చేసుకోవ‌డం లేద‌నే బాధ ఉంటుంది. తండ్రి బాధ‌ను చూడ‌లేక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ర‌వితేజ‌. అందుకోసం పుష్ప‌(రాశిఖ‌న్నా)ను పెళ్లి చూపుల్లో చూస్తాడు. ఆడవారితో ఎలా మాట్లాడాలో తెలియ‌ని కార్తికేయ, పుష్ప‌ మనసును రెండు సార్లు గాయపరుస్తాడు. దాంతో పుష్ప.. కార్తికేయ‌ను పెళ్లి చేసుకోన‌ని చెబుతుంది కానీ ఆమెకు కార్తికేయ అంటే ప్రేమ ఉంటుంది. ఆ ఇష్టం కార‌ణంగానే అత‌నికి వేరే అమ్మాయితో జరిగే పెళ్లి సంబంధాన్ని కూడా అడ్డుకుంటుంది. ఒకానొక సంద‌ర్భంలో ఆ విష‌యం తెలిసిన కార్తికేయ ఆమెతో పెళ్లిని నిరాక‌రిస్తాడు. మ‌రోవైపు కార్తీకేయ సంస్థకు వ‌చ్చే యంత్రపరికరాలను సెల్వమ్ అనే గూండా లాక్కెళ్లిపోతాడు. ఈ విష‌య‌మై కార్తికేయ పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోరు. రెండు నిమిషాల్లో స‌మ‌స్య‌ను పరిష్కారం చేయ‌వ‌చ్చునని.. కానీ పోలీసులు స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటాడు కార్తికేయ‌. దాంతో స్థానిక సీఐకి కోపం వ‌స్తుంది. కార్తికేయ‌కు రెండు నిమిషాల స‌మ‌యం ఇచ్చి స‌మ‌స్య‌ను తీర్చుకోమంటాడు. కార్తికేయ బలం ఏంటో అక్క‌డ తెలుస్తుంది. అదే స‌మ‌యంలో కార్తికేయ సంస్థలో ప‌నిచేసే వ్య‌క్తి త‌న‌యుడు స‌త్య‌ను ఎవ‌రో హత్య చేస్తారు. ఆ హ‌త్య‌ను కార్తికేయ చెల్లెలు చూసి త‌న అన్న‌కు చెబుతుంది. నేరం చేసిన వ్య‌క్తిని ఇర్ఫాన్ లాలా గా గుర్తిస్తుంది. అప్ప‌టికే చ‌నిపోయిన ఇర్ఫాన్ ఎలా తిరిగి వ‌చ్చాడు? గ‌తంలో కార్తికేయ‌కు, ఇర్ఫాన్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఇర్ఫాన్ చ‌నిపోయాడ‌ని క‌మిష‌న‌ర్ (ముర‌ళీశ‌ర్మ‌) ఎందుకు కార్తికేయ‌కు అబద్ధం చెప్పాడు? ముజ‌ఫ‌ర్ పేట గొడ‌వ‌లు ఏంటి? అక్క‌డ లాలా ఎవ‌రు? గ‌తంలో నిశ్చితార్థం వ‌ర‌కు వ‌చ్చిన కార్తికేయ పెళ్లి ఎందుకు ఆగిపోతుంది? అత‌న్ని అంత‌గా ఇష్ట‌ప‌డ్డ దివ్య (సీర‌త్ క‌పూర్‌) ఎందుకు అత‌న్ని వ‌ద్ద‌నుకుంటుంది? అనే విష‌యాలు మిగిలిన కథలో భాగం.
కార్తికేయ(రవితేజ)కు తన కుటుంబమే ప్రపంచం. బంధాలకు అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటాడు. [[పాండిచ్చేరి]]<nowiki/>లో ఒక పరిశ్రమ ఏర్పాటు చేసుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతుంటాడు. ఇంతలో అతని చెల్లెలు ఓ యువకుడి హత్యను కళ్లారా చూస్తుంది. ఆ హత్యను తాను చూశానని, సాక్ష్యం చెబుతానని కార్తికేయతో అంటుంది. హత్య చేసిన నిందితుడు ఇర్ఫాన్‌లాలా( ఫ్రెడ్డీ దారువాలా) ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో అతనే ఎదురుపడతాడు. అయితే ఇర్ఫాన్‌లాలాను కార్తికేయ అంతకుముందే చంపేసినట్లు పోలీసు రికార్డుల్లో ఉంటుంది. దాంతో కార్తికేయ కూడా ఆశ్చర్యపోయి అతన్ని వేటాడటం మొదలుపెడతాడు. అసలు కార్తికేయకు ఇర్ఫాన్‌ ఎలా తెలుసు? కార్తికేయ గతం ఏంటి? అతని జీవితంలో పుష్ప(రాశీఖన్నా) దివ్య(సీరత్‌కపూర్‌) ఎలా వచ్చారు. అన్నవి కథలో భాగం.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/టచ్_చేసి_చూడు" నుండి వెలికితీశారు