మామిడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 110:
భారతీయ సాంప్రదాయంలో మామిడి ఆకుల [[తోరణం]] ఉత్తమమైన తోరణంగా విశ్వసిస్తారు. ప్రతి [[పండుగ]] లేక శుభకార్యం కాని మామిడి తోరణం తోటే ప్రారంభం అవుతుంది. పూజా కార్యక్రమంలో మామిడి ఆకులు చోటు చేసుకుంటాయి. దుస్తులు, దుప్పట్లు, తివాచీలు మొదలైన బట్టలమీద, నగలు, ముగ్గులు మొదలైన వాటిలోను మామిడి కాయ ఆకారం చోటు చేసుకుంది.
==ఇతర ఉపయోగాలు==
[[File:మామిడి చెట్టు (3).jpg|thumb|మామిడి చెట్టు]]
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
#ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్ (Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు.
#మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికి అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో పదిహేను శాతం (15%) చక్కెర, ఒక శాతం (1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ, బి, సి (A, B, C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా, కొన్నిజాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది, ముఖ్యంగా చిలక ముక్కు (బెంగళూరు) మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో చిన్నచిన్న వ్యాపారులు వీటిని సన్నని పోడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. ఇది చాలామందికి నోరూరించే ఆహారం.
#సున్నపు శక్తి (కాల్షియమ్) విటమిన్ బి పుష్కలంగా ఉంది కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తియ్యటి పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్ లో మామిడి కాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు.
 
==ఆయుర్వేదంలో==
#మంగళకరమైన మామిడి దీని మరో నామము. లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మవ్యాధులు నశిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/మామిడి" నుండి వెలికితీశారు