సేఫ్టి వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
అవి.1.డెడ్ వెయిట్ సేఫ్టి వాల్వు,2.లివరు సేఫ్టి వాల్వు,3.[[స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు]],4. హై ప్రెసరు- లోవాటరు సేఫ్టి వాల్వు.
===డెడ్ వెయిట్ సేఫ్టి వాల్వు===
[[File:Deadweight safety valve section (Heat Engines, 1913).jpg|thumb|right|200px|డెడ్ వెయిట్ సేఫ్టి వాల్వు]]
డెడ్ వెయిట్ సేఫ్టి వాల్వు ఇళ్ళల్లో వాడు[[కుక్కర్| ప్రెసరు కుక్కరు]] ల లిడ్/మూత మీద వున్న సేఫ్టి వాల్వు వంటిదే.కుక్కరు మీద సేఫ్టి వాల్వు చిన్నదిగా వుండును.బాయిలరు లో వాడు సేఫ్టి వాల్వు పరిమాణంలో పెద్దదిగా వుండును. స్థిరమైన బరువువున్న వర్తులాకార పోతయినుము బిళ్ళలను వాల్వుమీద ఉంచేదరు. ఈ డెడ్ వెయిట్/బరువు, వాల్వుమీద కింది వైపుకు బలంగా నొక్కి వంచును అనగా అధో పీడనం కలుగ చేయును. దీనిని అధోపీడన బలం అందురు.అదేసమయంలో బాయిలరు నుండి స్టీము వాల్వు కింది నుండి పై వైపుకు బలంగా వాల్వును పైకి నెట్టే ప్రయత్నం చేస్తుంది.దానిని ఉర్ధ్య పీడనం లేదా ఉర్ధ్యబలశక్తి అంటారు. బాయిలరులో ఏర్పడిన స్టీము పీడనంకన్న సేఫ్టి వాల్వు మీది బరువు కల్గుచేయు బలశక్తి/పీడన శక్తి ఎక్కువగా లేదా సమానంగా ఉన్నంత వరకు వాల్వు తెరచు కొనదు. ఎప్పుడైతే బాయిలరు స్టీము కల్గుచేయు ఉర్ధ్య పీడనం వాల్వు కలుగచేయు పీడనాన్ని మించుతుందో అప్పుడు వాల్వు తెరచుకుని అధిక పీడనం కారణమైన స్టీము బయటికి వెళ్ళును. అధిక పీడనం తగ్గిన వెంటనే,రెండింటి పీడనం సమాన మవ్వగానే వాల్వు యధావిధిగా మూసుకొ నును.ఈ రకపు సేఫ్టి వాల్వులు [[లోకోమోటివ్ బాయిలరు]] మరియు మెరీన్ బాయిలరులలో వాడుటకు పనికి రావు. ఈ రకపు బాయిలరులు చలనంలో వున్నప్పుడు అటునిటు కదలడం వలన సేఫ్టి వాల్వు మీది స్టిర బరువు పక్కకు జరిగి పోవును.అందువలన ఇటువంటి సేఫ్టి వాల్వులు నేల మీద స్థిరంగా వుండు[[లాంకషైర్ బాయిలరు]] లకు సరిపడును.
 
===లివరు సేఫ్టి వాల్వు===
లివరు సేఫ్టి వాల్వులో ఒక పోత ఇనుముతో చేసిన కేసింగు ఉండును.దాని నిలువు రంద్రం స్టీము బయటకు వచ్చు మార్గంగా పనిచేయును.ఈ కేసింగు ఆడుగు భాగాన్ని బోల్టుల ద్వారా బాయిలరు షెల్ పై భాగాన బిగించె దరు.కేసింగు నిలువు రంద్రం/నాజిల్ పైన వాల్వు సిటింగు రింగు వుండును.ఇది [[ఇత్తడి]]తో చెయ్యబడి వుండును.దీని మీద కరెక్టుగా వాల్వు డిస్క్ లేదా వాల్వు వుండును.వాల్వు వెనుక భాగం ఒక లివరు కు బిగించబడి వుండును. లివరు ఒక చివర లివరుకు బిగించిన వాల్వు డిస్కు, వాల్వు సిటింగు మీద ఖాళి లేకుండా అతుక్కుని ఉండేలా బలాన్ని కలుగ చేయును.లివరు రెండో చివర కేసింగుకు ఒక కీలుతిరిగెడు చీల (pivot)ద్వారా అనుసంధానమై వుండును. లివరు పక్కకు జరుగకుండా ఒక లివరు గైడు రాడ్/కడ్డి వుండును.లివరు చివర వున్న బరువును ముందుకు, వెనక్కి జరపడం ద్వారా వాల్వు మీద బలప్రభావాన్ని పెంచ వచ్చు,తగ్గించ వచ్చు.లివరు బరువు వలన వాల్వు మీద అదో పీడనంను కల్గించడం వలన సిటింగుమీద వాల్వుడిస్కు బలంగా అతుక్కుని ఉండును. బాయిలరులోని స్టీము,లివరు బరువుకన్న ఎక్కువ పీడనబలాన్ని కల్గి నపుడు లివరును వాల్వును పైకి లేపడం వలన అధికంగా వున్న స్టీము బయటకు వెళ్ళును.
"https://te.wikipedia.org/wiki/సేఫ్టి_వాల్వు" నుండి వెలికితీశారు